Illu Illalu Pillalu ToIlluday Episode August 22nd : నిన్నటి ఎపిసోడ్ లో.. నర్మదా ప్రేమలు శ్రీవల్లి వల్ల తల్లిదండ్రులు బాగోతాన్ని బయట పెట్టాలని ఇంటికి ఆవేశంగా వస్తారు. వాళ్ళని అడ్డుకున్న శ్రీవల్లి మాత్రం ఎక్కడ తగ్గకుండా నా గురించి నా ఇంటి విషయాల గురించి చెప్పడానికి నువ్వు ఎవరు అని వాళ్ళతో అంటుంది.. పశ్చాత్తాపం పడకుండా మా గురించి చెప్పడానికి నువ్వెవరు అని అడుగుతున్నావు అని ప్రేమ దిమ్మ తిరిగిపోయేలా శ్రీవల్లికి క్లాస్ పీకుతుంది. నర్మదా, ప్రేమ రామరాజు దగ్గరికి వచ్చి మావయ్య గారు మీకు ఒక విషయం చెప్పాలి అని అడుగుతారు.. ఏంటమ్మా ఎవరి గురించి అని రామరాజు అడుగుతాడు. వల్లి అక్క గురించి అని అనే లోపల రామరాజుకి ఫోన్ వస్తుంది. ఆ ఫోన్ రాగానే టెన్షన్ పడుతూ ఉంటాడు. వేదవతి ఏమైందని అడుగుతుంది.. రైస్ మిల్లులో దొంగలు పడ్డారని రామరాజు కుటుంబం మిల్లుకు వెళ్తారు. సింహాద్రి దొంగ అని నర్మదా కన్ఫామ్ చేస్తుంది.. ఎంతో నమ్మకం గా ఉన్న సింహాద్రి ఇలాంటి తప్పు చేశాడని విన్న రామరాజు ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు. నమ్మిన వాళ్లే నన్ను మోసం చేశారంటూ బాధపడతారు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది…
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికోస్తే.. శ్రీవల్లి ఇంట్లో ఎవరు లేరని తెలుసుకున్న శ్రీవల్లి ఆగమేఘాల మీద పుట్టింటికి వెళ్తుంది.జరిగిన విషయాన్ని తన తల్లితో పంచుకుంటుంది. ఇంట్లో భాగ్యం ఆనందరావు టెన్షన్ పడుతూ ఉంటారు. శ్రీవల్లి ఇంట్లోకి రావడం చూసి అమ్ముడు ఇంట్లోంచి గెంటేసారా అని అడుగుతాడు.. భాగ్యం ఏమైంది అమ్మడు ఏం జరిగింది చెప్పవే అని కంగారుపడుతూ అడుగుతుంది.. నేను నువ్వు చెప్పినట్లే అంతా చెప్పానమ్మా కానీ వాళ్ళు నా మాటని అస్సలు వినడం లేదు.. రైస్ మిల్లు దొంగలు పడ్డారని వెళ్లారు ఇప్పుడు ఇంటికి రాగానే కచ్చితంగా ఈ విషయాన్ని మావయ్యకి చెప్పేస్తారు అని కంగారుపడుతూ చెప్తుంది శ్రీవల్లి.. భాగ్యం మాత్రం ఏదో ఒకటి చేద్దాం నువ్వు టెన్షన్ పడకు అని శ్రీవల్లికి ధైర్యం చెబుతుంది..
నువ్వు తప్పు మీద తప్పుచేసి నా జీవితాన్ని ఇరకాటంలో పడవేశావు. ఇప్పుడు నాకు చావడం తప్ప వేరే దారే లేదు అని శ్రీవల్లి కన్నీళ్లు పెట్టుకుంటుంది. నా భర్త అంటే నాకు ప్రాణం.. ఆయన లేకుంటే చచ్చిపోతాను అంటుంది. భాగ్యం ఏదో ఒక ప్లాన్ చేద్దాం నువ్వు మాత్రం కంగారు పడకమ్మా అని అంటుంది. ఏం మిగిలిందని ఇంకా నువ్వు చేయడానికి అని శ్రీవల్లి టెన్షన్ పడుతూ బాధపడుతుంది.
