స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ఎదుర్కొనే కామన్ ప్రాబ్లం బ్యాటరీ బ్యాకప్. చాలా ఫోన్లు కొత్తలో బాగానే బ్యాటరీ బ్యాకప్ అందించినా, నెమ్మది నెమ్మదిగా త్వరగా ఛార్జింగ్ అయిపోతుంటాయి. దానికి కారణం, ఫోన్ ఛార్జింగ్ చేయడంలో సరైన పద్దతులు పాటించకపోవడం. చాలా మంది తమ ఫోన్లు స్విచ్ఛాఫ్ అయ్యే వరకు వాడుతూనే ఉంటారు. మరికొంత మంది ఛార్జింగ్ పెట్టి అలా వదిలేస్తారు. 100 శాతం ఛార్జింగ్ అయినా, గంటల తరబడి ఫ్లగిన్ చేస్తారు. ఇలా చేయడం వల్ల బ్యాటరీ త్వరగా వీక్ అవుతుంది.
బ్యాటరీ లైఫ్ పెంచేందుకు గూగుల్ కీలక నిర్ణయం
స్మార్ట్ ఫోన్లకు సంబంధించిన బ్యాటరీ త్వరగా పాడైపోకుండా ఉండేందుకు గూగూల్ సరికొత్త నిర్ణయం తీసుకున్నది. ఇకపై తమ కంపెనీ తయారు చేసే పిక్సెల్ స్మార్ట్ ఫోన్లలో 80 శాతమే ఛార్జింగ్ అయ్యే ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. బ్యాటరీ 80 శాతం నిండగానే ఆటోమేటిక్ గా ఛార్జ్ చేయడం ఆపేస్తుంది. ఈ ఫీచర్ ద్వారా బ్యాటరీలో ఎక్కువ కాలం హెల్తీగా ఉంటుందని నిఫుణులు అభిప్రాయపడుతున్నారు.
అందుబాటులోకి ఛార్జింగ్ ఆప్టిమైజేషన్ ఫీచర్
ఇప్పటి వరకు స్మార్ట్ ఫోన్లు 100 శాతం ఛార్జ్ అవుతున్నాయి. ఈ విధానం వల్ల బ్యాటరీలోని లిథియం-అయాన్ టెక్నాలజీ త్వరగా డ్యామేజ్ అవుతున్నది. అయితే, 80 శాతం వరకు ఛార్జింగ్ చేయడం వల్ల బ్యాటరీలకు ఎక్కువ లైఫ్ ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గూగుల్ కంపెనీ నుంచి విడుదలైన ఇటీవలి పిక్ఎస్ స్మార్ట్ ఫోన్ లో ఛార్జింగ్ అప్టిమైజేషన్ ఫీచర్ ను పరిచయం చేసింది. ఈ ఫీచర్ ను ఆన్ చేస్తే, 80 శాతం ఛార్జింగ్ కాగానే ఆటోమేటిక్ గా ఆగుతుంది. ఒకవేళ మీరు రోజంతా బయటే ఉండాలి.. ఎక్కువ ఛార్జింగ్ కావాలి అనుకుంటే ఈ ఫీచర్ ను ఆఫ్ చేసుకోవచ్చు. 100 శాతం ఛార్జింగ్ పొందే అవకాశం ఉంటుంది.
Read Also: మీ పాత ఫోన్ కొత్త దానిలా పనిచేయాలంటే.. సింఫుల్ గా టిప్స్ పాటించండి!
ఇంట్లో, ఆఫీస్ లో ఉన్నప్పుడు 80 శాతం ఛార్జింగ్ ఫీచర్ ను ఎనేబుల్ చేసుకోవడం మంచిదంటున్నారు నిపుణులు. ఈ ఫీచర్ ఎనేబుల్ చేయడం వల్ల, రాత్రంగా ఛార్జింగ్ పెట్టినా కేవలం 80 శాతం వరకే ఛార్జ్ అవుతుంది. ఈ విధానం వల్ల బ్యాటరీ ఆరోగ్యంగా ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గూగుల్ తో పాటు ఇప్పటికే పలు కంపెనీలు ఈ ఫీచర ను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి.
శామ్ సంగ్ ప్రస్తుతం శామ్ సంగ్ ఆండ్రాయిడ్ వెర్షన్ One UI 6.1 (Android 14) లో ఇలాంటి ఫీచర్ ను అందిస్తున్నది. తమ కంపెనీకి చెందిన టాబ్లెట్లు, స్మార్ట్ ఫోన్లలో బ్యాటరీ ప్రొటెక్షన్ ఫంక్షన్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇక యాపిల్ iOS 14లోనూ బ్యాటరీ పవర్ ను ఆదా చేయడానికి, బ్యాటరీ ఆప్టిమైజ్ చేసే అవకాశం కల్పిస్తున్నది. మొత్తంగా ఈ విధానం ద్వారా ఎక్కువ కాలం బ్యాటరీని కాపాడుకునే అవకాశం ఉందంటున్నారు టెక్ నిపుణులు. ఇకపై అన్ని స్మార్ట్ ఫోన్లలో ఈ విధానాన్ని అమలు చేయాలంటున్నారు.
Read Also: వాట్సాప్ తో బ్యాటరీ డౌన్ అవుతుందా? సమస్యను సింఫుల్ గా సాల్వ్ చేసుకోండిలా!