Vivo X200 Series : Vivo X200 సిరీస్ ఇప్పటికే చైనాలో ప్రారంభంకాగా… త్వరలోనే మలేషియాలో లాంఛింగ్ కు సిద్ధమవుతుంది. ఇక భారత్ లో సైతం లాంఛింగ్ కు సన్నాహాలు శరవేగంగా జరుగుతున్నాయి. స్మార్ట్‌ఫోన్‌లలో DSLR లాంటి అనుభవాన్ని అందించే లక్ష్యంతో అధునాతన కెమెరా ఫీచర్స్ తో ఈ మెుబైల్స్ ను వివో తీసుకొస్తుంది. ఇందులో X200, X200 Pro, X200 ప్రో మినీ మోడల్స్ ఉన్నాయి.
ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తో సరికొత్త మెుబైల్స్ ను తీసుకొస్తున్న వివో.. త్వరలోనే Vivo X200 సిరీస్ మెుబైల్స్ ను లాంఛ్ చేసేందుకు సిద్ధమవుతుంది. DSLR వంటి ఫోటోగ్రఫీ అనుభవాన్ని అందించాలని లక్ష్యంతో వివో.. స్టాండర్డ్ మోడల్స్‌తో పాటు కంపెనీ ఎక్స్200 ప్రో మినీని పరిచయం చేసింది. ఇది మరింత కాంపాక్ట్ వెర్షన్. పెద్ద డిస్‌ప్లే అవసరం లేకుండా మెరుగైన కెమెరా ఫీచర్స్ ను అందిస్తుంది.
Vivo X200 స్పెసిఫికేషన్‌లు
Vivo X200 సిరీస్లో మూడు మోడల్స్ లో మెుబైల్స్ రాబోతున్నాయి. X200, X200 Pro, X200 Pro Mini.
డిస్‌ప్లే – X200, X200 Pro రెండూ OLED డిస్ ప్లేతో రాబోతున్నాయి. X200లో 6.67 అంగుళాల స్క్రీన్, X200 ప్రోలో 6.78 అంగుళాల డిస్‌ప్లే ఉన్నాయి. రెండూ 1.5K రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, హై బ్రైట్నె్స్ కు 4500 నిట్స్ డిస్ ప్లే ఉన్నాయి. MediaTek డైమెన్సిటీ 9400 చిప్‌సెట్ గేమింగ్ మల్టీ టాస్కింగ్ కు సపోర్ట్ చేస్తుంది. 16GB RAM + 1TB స్టోరేజ్ తో వచ్చేస్తున్నాయి.
కెమెరా – Vivo X200 సిరీస్ లో కెమెరా సిస్టమ్స్ అదిరిపోయేలా ఉంది. X200లో 50MP సోనీ IMX921 ప్రధాన కెమెరాతో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS), 50MP అల్ట్రావైడ్ లెన్స్, 50MP టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. X200 Proలో 50MP LYT-818 ప్రధాన కెమెరా, 50MP అల్ట్రా-వైడ్, జూమ్ మీటింగ్స్ కోసం 200MP Zeiss APO టెలిఫోటో కెమెరా ఉన్నాయి. 2 మోడల్స్ లో సెల్ఫీ కెమెరా 32MPగా ఉంది.
బ్యాటరీ – ఈ మెుబైల్స్ లో బ్యాటరీ 5800mAhగా ఉంది. X200 Proలో మాత్రం 6000mAh బ్యాటరీ ఉంది. అయితే ఈ మెుబైల్స్ అన్నీ 90W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తాయి.
X200 Pro Mini –
X200 Pro Miniలో 120Hz రిఫ్రెష్ రేట్ 6.3 అంగుళాల OLED డిస్‌ప్లే ఉన్నాయి. ఇక 9400 చిప్‌సెట్, 50MP LYT818 ప్రధాన సెన్సార్‌తో కెమెరా సిస్టమ్, 50MP అల్ట్రా వైడ్ లెన్స్, 100x డిజిటల్ జూమ్‌ను అందించే 50MP పెరిస్కోప్ లెన్స్ ఉన్నాయి. 90W వైర్డ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌తో 5700mAh బ్యాటరీ, IP68 + IP69 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్సీ ను కలిగి ఉన్నాయి.
ఇక ఈ అధునాతన ఫీచర్స్ తో వచ్చేస్తున్న వివో ఎక్స్ 200 సిరీస్ త్వరలోనే ఇండియాలో సైతం లాంఛ్ కు సిద్ధమవుతుంది. ప్రస్తుతం మలేషియాలో ఈ టీజర్ ను లాంఛ్ చేయడానికి సిద్ధమవుతున్నారు. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ మొబైల్ ఇండియాలో లాంఛ్ అయ్యే అవకాశం ఉన్నట్టు టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ALSO READ : డిలీట్ చేయకుండానే అకౌంట్‌ని క్లోజ్ చేయొచ్చు… ఎవ్వరికీ తెలియని ఈ ట్రిక్‌పై ఓ లుక్ వేయండి