Preity Zinta : పంజాబ్ ను మరోసారి భారీ వర్షాలు ముంచెత్తిన విషయం తెలిసిందే. అయితే ఆ రాష్ట్రంలోని మొత్తం 23 జిల్లాలు వరదలకు ప్రభావితంగా మారాయి. ఈ వరదల్లో సుమారు 50 మందికి పైగా మరణించారు. పంజాబ్ లో ఇలాంటి వరదలు సంభవించడం 1998 తరువాత ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఎగువన హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ భారీ వర్షాలు కురుస్తుండటంతో సట్లేజ్, బియాస్, రావి నదులు ప్రమాదకరస్థాయి దాటి ప్రవహిస్తున్నాయి. దీంతో ఊళ్లకు ఊళ్లకు మునిగిపోతున్నాయి. పంజాబ్ లో కురుస్తున్న భారీ వర్షాలు.. జమ్మూ అండ్ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల నుంచి వచ్చే వరదల వల్ల దాదాపు పంజాబ్ లోని 1200 గ్రామాలకు పైగా నీటమునిగిపోయాయి. ముఖ్యంగా గురుదాస్, పఠాన్ కోట్, ఫాజిల్కా, తరాన్ తరాన్, కపుర్తాల, హోషియార్ పూర్, ఫిరోజ్ పూర్, అమృత్ సర్ వంటి జిల్లాల్లోని పలు గ్రామాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. దీంతో పంజాబ్ కింగ్స్ (Pubjab Kings) కో ఓనర్ ప్రీతిజింటా (Preity Zita) వరద బాధితులకు సాయం చేసేందుకు ముందుకు వచ్చింది.
Also Read : Team India: ఈ హీరోయిన్లతో రొమాన్స్ చేసి..ఎంజాయ్ చేస్తున్న టీమిండియా ప్లేయర్లు!
ప్రీతి జింటాతో పాటు పంజాబ్ కింగ్స్ (Punjab Kings) టీమ్ తరపున కూడా వరద బాధితులకు సహాయం అందిస్తోంది. “మేము అంతా కలిసి అందమైన సహాయాన్ని అందించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. పంజాబ్ కింగ్స్ (Punjab Kings), హేమ్కుంట్ ఫౌండేషన్ (Hemkunt Foundation) కలిసి ఈ కష్టమైన సమయంలో ప్రజలకు సహాయం నిలబడుతున్నాయి. మేము చేసిన అన్ని ప్రయత్నాలు నేరుగా వరద బాధిత కుటుంబాలకు సహాయం అందించడానికి ఉపయోగపడుతున్నాయి” అని పోస్ట్ చేసింది ప్రీతి జింటా. సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ పోస్ట్ చూసిన వారు ప్రీతి జింటా సహాయం చేయడం గొప్ప విషయం అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి ఆపద సమయంలో ఆదుకున్న వారే గొప్ప వ్యక్తులు అవుతారు. మంచి మనస్సు ఉండి కూడా ఆపద సమయంలో ఆదుకోని వారు గొప్ప వ్యక్తులు కాలేరు అని సోషల్ మీడియాలో రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
ఇప్పటికే పంజాబ్ లో వరద ప్రభావిత 1200 గ్రామాల్లో పంజాబ్ మంత్రులు, ఆప్ సీనియర్ నేతలు, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాలు పర్యటించి సాయం చేసేందుకు ప్రకటనలు చేశారు. మరోవైపు వరదల ప్రభావంగా పెరుగుతున్న నదీ జలాల వల్ల ఎదురయ్యే తక్షణ సవాళ్లను అంచనా వేసేందుకు అక్కడి స్థానిక నాయకులు, ప్రజలతో మాట్లాడారు. ఈ మధ్య కాలంలో కేవలం పంజాబ్ రాష్ట్రంలోనే కాదు.. తెలుగు రాష్ట్రాలు అయిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో వర్షాలకు భారీ వరదలు సంభవించడం విశేషం. ఇక ఏది ఏమైనప్పటికీ పంజాబ్ లో వరద బాధితులకు పంజాబ్ కింగ్స్ కో ఓనర్ ప్రీతి జింటా (Preity Zinta) చేసిన సహాయానికి అందరూ హ్యాట్సాప్ చెబుతున్నారు. మీ లాంటి మంచి మనస్సు ఉంటే.. ఎలాంటి ప్రమాదం వచ్చినా సేవ్ చేయవచ్చని పొగుడుతున్నారు.