BigTV English

Key Post for Nagababu : ఎంపీ సీటు త్యాగం, నాగబాబుకు కీలక పదవి!

Key Post for Nagababu : ఎంపీ సీటు త్యాగం, నాగబాబుకు కీలక పదవి!

key post for Nagababu in Chandrababu’s government : ఆంధ్రప్రదేశ్‌లో కూటమి అధికారంలోకి వచ్చేసింది. చంద్రబాబు కేబినెట్‌లోని మంత్రి పదవుల విషయం కాసేపు పక్కనబెడితే విజయంలో కీలకంగా వ్యవహరించిన నేతలు ఎవరు? వారికి ప్రభుత్వంలో ఎలాంటి ప్రయారిటీ దక్కనుంది? టికెట్లు త్యాగం చేసిన వారి పరిస్థితి ఏంటి? ఇదే చర్చ ఇప్పుడు హాట్ హాట్‌గా సాగుతోంది.


పొత్తుల్లో భాగంగా ఈసారి అనకాపల్లి ఎంపీ నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా నాగబాబు పోటీ చేయాలని భావించారు. గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకున్నారు. అందుకు సంబంధించి ఇంటిని కూడా ఏర్పాటు చేసుకున్నారు. చివరి నిమిషంలో బీజేపీతో పొత్తు కారణంగా అనకాపల్లి సీటు కాస్త బీజేపీకి వెళ్లింది. దీంతో నాగబాబు తన సీటును త్యాగం చేశారు.

ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం నాగబాబుకు కీలక పదవి ఇచ్చేందుకు సిద్ధమైనట్టు వార్తలు వస్తున్నాయి.
ఆయనకు టీటీడీ ఛైర్మన్ పదవి ఇవ్వడం ఖాయమని పొలిటికల్ సర్కిల్స్‌లో టాక్ నడుస్తోంది. ఈ పదవిపై టీడీపీలోని చాలామంది సీనియర్లు కన్నేశారు.


ALSO READ: ఆట మొదలు.. ఐఏఎస్, ఐపీఎస్ లకు చంద్రబాబు ఝలక్.. !

ముఖ్యంగా రాయలసీమ నుంచి చాలా మంది ఆ పదవి కోసం ఆశలు పెట్టుకున్నారు. ఇదికాకుండా మరొకటి నాగబాబుకు ఇచ్చే ఛాన్స్ ఉందంటూ వార్తలు వస్తున్నాయి. ఈ విషయంలో నాలుగైదు రోజుల్లో క్లారిటీ రావచ్చని అంటున్నారు. మొత్తానికి లక్కీస్టార్ అంటే నాగబాబుదే అన్నమాట.

Tags

Related News

Amaravati News: హెచ్ 1 బీ వీసా ఎఫెక్ట్.. ఏపీకి టెక్ కంపెనీ యాక్సెంచర్, విశాఖలో కొత్త క్యాంపస్‌

Nellore News: రెచ్చిపోయిన హిజ్రాలు.. న‌ర్సుపై మూకుమ్మడిగా దాడి, అడిగినంత ఇవ్వలేదని

Rajahmundry News: క్రిమినల్ బత్తుల జాడెక్కడ? జైలులో ప్రభాకర్ ఏమేమి చేసేవాడు?

Amaravati News: వైసీపీ స్కెచ్ మామూలుగా లేదు.. సీఎం చంద్రబాబుకు ఆ పోలీసు నోటీసు,అసలు మేటర్ అదే?

TTD Chairman BR Naidu: తిరుమల శ్రీవారి సేవకులకు.. టీటీడీ ఛైర్మన్ గుడ్‌న్యూస్

Nagababu – Anitha: ఎమ్మెల్సీగా నాగబాబు తొలి ప్రశ్న – మంత్రి అనిత సమాధానం

Lokesh Vs Botsa: నా తల్లిని అవమానించినప్పుడు మీరేంచేశారు.. మంత్రి లోకేశ్ భావోద్వేగం.. బొత్సపై అనిత ఫైర్

Durgamma Temple: ఇంద్రకీలాద్రి టెంపుల్‌లో అపచారం.. ముగ్గురు వ్యక్తులు చెప్పులను ధరించి టెంపుల్‌లోకి..?

Big Stories

×