Ktr: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి కేటీఆర్ చాలా చురుగ్గా వ్యవహరిస్తున్నానని అనుకుంటున్నారు కానీ రియాలిటీ మరోలా ఉంది. ఆయన ఎందులో వేలు పెట్టినా కాలిపోతుంది. రాష్ట్రంలో ఏ చిన్న సమస్య వచ్చినా కేటీఆర్ వారి పార్టీ నేతలు దాన్ని సాగదీసి పెద్దది చేయాలనే చూస్తున్నారు. కానీ ఎవరిని ముట్టుకున్నా మీ ప్రభుత్వంలో ఏం చేశారనే ప్రశ్నలే ఎదురవుతున్నాయి. అసెలెందుకు వచ్చారనే అవమానాలే తలెత్తుతున్నాయి. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరవాత విద్యార్థులు రాష్ట్రంలో నోటిఫికేషన్ లు కావాలని, నోటిఫికేషన్లలో మార్పులు కావాలని ఆందోళన చేశారు.
Also read: బస్సు డ్రైవర్‌కి గుండెపోటు.. ప్రయాణికుల ప్రాణాలు కాపాడిన కండక్టర్
అదే అదునుగా కేటీఆర్ అశోక్ నగర్ కు వస్తామని మీకు అండగా ఉంటామని విద్యార్థులతో చెప్పారు. కానీ వాళ్లు మాత్రం మీరు రావడం అవసరంలేదని తేల్చిచెప్పారు. గత ప్రభుత్వం వల్లనే తమ బతుకులు ఇలా తయారయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో కేటీఆర్ అశోక్ నగర్ వెళ్లలేక తమ పార్టీకి అనుకూలంగా ఉన్న కొంతమందిని బీఆర్ఎస్ భవన్ కు పిలిపించుకుని చర్చలు జరిపారు. కానీ మిగితా విద్యార్థులంతా ఓ రేంజ్ లో బీఆర్ఎస్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల రాష్ట్రంలో సర్పంచులు పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని ఆందోళన చేపట్టారు.
పెండింగ్ బిల్లుల సమస్య ఇప్పటిది కాదు. గత ప్రభుత్వంలోనే సర్పంచులకు నిధులు విడుదల చేయలేదు. చాలా మంది సర్పంచులు అప్పుల పాలు అయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకరిద్దరు ఆత్మహత్య చేసుకున్న ఘటనలు సైతం ఉన్నాయి. కానీ ఆనాడు పట్టించుకున్న నాధుడే లేడు. అధికారం ఉన్నన్ని రోజులూ గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి వారి ఆవేదనే వినిపించలేదు. కానీ ఒక్కసారి అధికారం కోల్పోగానే మాజీ సర్పంచులకు పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ సర్పంచులకు మద్దతు ప్రకటించారు. కానీ సర్పంచులు మాత్రం మీ మద్దతు వద్దు మీరూ వద్దని స్పష్టం చేశారు. అప్పుడు బిల్లులు చెల్లిస్తే ఈ ఖర్మ వచ్చేది కాదని స్పష్టం చేశారు.
నిన్నగాక మొన్న ఆటోవాలాలు ధర్నాకు దిగారు. తమ సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ ధర్నాకు సైతం బీఆర్ఎస్ నాయకులు వెళ్లారు. కేటీఆర్ కొంతమంది తమ పార్టీ నాయకులతో కలిసి వారిని పరామర్శించారు. కానీ కేటీఆర్ వెళ్లిన తరవాత అసలు మిమ్మల్ని ఎవరు పిలిచారని ఆటోవాలా మండిపడ్డారు. అక్కడితో ఆగకుండా కేటీఆర్ ను రావొద్దని చెప్పినా వచ్చాడంటూ పరువు తీశారు. ఇలా రాష్ట్రంలో ప్రతిదాంట్లోకి కేటీఆర్ దూరి హైలెట్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఏ ప్రయత్నమూ ఫలించకపోగా దెబ్బ మీద దెబ్బ పడుతుండటంతో ఆ పార్టీ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతోంది.