Big Stories

Samsung Galaxy F15 5G Launch: గెలాక్సీ కొత్త వేరియంట్ లాంచ్.. ఫోన్‌పై బోలేడు ఆఫర్లు!

Samsung Galaxy F15 5G Mobile Launch: స్మార్ట్ ‌ఫోన్ దిగ్గజం సామ్‌సంగ్ ప్రతి నెలలో ఏదోక ఫోన్‌ను లాంచ్ చేస్తుంది. ఈ క్రమంలో కంపెనీ కొత్త ఫోన్ లాంచ్ చేసేందుకు రంగం సిద్ధం చేసింది. సామ్‌సంగ్ గెలాక్సీ F15 5G న్యూ వేరియంట్ ఫోన్‌ను సేల్‌కు తీసుకొచ్చింది. సామ్‌సంగ్ బడ్జెట్ ప్రైజ్‌లో ఈ ఫోన్‌ను రిలీజ్ చేసింది. అంతే కాకుండా ఈ ఫోన్‌లో బిగ్ బ్యాటరీ ఉండునుంది. ఈ ఫోన్‌ ఇతర ఫీచర్లు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.

- Advertisement -

సామ్‌సంగ్ గెలాక్సీ F15 5G ఫోన్‌ను మార్చిలో లాంచ్ చేసింది. ఈ ఫోన్ ఆక్టా-కోర్ MediaTek డైమెన్సిటీ ప్రాసెసర్‌పై ఉంటుంది. ఫోన్ 6,000mAh బ్యాటరీతో వస్తుంది. ఫోటోల కోసం ఫోన్ బ్యాక్ సైడ్ 50MP ప్రైమరీ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ మొదట రెండు ర్యామ్ వేరియంట్లలో ప్రవేశపెట్టింది. ఇప్పుడు సామ్‌సంగ్ తన మూడవ RAM వేరియంట్‌ను విడుదల చేసింది.

- Advertisement -

Also Read: ఈ ఐదు పనులు చేస్తే మీ ఫోన్ బ్లాస్ట్ అవడం ఖాయం..!

సామ్‌సంగ్ గెలాక్సీ 8GB + 128GB వేరియంట్‌కి 15,999 రూపాయలు. ఈ ఫోన్‌లో 4GB + 128GB, 6GB + 128GB వేరియంట్స్‌లో ఉన్నాయి. ఈ ఫోన్ వేరియంట్ ధరలు వరుసగా 12,999 రూపాయలు, 14,499 రూపాయిలకుగా ఉన్నాయి. కస్టమర్‌లు బ్యాంక్ ఆఫర్‌లు లేదా అప్‌గ్రేడ్ బోనస్ ద్వారా రూ. 1,000 అదనపు తగ్గింపును కూడా పొందవచ్చు. ఫోన్ బ్లాక్, వైలెట్, గ్రీన్ కలర్ ఆప్షన్‌లలో వస్తుంది. సామ్‌సంగ్ అధికారిక వెబ్‌సైట్ లేదా ఫ్లిప్‌కార్ట్ నుంచి ఫోన్ కొనుగోలు చేయవచ్చు.

ఈ స్మార్ట్‌ఫోన్ 6.5-అంగుళాల ఫుల్ HD+సూపర్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. 90Hz రిఫ్రెష్ రేట్‌తో 1,080 x 2,340 పిక్సెల్స్ ఉంటాయి. ఈ ఫోన్ MediaTek Dimensity 6100+ ప్రాసెసర్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ Android 14 UI 5.0 పై రన్ అవుతుంది. ఫోన్‌పై నాలుగు OS అప్‌గ్రేడ్‌లను కూడా పొందుతారు. అంతేకాకుండా 5 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్ కూడా అందుబాటులో ఉంటుంది.

Also Read: రెడ్ మీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. 5G ఫోన్ రూ. 373కే!

సామ్‌సంగ్ గెలాక్సీ F15 5G కెమెరా విషయానికి వస్తే ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. దీని ప్రైమరీ కెమెరా 50MP. ఇది కాకుండా 5MP, 2MP కెమెరాలను కూడా అందించారు. దీని ఫ్రంట్ కెమెరా 13MP. బ్యాటరీ 6,000mAh, 25W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News