Intinti Ramayanam Today Episode January 9th : నిన్నటి ఎపిసోడ్ లో.. పార్వతి అక్షయ గురించి అడుగుతుంది. రాజేంద్ర ప్రసాద్ కు ఏదో చెప్పాలని అనుకుంటుంది. అంతలోకే అక్కడికి శ్రీకర్ వాళ్ళ మామ వస్తాడు. రాజేంద్రప్రసాద్ కోపంగా ఆయనతో మాట్లాడతాడు. శ్రీకర్ ఆస్తి ఇవ్వండి అనేసి గట్టిగా అడుగుతాడు. రాజేంద్రప్రసాద్ కోపంతో అతనిపై చిందులేస్తాడు.. నాకు ఒక్కగానొక్క కూతురు కాబట్టి నేను అన్ని క్షమించి ఇంట్లో పెట్టుకున్నాను అంతేకాదు అల్లుని తెచ్చి కూడా ఇంట్లో పెట్టుకున్నాను కానీ మీరు మీ కొడుకును ఇప్పటికీ క్షమించలేదు అతను చేసిన తప్పేంటి ఈ రోజుల్లో ఎవరు తప్పు చేయట్లేదా అనేసి రాజేంద్రప్రసాద్ ని విశ్వనాథం నిలదీస్తాడు. అసలు వాడు నా కొడుకే కాదు ఇప్పుడు ఏం మాట్లాడతావని రాజేంద్రప్రసాద్ కోపంగా మాట్లాడుతాడు. రాజేంద్రప్రసాద్ మాటలు విన్న విశ్వనాథం ఇంకా రెచ్చిపోతాడు. ఇంట్లో పెద్ద రచ్చే జరుగుతుంది. ఇక పార్వతి వెళ్లి దయాకర్ గురించి చెప్పడంతో రాజేంద్ర ప్రసాద్ కు గుండెపోటు వస్తుంది. అందరు ఆసుపత్రిలో జాయిన్ చేస్తారు అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. రాజేంద్రప్రసాద్ కు గుండెపోటు రావడంతో అందరూ హాస్పిటల్ కి తీసుకెళ్లి పోతారు. పార్వతి టెన్షన్ పడుతూ ఏడుస్తూ ఉంటుంది. అవని పార్వతిని ఓదారుస్తుంది.. ఇక కమల్ కన్నీళ్లు పెట్టుకుంటుంటే అక్షయ్ ఓదారుస్తాడు.. డాక్టర్లు ఇంకా ఏం చెప్పలేదు ఏంట్రా అని పార్వతి అక్షయ్ అని అడుగుతుంది. రిపోర్టులు చూడాలి కదా అమ్మ రిపోర్ట్లు రావడానికి టైం పడుతుంది అందుకే లేట్ అవుతుందేమో అని అంటాడు. ఇక అవని బాధపడకండి అత్తయ్య మావయ్య గారికి ఏమీ కాదు అని అంటుంది. దేవుని ప్రార్థిస్తుంది. నాకు పసుపు కుంకాలు నిలిచేలా చూడు స్వామి అని బాధపడుతుంది. అవని కూడా మా ఇంట్లో ఇటువంటి సమస్యలు జరుగుతున్నయో నీకు తెలుసు స్వామి ఇప్పుడు పెద్దదిక్కైనా మావయ్యను దూరం చేస్తే ఇల్లు అల్లకల్లోళ్ళం అయిపోతుంది.. మావయ్య ఆరోగ్యం సరిగా అయ్యేటట్టు చూడు స్వామి అని కోరుకుంటుంది.
