Reliance Jio New Offer: ప్రముఖ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో కస్టమర్లను ఆకట్టుకునేలా ఎప్పటికప్పుడు సరికొత్త రీఛార్జ్ ప్లాన్స్ అందుబాటులోకి తీసుకొస్తున్నది. పోటీ టెలికాం సంస్థలకు సాధ్యం కాని రీతిలో ఛీప్ అండ్ బెస్ట్ ఫ్లాన్స్ ను పరిచయం చేస్తున్నది. తక్కువ ధరలో ఎక్కువ బెనిఫిట్స్ ఉండే ప్లాన్స్ ను ఇంట్రడ్యూస్ చేస్తున్నది. దేశంలో ఎక్కువ మంది వినియోగదారులు ఉన్న టెలింకాం సంస్థ జియో.. యూజర్లను ఆకట్టుకునేందుకు సూపర్ ప్లాన్స్ ను తీసుకొస్తున్నది.
గతంలో చాలా టెలికాం కంపెనీలు లైఫ్ టైమ్ వ్యాలిడిటీని అందించేవి. కానీ, ఆ తర్వాత ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నాయి. ప్రతి నెల రీఛార్జ్ చేసుకునేలా నిర్ణయం తీసుకున్నాయి. అయితే, ప్రతి నెలా రీఛార్జ్ చేసుకోవడానికి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అంతేకాదు, నెల వ్యాలిడిటీతో కూడిన ప్లాన్స్ కూడా చాలా తక్కువగా అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో తరచుగా రీఛార్జ్ చేసుకోవాల్సి వస్తున్నది. ఈ ఇబ్బందుల నుంచి వినియోగదారులను బయటపడేసేందుకు జియో సరికొత్త ప్లాన్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎక్కువ రోజుల వ్యాలిడిటీతో తక్కువ ధరలో ఈ ప్లాన్ ను పరిచయం చేసింది.
రూ. 1234తో రీఛార్జ్.. 336 రోజుల వ్యాలిడిటీ
ప్రతి నెల రీఛార్జ్ చేసుకునేందుకు ఇబ్బంది పడే వారి కోసం జియో కొత్త ప్లాన్ ను తీసుకొచ్చింది. రూ. 1234తో రీఛార్జ్ చేసుకుంటే 336 రోజుల వ్యాలిడిటీ లభించనుంది. నెలకు సుమారు రూ. 112 ఖర్చు అవుతుంది. ఈ రీఛార్జ్ ప్లాన్ తో పలు బెనిఫిట్స్ ను అందిస్తున్నట్లు జియో వెల్లడించింది. దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని నెట్ వర్క్ లకు అపరిమితంగా కాల్స్ చేసుకోవచ్చు. ప్రతి రోజూ 100 ఎస్సెమ్మెస్ లను పంపుకునే అవకాశం ఉంటుంది. ఈ ప్లాన్ లో భాగంగా 168 GB డేటాను పొందే అవకాశం ఉంటుంది. రోజుకు 500 MB వరకు డేటాను ఉపయోగించుకోవచ్చు. తక్కువ డేటా ఉపయోగిస్తూ.. ఎక్కువ రోజులు టాక్ టైమ్, వ్యాలిడిటీ కావాలి అనుకునే వారికి ఈ ప్లాన్ చాలా ఉపయోగకరంగా ఉంది. ఈ ప్లాన్ ను తీసుకున్న వాళ్లు జియో సావన్ తో పాటు జియో సినిమాలు చూసే అవకాశం ఉంటుంది.
Read Also: ఈ స్మార్ట్ ఫోన్ లో 80 శాతానికి మించి ఛార్జింగ్ కాదు, ఎందుకో తెలుసా?
జియో భారత్ ఫోన్లను ఉపయోగించే వారికే..
ఇక జియో తాజాగా తీసుకొచ్చిన రూ. 1234 రీఛార్జ్ ప్లాన్ జియో వినియోగదారులు అందరికీ అందుబాటులో ఉండదు. కేవలం జియో భారత్ ఫోన్లను ఉపయోగించే వారికే ఈ సౌకర్యం కల్పిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. జియో సిమ్ ఉపయోగిస్తున్నప్పటికీ, ఇతర స్మార్ట్ ఫోన్ యూజర్లకు ఈ ఫ్లాన్ వర్తించదు. జియో భారత్ లాంటి ఫీచర్ ఫోన్ ను ఉపయోగిస్తున్న వారు మాత్రమే ఈ ప్లాన్ తో బెనిఫిట్స్ పొందే అవకాశం ఉంటుంది. ఇక ఈ సరికొత్త ఫ్లాన్ కు వినయోగదారుల నుంచి మంచి ఆదరణ లభిస్తున్నట్లు జియో అధికారులు వెల్లడించారు.
Read Also:మీ పాత ఫోన్ కొత్త దానిలా పనిచేయాలంటే.. సింఫుల్ గా టిప్స్ పాటించండి!