MAA.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న పూనమ్ కౌర్ (Poonam Kaur), గురూజీ త్రివిక్రమ్(Trivikram)ను ఉద్దేశించి ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా త్రివిక్రమ్ పై మా అసోసియేషన్ లో కంప్లైంట్ చేసిన ఎవరు యాక్షన్ తీసుకోలేదని, తనకు అన్యాయం జరిగిందని కామెంట్ చేయడంతో తాజాగా మా అసోసియేషన్ సభ్యులు స్పందిస్తూ పూనమ్ చేసిన పోస్ట్ పై కామెంట్లు చేశారు.
పూనమ్ కౌర్ ట్వీట్ పై మా అసోసియేషన్ స్పందన..
తాజాగా పూనమ్ కౌర్ ట్వీట్ పై మా కోశాధికారి శివ బాలాజీ (Shiva balaji)క్లారిటీ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. “పూనమ్ కౌర్ నుంచి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కి రాతపూర్వకంగా ఎలాంటి ఫిర్యాదు రాలేదు. మా టర్మ్ కంటే ముందే ఆమె కంప్లైంట్ ఇచ్చినట్టు కూడా రికార్డుల్లో ఎక్కడా లేదు. అయితే కంప్లైంట్ ఇచ్చినట్టు పూనమ్ కౌరు ట్విట్టర్ లో పెట్టడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. మా అసోసియేషన్ ను కానీ న్యాయ వ్యవస్థను కానీ ఆమె ఆశ్రయిస్తేనే న్యాయం జరుగుతుంది” అంటూ శివ బాలాజీ కామెంట్లు చేశారు. ప్రస్తుతం మా అసోసియేషన్ సభ్యుడైన శివబాలాజీ ఇలాంటి కామెంట్ చేయడంతో మరి ఎందుకు పూనమ్ అబద్ధాలు చెబుతోంది అని కూడా నెటిజన్స్ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.
త్రివిక్రమ్ పై సంచలన ట్వీట్ చేసిన పూనమ్..
తాజాగా పూనమ్ కౌర్ తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా.. నేను త్రివిక్రమ్ శ్రీనివాస్ మీద టాలీవుడ్ మా అసోసియేషన్ లో ఎన్నోసార్లు కంప్లైంట్ చేశాను. అయితే ఎవరూ కూడా త్రివిక్రమ్ ను ప్రశ్నించలేదు. కనీసం యాక్షన్ కూడా తీసుకోలేదు. నా జీవితాన్ని అన్ని రకాలుగా త్రివిక్రమ్ నాశనం చేశాడు. అయితే అలాంటి వాడిని ఇంకా ఎంకరేజ్ చేస్తున్నారు. నా ఆరోగ్యాన్ని, సంతోషాన్ని పూర్తిగా నాశనం చేశాడు” అంటూ త్రివిక్రమ్ పై ఆరోపణలు చేస్తూ ట్వీట్ చేసింది పూనమ్ కౌర్. ప్రస్తుతం పూనమ్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.