అంతరిక్షంలో విత్తనం మొలకేత్తే విధానాన్ని పరీక్షించడంతో పాటు రోదసిలోని వ్యర్థాలను ఒడిసిపట్టే రోబోటిక్ హస్తం, హరిత చోదక వ్యవస్థ లాంటి వినూత్న ఉపకరణాలను కూడా స్పేడెక్స్ మిషన్ సమయంలో ఇస్రో అంతరిక్షంలోకి పంపింది. అమిటీ విశ్వవిద్యాలయం అభివృద్ది చేసిన ఏపీఈఎంఎస్ ద్వారా.. సూక్ష్మ గురుత్వాకర్షణ వాతావరనంలో పాలకూర వృద్దిని పరీక్షించనున్నారు. మొక్కలు గురుత్వాకర్షణ, కాంతి దిశను పసిగడుతున్న తీరు గురించి కొత్త అంశాలను ఈ ప్రయోగం ద్వారా తెలుస్తుందన్నారు సైంటిస్టులు. ఇది సక్సెస్ అయితే అంతరిక్షంలో పంటలు పండించడంపై భారీ పురోగతి ఏర్పడినట్టే అని ప్రపంచ దేశాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.
ఇస్రోకి చెందిన విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం రూపొందించిన డెబ్రీ క్యాప్చర్ రోబోటిక్ మ్యానిప్యులేటర్…కక్ష్యలో శకలాలను ఒడిసిపడుతుంది. పీఎస్ఎల్వీ-సి60 ద్వారా జంట స్పేడెక్స్ ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగించింది. అంతరిక్ష కేంద్ర నిర్మాణం సహా భవిష్యత్ లో చేపట్టబోయే పలు రోదసి కార్యక్రమాలు అవసరమైన డాకింగ్ పరిజ్ఙానాన్ని వీటి ద్వారా పరీక్షించనున్నారు.
Also Read: పిల్లల భద్రత ఇకపై మా బాధ్యత.. పేరెంట్స్ చేయాల్సింది ఆ ఒక్కటే – కేంద్రం
ఇస్రో అంతరిక్షంలోకి పంపిన మొదటి రోబోటిక్ చెయ్యి విజయవంతంగా పని చేసింది. ఇది స్పేడెక్స్ మిషన్‌లో భాగం.పీఎస్4-ఆర్బిటల్ ఎక్స్‌పెరిమెంట్ మాడ్యూల్ ప్లాట్‌ఫారమ్‌లో నిర్దిష్ట లక్ష్యాలకు అనుగుణంగా ఈ రోబోటిక్ చెయ్యి పనిచేయనుంది. ఈ విజయం మన దేశ రోదసి ప్రయోగాలు, అంతరిక్షం గురించి తెలుసుకునే ప్రయత్నాల్లో చెపుకోదగ్గ మైలురాయిగా నిలిచింది.