BigTV English

Nani: అదంతా అయ్యేపనులు కాదు… రివ్యూలపై నాని సూపర్ స్టేట్మెంట్

Nani: అదంతా అయ్యేపనులు కాదు… రివ్యూలపై నాని సూపర్ స్టేట్మెంట్

Nani: టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో వస్తున్న సినిమా హిట్ 3. యాక్షన్ థ్రిల్లర్ మూవీగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో నానికి జోడిగా శ్రీనిధి శెట్టి నటిస్తున్నారు. ఈ సినిమాకి సంగీతాన్ని మిక్కిజే మేయర్ అందిస్తున్నారు. నాని సొంత బ్యానర్ వాల్ పోస్టర్ సినిమాతో కలిసి యునానిమస్ పతాకంపై ప్రశాంతి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం మే 1నా ప్రేక్షకుల ముందుకు రానుంది. అందులో భాగంగా మూవీ టీం ప్రమోషన్స్ లో బిజీగా గడుపుతున్నారు. తాజాగా నాని మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూ ఇస్తూ, సినిమా రివ్యూలపై ఇచ్చిన కామెంట్ వైరల్ అవుతుంది. అసలు నాని రివ్యూల గురించి ఏం మాట్లాడాడు అన్నది ఇప్పుడు చూద్దాం..


నా అభిప్రాయం ..

హిట్ 3 సినిమాతో మే 1న మన ముందుకు రానున్నాడు నాని. రీసెంట్ గా ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన ట్రైలర్ కు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ ట్రైలర్ మిలియన్ వ్యూస్ తో యూట్యూబ్ ని షేర్ చేసింది. దీంతో, ఇక మూవీ సెన్స్లేషనల్ బ్లాక్ బాస్టర్ హిట్ అంటూ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. తాజాగా ఆయన ఇంటర్వ్యూలో.. యాంకర్ సినిమా రిలీజ్ అయిన తర్వాత రివ్యూ రెండు, మూడు రోజులు ఆగిన తర్వాత చెప్తే బాగుంటుంది కదా, అనే ప్రశ్న ఎదురైనప్పుడు నాని మాట్లాడుతూ.. అలా ఎలా చెప్తాము. ఎవరిని ఆపుతాము. ఎందుకు ఆగుతుంది. ఎలా ఆపుతారు. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒకటి రెండు రోజుల్లోనే చూసి డిక్లేర్ చేయడం అన్నది కరెక్ట్ కాదు. ఒక వారం రోజులు చూసిన తర్వాత అప్పుడు కూడా హల్ కి ఎవరు రాకుండా థియేటర్ ల్లని ఖాళీగా ఉంటే సినిమాకి నెగటివ్ ఇస్తే బాగుంటుంది. కానీ సినిమా మొదటి రోజు మొదటి షో చూసి, రివ్యూలు రాసేస్తూ నెగిటివ్, పాజిటివ్ అంటూ చెప్పేస్తే.. సినిమా పూర్తిగా ఎలా తెలుస్తుంది. నాకు నచ్చలేదు అని చెప్తే బాగుంటుంది. అంతేకానీ, సినిమా బాలేదు అని పూర్తిగా రివ్యూ చేస్తున్నారు. ఇప్పటివరకు నా సినిమాలకైతే జరగలేదు కానీ, చాలా సినిమాలకి నేను చూశాను. మొదటి రోజు షో చూసి డిజాస్టర్ అని రాసేస్తున్నారు. అలా రాయడం కరెక్ట్ కాదు అన్నది నా ఉద్దేశం. సాధారణ మనిషికి మీడియా రివ్యూ రాసే వారికి కొంత తేడా ఉండాలి కదా అనేది నా ఉద్దేశం అని, నాని తెలిపారు.


యాక్షన్ మాత్రమే ..

ఈ సినిమా ట్రైలర్ భయంకరంగా ఉంది అనే వాళ్ళు ఉన్నారు. యాక్షన్ సినిమాలు ఇష్టపడే వాళ్ళు మాత్రమే ఈ సినిమా నచ్చుతుందన్న టాక్ ఉంది. నానిని ఎప్పుడూ చూడని విధంగా ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఈ చిత్రంలో చూడబోతున్నాము. హిట్ మొదటి, రెండు భాగాలు సూపర్ సక్సెస్ ని అందుకున్నాయి. ఇప్పుడు హిట్ త్రీ మూవీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని, నానికి మంచి విజయాన్ని అందించాలని కోరుకుందాం.

Game Changer on TV : టీవీల్లోకి వచ్చేస్తున్న రామ్ చరణ్ డిజాస్టర్ మూవీ… ఎప్పుడు..? ఎక్కడ అంటే..?

Tags

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×