E-Paper
Advertisement

ఒకే ఒక్క రీచార్జ్.. ఏడాది మొత్తం ఫ్రీ 5G, కాల్స్, ఓటీటీ.. జియో దుమ్మురేపే ప్లాన్!

ఒకే ఒక్క రీచార్జ్.. ఏడాది మొత్తం ఫ్రీ 5G, కాల్స్, ఓటీటీ.. జియో దుమ్మురేపే ప్లాన్!
Advertisement

Jio Plans: రిలయన్స్ జియో తన వినియోగదారుల కోసం ఒక అద్భుతమైన వార్షిక ప్లాన్‌ను తీసుకొచ్చింది. ప్రతి నెలా రీచార్జ్ చేసుకునే ఇబ్బంది లేకుండా, ఏడాది పొడవునా నిరంతర సేవలు పొందాలనుకునే వారి కోసం రూ. 3,599 ప్లాన్ ను అందుబాటులో ఉంచింది. ఈ ప్లాన్ కు సంబంధించి పూర్తి వివరాలు, అదనపు బెనిఫిట్స్, ఎవరికి ఉపయోగం, ఎలా రీఛార్జ్ చేయాలి వంటి విశేషాలు ఈ కథనంలో చూద్దాం.

రూ.3,599 ప్లాన్

ఈ ప్లాన్ ను 365 రోజుల వ్యాలిడిటీతో జియో తీసుకొచ్చింది. ఈ ప్లాన్ ద్వారా యూజర్లు.. ప్రతిరోజూ 2.5 GB హై-స్పీడ్ డేటా పొందొచ్చు. ఏడాది కాలానికి దాదాపు 912.5 GB డేటాను యూజ్ చేసుకోవచ్చు. దీంతో పాటు దేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా నాన్ స్టాప్ ఫ్రీ కాల్స్, రోజుకు 100 SMS లు చేసుకోవచ్చని జియో వర్గాలు ప్రకటించాయి.

అదనపు బెనిఫిట్స్

Advertisement

ఈ ప్లాన్ డేటా, కాలింగ్ మాత్రమే కాకుండా మరికొన్ని అదనపు బెనిఫిట్స్ ను సైతం అందిస్తోంది. జియో కంటెంట్ యాప్స్ అయిన జియోసినిమా, జియోటీవీతో పాటు జియోక్లౌడ్ యాప్స్‌కు ఫ్రీ యాక్సెస్ ను ఈ ప్లాన్ అందిస్తోంది. వీటన్నింటికీ మించి అర్హత కలిగిన యూజర్లు అపరిమిత 5G డేటాను పొందే ఛాన్స్ ను ఈ ప్లాన్ కల్పిస్తోంది. మీ వద్ద 5G మొబైల్ ఉండి మీ ప్రాంతంలో జియో 5G నెట్‌వర్క్ ఉంటే రోజువారీ 2.5 GB లిమిట్ తో సంబంధం లేకుండా నాన్ స్టాప్ డేటా వాడుకోవచ్చు.

ఎవరికి లాభం?

వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగులు, ఆన్‌లైన్ క్లాసులు వినే స్టూడెంట్స్, ఓటీటీలు – యూట్యూబ్ కంటెంట్ ఎక్కువగా చూసేవారికి ఈ ప్లాన్ చాలా లాభదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. అంతేకాకుండా ప్రతి నెలా ప్లాన్ ముగిసిపోతుందనే టెన్షన్ లేకుండా ప్రశాంతంగా ఉండాలనుకునే వారికి కూడా రూ.3,599 ప్లాన్ పర్ఫెక్ట్ ఛాయిస్ అని జియో వర్గాలు పేర్కొంటున్నాయి.

Advertisement

Also Read: దేశ వ్యాప్తంగా మరో 7 కొత్త బుల్లెట్ రైల్ రూట్లు, కేంద్రం గ్రీన్ సిగ్నల్!

ఎలా రీచార్జ్ చేయాలి?

ఈ ప్లాన్‌ను మొబైల్‌లోని మైజియో యాప్‌లో రీచార్జ్ సెక్షన్‌లోకి వెళ్లి రూ. 3,599 ప్లాన్‌ను యాక్టివేట్ చేసుకోవచ్చు. లేదంటే జియో అధికారిక వెబ్‌సైట్ ద్వారా నంబర్ ఎంటర్ చేసి రీచార్జ్ చేయవచ్చు. గూగుల్ పే, ఫోన్ పే వంటి యూపీఐ యాప్స్ యాప్స్ ద్వారా కూడా నేరుగా ఈ ప్లాన్‌ను సెలక్ట్ చేసుకోని పేమెంట్ ప్రక్రియను పూర్తి చేయవచ్చు.

Also Read: టాలీవుడ్‌లో క్రేజీ మల్టీస్టారర్.. గ్రాండ్‌గా ప్రారంభమైన వెంకటేష్, కళ్యాణ్ రామ్ మూవీ!

Related News

ఏఐ యుగంలో విప్లవాత్మక మార్పు.. షావోమి కొత్త ఫోన్ వెనుక ఆ ప్రత్యేకత ఏంటంటే?

Nothing Phone 3 ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం.. ఏకంగా రూ.27,000 తగ్గింపు!

కెమెరా అక్కర్లేదు, ఫోనే చాలు! మీ ఫస్ట్ వ్లాగ్ వైరల్ అవ్వాలంటే ఇవి మస్ట్

స్మార్ట్‌ఫోన్ మీ చేతిలోనే ఉంది.. కానీ ఈ అమేజింగ్ సెట్టింగ్స్ ఇప్పటివరకు ఎందుకు ట్రై చేయలేదు?

వర్షంలో తడిచినా పాడవ్వవు, రూ.20వేలలోపు టాప్-6 వాటర్‌ప్రూఫ్ ఫోన్లు!

రోజూ గిన్నెలు కడిగి విసుగొస్తుందా? ఒకేసారి 20 ప్లేట్ల సెట్ క్లీన్ చేసే కొత్త డిష్‌వాషర్ లాంచ్!

ఒక్కసారి ఛార్జ్ చేస్తే 45 రోజుల బ్యాటరీ బ్యాకప్..అదిరిపోయే ఫిట్‌నెస్ బ్యాండ్ లాంచ్!

జస్ట్ రూ.1,000కే బెస్ట్ ఇయర్ బడ్స్.. త్వరలో మార్కెట్లోకి రాబోతున్న టాప్ బ్రాండ్స్ ఇవే!

Big Stories

Advertisement
×