Android Phone Tips: చాలా మంది స్మార్ట్ ఫోన్లను కొనుగోలు చేస్తారు. కొద్ది రోజుల పాటు వాడి ఆ తర్వాత స్లో అయ్యిందని పక్కన పడేస్తారు. కానీ, కొన్ని టిప్స్ పాటిస్తే.. పాత ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ కూడా కొత్తదానిలా పని చేసే అవకాశం ఉంటుంది. క్షణాల్లో మీ పాత ఫోన్ ను ఎలా కొత్తదానిలా మార్చుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..
⦿ బ్యాటరీని లైఫ్ ఎలా పెంచుకోవాలంటే?
చాలా స్మార్ట్ ఫోన్లలో ఎదురయ్యే సమస్య బ్యాటరీ వీక్ కావడం. కొద్ది సేపటికే ఛార్జింగ్ అయిపోతే చిరాకు కలుగుతుంది. అయితే, బ్యాటరీ బ్యాకప్ పెంచుకునేందుకు కొన్ని టిప్స్ పాటిస్తే సరిపోతుంది. ఆటో స్క్రీన్ బ్రైట్ నెస్ లెవల్ స్లైడర్ ను 50 శాతం కంటే తక్కువగా చేసుకోవాలి. ఎక్కువ బ్రైట్ నెస్ అనేది బ్యాటరీ త్వరగా అయిపోయేలా చేస్తుంది. వీలైనంత వరకు తక్కువ బ్రైట్ నెస్ ఉండేలా చూసుకోవాలి. అంతేకాదు, అడాప్టివ్ బ్యాటరీ, బ్యాటరీ ఆప్టిమైజేషన్ ను ఉపయోగించుకోవాలి.
⦿ డార్క్ మోడ్ లో ఉంచండి!
కళ్లకు ఇబ్బంది కలగకుండా ఉండటంతో పాటు బ్యాటరీ లైఫ్ పెరగాలంటే డెడికేటెడ్ డార్క్ మోడ్ ని ఉపయోగించాలి. ఆండ్రాయిడ్ 10, ఆ తర్వాత వెర్షన్ ఫోన్లలో డెడికేటెడ్ డార్క్ మోడ్ ఆప్షన్ అందుబాటులో ఉంది. డార్క్ మోడ్‌ని ఆన్ చేయడానికి సెట్టింగ్స్ లోకి వెళ్లి డార్క్ మోడ్ ను సెలెక్ట్ చేసుకోవాలి.
⦿ హోమ్ స్క్రీన్ లో తక్కువ యాప్స్ ఉండేలా చూసుకోండి!
హోమ్ స్క్రీన్ లో ఎక్కువగా యాప్స్ లేకుండా అవసరమైన తక్కువ యాప్స్ ఉండేలా చూసుకోవాలి. వీలైనంత వరకు అవసరం లేని యాప్స్ ను తొలగించాలి. అవసరం లేని యాప్స్ ను తొలగించడం వల్ల ఫోన్ ఫర్ఫార్మెన్స్ మరింత మెరుగవుతుంది.
⦿ డోంట్ డిస్టర్బ్ మోడ్ ఆన్ చేయండి
రాత్రిపూట వీలైనంత వరకు డోంట్ డిస్టర్బ్ మోడ్‌ను ఆన్ చేయాలి. అనవసరమైన యాప్స్ నుంచి వచ్చే నోటిఫికేషన్లు మాత్రమే చూసుకునేలా సెట్ చేసుకోవాలి. అనవసర యాప్స్ ను కంట్రోల్ చేయడం వల్ల ఫోన్ పనితీరు మెరుగయ్యే అవకాశం ఉంటుంది.
⦿ మీ ఫోన్ అప్ డేట్ చేసుకోండి
మీ స్మార్ట్ ఫోన్ ను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేసుకోవాలి. అలా చేయడం వల్ల ఫోన్ ను స్లో చేసే బగ్స్, ఇతర సమస్యలు తొలగిపోయే అవకాశం ఉంటుంది. ఫోన్ పని తీరు మెరుగవుతుంది. ఒకవేళ మీ ఫోన్ అప్ డేట్ కాకపోతే, వెంటనే అప్ డేట్ చేసుకోండి. అయితే, మీ స్మార్ట్ ఫోన్ ను అప్ డేట్ చేసుకునేందుకు వైఫైని ఉపయోగించడం మంచిది. స్మార్ట్ ఫోన్ ను అప్ డేట్ చేయడం వల్ల రీబూట్ చేయబడుతుంది. బాగా పని చేస్తుంది.
మొత్తంగా ఈ టిప్స్ పాటించడం వల్ల మీ పాత స్మార్ట్ ఫోన్ పనితీరు మరింత మెరుగయ్యే అవకాశం ఉంటుంది. కొత్త ఫోన్ కొనుగోలు చేయాల్సిన పని ఉండదు. సో.. మీ దగ్గర కూడా పాత స్మార్ట్ ఫోన్ ఉంటే ఈ టిప్స్ పాటించి కొత్తదానిలా మార్చుకోండి.
Read Also: గూగుల్ టీవీ.. రిమోట్‌తో పనే ఉండదిక, మాట్లాడితే చాలు.. మీకు నచ్చినది తెరపైకి!