శ్రీవల్లిని ఓదార్చే ప్రయత్నం చేస్తున్న కూడా ఎంతటికీ ఏడుపు మానదు.. రామరాజు తన సొంత వాళ్లే తనని మోసం చేశారు అని బాధపడుతూ ఉంటారు.. సింహాద్రిని నేను ఎంతగా నమ్మాను నా ఇంటి మనసు లాగా నేను చూసుకున్నాను అలాంటి వాడిలా నన్ను మోసం చేశాడంటే తట్టుకోలేకపోతున్నానని బాధపడతాడు. నా ఇంట్లో వాళ్ళు మోసం చేస్తే ఇంకా నా గుండె అక్కడే ఆగిపోతుంది ఏమో బుజ్జమ్మ అని వేదవతి తో రామరాజు అంటాడు.
ఇలాంటి విషయాలు ఇంకెప్పుడు నాన్నకి చెప్పకుండా ఉండాలి అని ఇంట్లోని వాళ్ళందరూ అనుకుంటారు. ఆ మాట వినగానే షాక్ అవుతారు. మోసం చేయకూడదని అనుకుంటారు.. ప్రేమ నువ్వేంటో చెప్పాలనుకున్నావు కదమ్మా వల్లి గురించి నీకు ఒక నిజం చెప్పాలి అని అన్నావు కదా అమ్మ ఏంటది అని అడుగుతాడు. రామరాజు అనగానే ప్రేమ చెప్పబోతుంది అంతలోకే భాగ్యం ఆనందరావు అక్కడికొచ్చి అరుస్తారు.
బావగారు చెల్లెమ్మ ఏంటి మీరేంటి ఇలా ఉన్నారేంటి అని రామరాజు షాక్ అవుతాడు.. ఈ పరిస్థితికి ఏంటి కారణం ఎందుకిలా మారిపోయారు అని అడుగుతాడు రామరాజు. మమ్మల్ని అందరూ మోసం చేసి ఐపి పెట్టేశారు. మేము ఈ పరిస్థితికి వచ్చేసాము మమ్మల్ని క్షమించండి అని అంటారు. భాగ్యం మరో ప్లాను సక్సెస్ అవుతుంది. నిజంగానే ఆస్తులు పోయాయని అందరూ నమ్ముతారు. ప్రేమ మాత్రం వీళ్ళ మోసం ఎలాగైనా బయట పెట్టాలని చెప్పబోతుంది.. అయితే నర్మదా పక్కకు తీసుకెళ్లి ఇప్పుడు మావయ్య ఎంత బాధ పడుతున్నాడో తెలుసా ఈ విషయం తెలిస్తే ఖచ్చితంగా చచ్చిపోతాడు అని అంటుంది.
Also Read: బాలుకు నిజం చెప్పేసిన.. ప్రభావతికి మైండ్ బ్లాక్..నిజం బయటపెట్టబోతున్న మీనా..
అయితే ఏంటమ్మా ఏదో చెప్పాలనుకునేది నువ్వేంటి ఆపుతున్నావు అని రామరాజు అంటాడు. ఏమీ లేదు మామయ్య ఏదో కంపెనీ గురించి మాట్లాడుతుంది లేండి అని నర్మదా అంటుంది. రామ రాజు ఆస్తులు పోయాయని మిమ్మల్ని దూరం పెట్టే అంత చెడ్డవాన్ని కాదు అని వాళ్ళని లోపలికి తీసుకొని వెళ్తాడు.. భాగ్యం ఆనందరావు చందు కాళ్ళ మీద పడి క్షమించమని అడుగుతారు.. రూపాయి కూడా ఇచ్చుకొని స్థితిలో మేమున్నాము మమ్మల్ని వదిలేయండి అని భాగ్యం అంటుంది. 10 లక్షలు మేటర్ ఇంట్లో తెలిసిపోతుందని చందు టెన్షన్ పడుతూ ఉంటారు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..