Big Stories

5 Causes of Smartphone Blast: సమ్మర్ లో ఈ ఐదు పనులు చేస్తే మీ ఫోన్ బ్లాస్ట్ అవడం ఖాయం..!

5 Reasons to Your Smartphone Blast in Summer: వేసవి ప్రారంభమై ఎండలు మండుతున్నాయి. ఈ సీజన్‌లో మీరు ఆరోగ్యాన్ని, చర్మాన్ని కాపాడుకున్నట్లే మీ గ్యాడ్జెట్లను కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. అందులో ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ వంటి వాటిని ఉపయోగిస్తుంటే కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. లేదంటే ఎలక్ట్రిక్ పరికరాలు కాలిపోయే ప్రమాదం ఉంది. ఇటువంటి సంఘటనలు ఎన్నో చూసే ఉంటాము. ఇంటర్నెట్‌లో సైతం దీనికి సంబంధించిన వీడియోలు అందుబాటులో ఉన్నాయి. అయితే మీరు మీ ఫోన్ బ్యాటరీ పేలుతుందన్న భయం నుంచి తప్పించుకోవాలంటే కొన్ని నియమాలు పాటించాలి.

- Advertisement -

ఛార్జింగ్..

- Advertisement -

స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్ విషయంలో మీరు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. కంపెనీ ప్రొవైడ్ చేసిన కేబుల్‌తో మాత్రమే మొబైల్ ఛార్జ్ చేయాలి. డూప్లికేట్ ఛార్జర్లను ఉపయోగించవద్దు. బ్యాటరీని ఫుల్ చేయవద్దు. 85 శాతం మాత్రమే ఛార్జ్ చేయండి. ఫోన్ ఛార్జింగ్‌లో పెట్టి వాడొద్దు. అలా చేయడం వల్ల బ్యాటరీపై ఒత్తిడిపడి వేడెక్కి పేలిపోతుంది.

గేమ్స్..

స్మార్ట్‌ఫోన్‌లో గేమ్స్ ఎక్కువగా ఆడకండి. గేమ్స్ వల్ల మొబైల్ ఎక్కువగా హీట్ అవుతుంది. ఇది బ్యాటరీపై అధిక ఒత్తిడిని కలిగిస్తుంది. స్మార్ట్‌ఫోన్ బాగా వేడెక్కుతుంది. ఇది నిరంతరం చేస్తే బ్యాటరీ కూడా పేలిపోయే ప్రమాదం ఉంది.

Also Read: వివో నుంచి 3D కర్వ్డ్ డిస్‌ప్లే ఫోన్.. ధర ఎంతంటే?

స్మార్ట్‌ఫోన్ కవర్..

స్మార్ట్‌ఫోన్ కవర్‌ను ఉపయోగిస్తుంటే దానిపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. మీరు కొనుగోలు చేసే ఏ కవర్ అయినా మందంగా ఉండకూడదు. ఫోన్ కవర్ మందంగా ఉంటే ఫోన్ వేడి బయటకు రాకుండా చేస్తుంది. కాబట్టి పలుచగా లైట్ వేయిట్ ఉంటే కవర్ లేేదా పౌచ్‌ను వాడండి.

స్మార్ట్‌ఫోన్ స్టోరేజీ..

స్మార్ట్ ఫోన్ స్టోరేజీని ఎప్పుడూ పూర్తిగా యూజ్ చేయకండి. దీనివల్ల బ్యాటరీపై ఎక్కువ ఒత్తిడి పడి బ్యాటరీ వెడెక్కుతుంది. అంతేకాకుండా ఫోన్ స్టోరేజ్ ఫుల్ అవడం ద్వారా ప్రాసెసర్ నెమ్మదిగా పని చేస్తుంది. ఇది ఫోన్‌పై అధిక ఒత్తిడిని కలిగిస్తుంది. కారణంగా వేడి ఉత్పత్తి అవుతుంది. దీనివల్ల బ్యాటరీ పేలవచ్చు.

Also Read: నోకియా నుంచి బోరింగ్ ఫోన్.. స్పెషాలిటీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ప్లేస్

స్మార్ట్‌ఫోన్‌ను అధిక వేడి ఉన్న ప్రదేశంలో ఉంచకండి. అలా చేయడం వల్ల స్మార్ట్‌ఫోన్‌ హీట్ అవుతుంది. దీనివల్ల పేలుడు సంభవించవచ్చు. అంతేకాకుండా ఫోన్ కాలిపోయే ప్రమాదం కూడా ఉంటుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News