E-Paper
Advertisement

దేశ వ్యాప్తంగా మరో 7 కొత్త బుల్లెట్ రైల్ రూట్లు, కేంద్రం గ్రీన్ సిగ్నల్!

దేశ వ్యాప్తంగా మరో 7 కొత్త బుల్లెట్ రైల్ రూట్లు, కేంద్రం గ్రీన్ సిగ్నల్!
Advertisement

7 New Bullet Train Routes: దేశంలో బుల్లెట్ రైళ్ల విస్తరణకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ముంబై-అహ్మదాబాద్ హైస్పీడ్ రైలు ప్రాజెక్ట్‌ కు అదనంగా దేశ వ్యాప్తంగా మరో ఏడు బుల్లెట్ రైలు కారిడార్లను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. ఈ కొత్త మార్గాలు దేశంలోని మెట్రో నగరాలు, ఐటీ హబ్‌లు, పారిశ్రామిక కేంద్రాలు సహా పలు కీలక ప్రాంతాలను లింక్ చేసేలా రూపొందిస్తున్నారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే కీలక నగరాల మధ్య ప్రయాణ సమయం భారీగా తగ్గనుంది.

కొత్త బుల్లెట్ రైలు మార్గాలు ఇవే!

ప్రస్తుతం ప్రతిపాదిత దశలో ఉన్న ఏడు బుల్లెట్ రైలు మార్గాల్లో ముంబై-పూణే, పూణే-హైదరాబాద్, హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-చెన్నై, చెన్నై-బెంగళూరు, ఢిల్లీ-వారణాసి, వారణాసి-సిలిగురి కారిడార్లు ఉన్నాయి. ఈ మార్గాలపై ప్రస్తుతం సాధ్యాసాధ్యాల అధ్యయనాలు కొనసాగుతున్నాయి. అయితే, వీటి నిర్మాణానికి సంబంధించిన కచ్చితమైన టైమ్ బాండ్ ను  ప్రకటించలేదు. ఈ ప్రాజెక్టులు అమల్లోకి వస్తే దేశంలోని పలు కీలక నగరాల మధ్య వేగవంతమైన రవాణా వ్యవస్థ అందుబాటులోకి వస్తుంది. ముఖ్యంగా వ్యాపార, ఐటీ, పరిశ్రమల రంగాలకు యమరింత ఊరట కలగనుంది. పర్యాటక రంగం అభివృద్ధికి కూడా ఇవి దోహదపడతాయని అధికారులు భావిస్తున్నారు.

శరవేగంగా ముంబై-అహ్మదాబాద్ రైల్వే కారిడార్ నిర్మాణం

Advertisement

ఇక ప్రస్తుతం దేశంలో నిర్మాణంలో ఉన్న ఏకైక బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ ముంబై-అహ్మదాబాద్ హైస్పీడ్ రైలు మార్గం. మొత్తం 508 కిలోమీటర్ల పొడవు ఉన్న ఈ ప్రాజెక్ట్ జపాన్‌కు చెందిన షింకన్సెన్ టెక్నాలజీ ఆధారంగా రూపొందుతోంది. ఈ రైళ్లు గంటకు 320 కిలోమీటర్ల వరకు వేగంతో ప్రయాణించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఈ ప్రాజెక్ట్ పనులు దశలవారీగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే సూరత్-బిలిమోరా లాంటి కొన్ని సెక్షన్లలో నిర్మాణం వేగంగా సాగుతోంది. ఫస్ట్ ఫేజ్ సర్వీసులు 2027 ఆగస్టు నాటికి ప్రారంభించే అవకాశం ఉందని తెలుస్తోంది. తర్వాతి దశల్లో ఇతర మార్గాలను కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు.

ప్రత్యేక టెక్నాలజీతో బుల్లెట్ ప్రాజెక్ట్ నిర్మాణం

బుల్లెట్ రైళ్ల భద్రత, ప్రయాణికుల సౌకర్యాన్ని మరింత మెరుగుపరచేందుకు ఆధునిక టెక్నాలజీని కూడా వినియోగించనున్నారు. ముఖ్యంగా సొరంగాల వద్ద ప్రత్యేక టన్నెల్ హుడ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఈ వ్యవస్థను మొత్తం ఎనిమిది పర్వత సొరంగాల దగ్గర  అమర్చనున్నారు. వీటిలో ఏడు మహారాష్ట్రలో, ఒకటి గుజరాత్‌లో ఉంటుంది. ఎక్కువ వేగంతో ప్రయాణించే రైళ్లు సొరంగాల్లోకి ప్రవేశించినప్పుడు గాలి పీడనంలో ఆకస్మిక మార్పులు సంభవిస్తాయి. ఈ కారణంగా ప్రయాణికులకు అసౌకర్యం కలిగే అవకాశం ఉంటుంది. టన్నెల్ హుడ్ వ్యవస్థ ఈ సమస్యను తగ్గించి ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మారుస్తుంది. అలాగే, రైల్వే ఇన్ ఫ్రాపై ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. ప్రపంచ స్థాయి హైస్పీడ్ రైలు ప్రమాణాలకు అనుగుణంగా భారత్ లో బుల్లెట్ రైల్స్ నెట్‌ వర్క్‌ ను అభివృద్ధి చేస్తున్నారు.
Read Also: భారత్ గౌరవ్ రైల్లో నేపాల్ టూర్.. IRCTC అదిరిపోయే ప్యాకేజీ!

Related News

థార్ కొనాలనుకుంటున్నారా? కాస్త ఆగండి.. కొత్త ఫేస్‌లిఫ్ట్ వచ్చేస్తోంది!

అపాచీ బైక్‌లకు బిగ్ అప్‌డేట్.. కొత్త వేరియంట్లు, అదిరిపోయే ఫీచర్లు ఇవే!

మారుతి బాలెనో vs టాటా ఆల్ట్రోజ్.. టాప్ వేరియంట్లలో ఏది బెస్ట్?

థార్ To డస్టర్.. దీపావళికి ముందే రాబోతున్న 5 అదిరిపోయే SUVలు!

మహీంద్రా BE 6 vs టాటా కర్వ్ EV.. రెండింటిలో ఏది తోప్ అంటే?

సీటు కింద ఏకంగా 70 లీటర్ల స్టోరేజ్.. ఎక్కువ బూట్ స్పేస్ కావాలంటే వీటిని కొనండి!

ఎర్టిగా To ఇన్నోవా.. ఆగస్టులో ఎక్కువగా అమ్ముడైన 7-సీటర్ కార్లు ఇవే!

సింగిల్ ఛార్జ్ తో 400 కి.మీ రేంజ్.. కళ్లు చెదిరే ఈవీ స్కూటర్లు ఇవే!

Big Stories

Advertisement
×