BigTV English

Bigg Boss 8 Telugu Promo: పృథ్వి అనే వ్యక్తి నా జీవితంలోనే లేడు.. అదేంటి విష్ణు అలాంటి నిర్ణయం తీసుకున్నావ్?

Bigg Boss 8 Telugu Promo: పృథ్వి అనే వ్యక్తి నా జీవితంలోనే లేడు.. అదేంటి విష్ణు అలాంటి నిర్ణయం తీసుకున్నావ్?

Bigg Boss 8 Telugu Latest Promo: బిగ్ బాస్ 8లో మెగా చీఫ్ కంటెండర్లు అవ్వడం కోసం పోటీ మొదలయ్యింది. మామూలుగా మెగా చీఫ్ అవ్వడం కోసం పోటీ జరుగుతుంది. కానీ ఈసారి మెగా చీఫ్ కంటెండర్లు అవ్వడం కోసం పోటీ జరిగింది. ముందుగా ఈ అవకాశం పృథ్వి, నబీల్, రోహిణికి రాగా.. ఆ తర్వాత ఈ ఛాన్స్ ప్రేరణ, యష్మీ, విష్ణుప్రియాకు దక్కగా.. రెండుసార్లు ఈ పోటీలో విష్ణుప్రియా ఓడిపోయింది. అదే క్రమంలో ఒకసారి పృథ్వితో కూడా పోటీపడింది. కానీ పృథ్వి తనను మోసం చేసి గెలిచాడని తర్వాత తెలుసుకుంది. పృథ్విపై యష్మీ కూడా హర్ట్ అయ్యింది. దీంతో వారిద్దరూ కలిసి పృథ్వితో మాట్లాడదామని అనుకున్నారు. కానీ పృథ్వి ప్రవర్తన మాత్రం అలా లేదు.


రెడ్ ఫ్లాగ్

‘‘వాడు టెన్షన్ తీసుకొని వేరేవాళ్లను హర్ట్ చేసేసి ఆ తర్వాత తను చాలా కూల్‌గా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్న వ్యక్తి నా దృష్టిలో పెద్ద రెడ్ ఫ్లాగ్. అలాంటి వాడు నాకొద్దు’’ అంటూ యష్మీతో షేర్ చేసుకుంది విష్ణుప్రియా. దీంతో పృథ్వితో విష్ణుకు ఉన్న మనస్పర్థలు తొలగిపోవాలని తనను పిలిచింది యష్మీ. ‘‘ప్లీజ్. మా ఇద్దరిని సారీ అడుగు’’ అని మెల్లగానే చెప్పింది. ‘‘నేనేం సారీ అడగలేదు’’ అని విష్ణును జోక్యం చేసుకుంది. అలా అనడంతో పృథ్వికి కోపం వచ్చింది. ‘‘నేను నీతో మాట్లాడడం లేదు’’ అంటూ సీరియస్ అయ్యాడు. ‘‘కూర్చొని మాట్లాడదాం. ఎందుకు కోప్పడుతున్నావు’’ అని సర్ధిచెప్పడానికి ప్రయత్నించింది యష్మీ.


Also Read: పృథ్వీ కోసం విష్ణు ప్రియ అలాంటి పని.. ఫైర్ అవుతున్న హౌస్ మేట్స్..!

నిఖిల్ షాక్

యష్మీ మాటలు వినకుండా బయటికి వెళ్లొస్తాను అంటూ అక్కడి నుండి వెళ్లిపోయాడు పృథ్వి. ‘‘నాతో అలా ఎవ్వరూ ప్రవర్తించకూడదు’’ అంటూ విష్ణు హర్ట్ అయ్యింది. వెంటనే నిఖిల్ అక్కడి రావడంతో తన జీవితంలో పృథ్వి అనే వ్యక్తే లేడు అంటూ తనతో చెప్పింది విష్ణుప్రియా. దీంతో నిఖిల్ షాకయ్యాడు. ఒకవైపు ఈ గొడవ జరుగుతుండగానే బిగ్ బాస్.. కంటెస్టెంట్స్‌కు ఒక ఫన్నీ టాస్క్ ఇచ్చాడు. ఈ టాస్క్‌లో అవినాష్ ఒక ఫేమస్ డైరెక్టర్‌గా నటించాల్సి ఉంటుంది. తన అసిస్టెంట్‌గా రోహిణి నటించాలి. ‘‘యాక్టింగ్ అంటే నటన. నటన అంటే యాక్టింగ్’’ అంటూ డైరెక్టర్ పాత్రలో లీనమయిపోయి కామెడీ మొదలుపెట్టాడు అవినాష్. తన అసిస్టెంట్‌గా రోహిణి కూడా బాగానే నవ్వించే ప్రయత్నం చేసింది.

లవ్ స్టోరీ

ముందుగా కామెడియన్ పాత్ర కావాలంటూ టేస్టీ తేజ ఆడిషన్స్‌కు వచ్చాడు. కామెడియన్ పాత్ర కోసం వచ్చాడు కాబట్టి నవ్వించమని అడిగాడు. కితకితలు పెట్టి అవినాష్‌ను నవ్వించాలి అనుకున్నాడు తేజ. ఆ తర్వాత హరితేజ పనిమనిషిగా, రోహిణి ఓనర్‌గా నటించి నవ్వించారు. ట్రయాంగిల్ లవ్ స్టోరీ తెరకెక్కిస్తానంటూ యష్మీ, గౌతమ్, నిఖిల్‌ను రంగంలోకి దించాడు. అక్క అని పిలవకు అంటూ గౌతమ్‌తో యాక్టింగ్ మొదలుపెట్టింది యష్మీ. మధ్యలో నిఖిల్ జోక్యం చేసుకొని యష్మీని అక్క అని పిలవకు అని సలహా ఇవ్వగా అయితే నువ్వు పిలువు అని కౌంటర్ ఇచ్చాడు గౌతమ్. ‘హా.. చూస్తారా’ అనే టైటిల్‌తో త్వరలోనే షూటింగ్ ప్రారంభం కాబోతుందని కంటెస్టెంట్స్ ప్రకటించారు.

Related News

Deepthi Sunaina: జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయం.. గుడ్ న్యూస్ చెప్పిన దీప్తి సునైనా.. పెళ్లికి సిద్ధమైందా?

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Bigg Boss 9 Telugu: గొడవలు మాయం.. స్నేహం మాత్రం ఎప్పటికీ.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో!

Ariyana: సొంత ఇంటికల నెరవేర్చుకోబోతున్న అరియానా.. తెగ కష్టపడుతుందిగా?

Big Stories

×