అప్పుడే డాక్టర్ బయటికి వస్తాడు. మా నాన్నగారికి ఎలా ఉంది డాక్టర్ ఇప్పుడు ఏం ప్రమాదం లేదు కదా అని అక్షయ్ అడుగుతాడు.. మరేం ప్రమాదం లేదండి మైల్డ్ స్ట్రోక్ ఏ కదా అతనికి ఏం కాలేదు అనేసి అంటాడు. దానితో అందరూ సంతోషపడతారు. కానీ ఆయనకి ఇప్పటికే రెండుసార్లు వచ్చింది ఈసారి గనుక వస్తే ఆయన ప్రాణాన్ని కాపాడడం మా చేతుల్లో లేదు అని డాక్టర్ అంటాడు. ఆయనకు టెన్షన్ పడేవి ఓవర్ యాంగ్సైట్మెంట్ ఇచ్చే న్యూస్ లేవి చెప్పకండి అని డాక్టర్ చెప్తాడు. ఒక గాజు బొమ్మను చూసుకున్నట్టు మీ నాన్నగారిని చూసుకోవాలని డాక్టర్ సలహా ఇస్తాడు. ఇక అందరూ అలాగే డాక్టర్ అని చెప్తారు. ఇంట్లో భానుమతి టెన్షన్ పడుతూ ఉంటుంది. కొడుకుకు ఏమవుతుందని బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. పల్లవి ఫోన్ మాట్లాడుకుంటూ భానుమతిని చూసి ఈ ముసలి కొడుకు కోసం ఏడుస్తున్నట్టుంది ఇప్పుడు మనము బాధపడుతున్నట్టు నటించకపోతే మన మీద డౌట్ వస్తుంది అని బామ్మ దగ్గరికి వెళ్తుంది. బామ్మ మామయ్యకి ఇలా అవుతుందని నేను అస్సలు అనుకోలేదు మావయ్యకి ఏం కాకుండా అంటే బాగుండు ఇంకా రాలేదు ఏంటి వీళ్ళు అని టెన్షన్ పడినట్టు యాక్ట్ చేస్తుంది.. అప్పుడే రాజేంద్రప్రసాద్ వాళ్ళు ఇంటికి వస్తారు.
భానుమతి కొడుకును చూసి టెన్షన్ పడిపోతూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. నీకేం కాలేదు కదరా నేను ఇంట్లో ఉన్నా నా మనసంతా అక్కడే ఉంది నీకు ఏమైనా అయ్యిందేమో అని అనుకొని బాధపడ్డాను అని కన్నీళ్లు పెట్టుకుంటుంది. నాకేం కాలేదమ్మా అని రాజేంద్రప్రసాద్ అంటాడు ఇక అక్షయ్ కూడా నాన్నకు ఏం కాలేదు బొమ్మ నువ్వు టెన్షన్ పెట్టుకోకు టెన్షన్ పడొద్దు అని అంటాడు. ఇక పల్లవి కూడా పరామర్శించుకుంటే డౌట్ వస్తుందని మీకేం కాకూడదని గుడికి వెళ్లొచ్చాను మామయ్య మీకోసం ఉదయం నుంచి ఏం తినకుండా ఉపవాసం ఉన్నాను అని అంటుంది. అది విన్న కమల్ నాన్నకు ఆరోగ్యం బాగాలేదని మన బిడ్డను ఆకలితో ఉంచుతావా అని కమల్ అన్నం తిందురు అని తీసుకెళ్లిపోతాడు. పల్లవి మనసులో ఇందాకే మీ నాన్నకి గుండెపోటు వచ్చిందని బిర్యాని మేసాను ఇప్పుడే విత్తనం అంటే ఎలా తింటానని బలవంతంగా తింటుంది..
ఇక తర్వాత రోజు ఉదయం అవని రాజేంద్రప్రసాద్ దగ్గరకొచ్చి మీరు ఏమి ఆలోచించకండి మావయ్య టెన్షన్ పడకండి అని చెప్తుంది. అప్పుడే ఇంట్లోకి శ్రీకర్ వస్తాడు. నేను ముంబైలో ఉన్నాను అమ్మ ఫోన్ చేసినప్పుడు రాలేకపోయాను నాన్నను ఒకసారి చూస్తానని శ్రీకర్ లోపలికి వెళ్తాడు. అక్షయ్ అడ్డుకొని నాన్నకు టెన్షన్ పడగొద్దని చెప్పారు నిన్ను చూస్తే మళ్ళీ టెన్షన్ పడతాడు నువ్వు వెళ్ళరా అని బయటకు పంపిస్తాడు. శ్రీకర్ ని బయటికి పంపించడం పార్వతి చూస్తుంది. పల్లవి పార్వతికి అక్షయ గురించి లేనిపోనివి ఎక్కించి చెప్తుంది. పార్వతి మనసులో అక్షయ్ మీద కోపం కలిగేలా చేస్తుంది.. పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయో చెప్పడం కష్టం మీరు ఆస్తిని అందరి మీద సమానంగా వచ్చేలా పంచండి రాయించండి అని అవని అక్షయ్ అంటుంది.. అక్షయ్ అలాగే అంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో పార్వతి అక్షయ్ దయాకర్ ను చూస్తుంది. ఏం జరుగుతుందో చూడాలి..