BigTV English

Rishab Shetty on Neha Hiremath: నేహా హిరేమత్ ఘటన అమానుషం.. కాంతార హీరో పోస్ట్ వైరల్!

Rishab Shetty on Neha Hiremath: నేహా హిరేమత్ ఘటన అమానుషం.. కాంతార హీరో పోస్ట్ వైరల్!

Rishab Shetty Reaction on Neha Hiremath Murder: కర్ణాటకలో నేహా హిరేమత్ హత్య ఎంతటి సంచలనం సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏప్రిల్ 18 న కర్ణాటకలోని హుబ్బళ్లిలోని BVB కాలేజ్ లో కాంగ్రెస్‌కు చెందిన హుబ్బళ్లి-ధార్వాడ్ సిటీ కార్పొరేషన్ కార్పొరేటర్ నిరంజన్ హిరేమత్ కుమార్తె నేహా హిరేమత్ ను ఫయాజ్ అనే యువకుడు అతి దారుణంగా 9సార్లు కత్తితో పొడిచి పొడిచి హత్యచేశాడు. ఈ ఘటనలో ఆమె సంఘటనా స్థలంలోనే మృతి చెందింది. నేహాను, ఫయాజ్ ఎంతోకాలంగా ప్రేమించమని వేధిస్తున్నాడు. ఆమె ఒప్పుకోకపోవడంతో ప్రేమోన్మాది అయిన ఫయాజ్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఇందుకు సంబంధించిన వీడియో కర్ణాటకను మాత్రమే కాదు మొత్తం దేశాన్నే షేక్ చేసింది.


కాలేజ్ క్యాంపస్ లో ఒక అమ్మాయిని ఇంత దారుణంగా చంపినవారిని ఊరికే వదలకూడదని మహిళా సంఘాలు ర్యాలీలు నిర్వహిస్తున్నాయి. ఇంకోపక్క ఈ హత్య లవ్ జిహాద్ కి సంబంధించినదని నిరంజన్ హిరేమత్ చెప్పడం మరింత హీట్ పెంచింది. మొన్నటివరకు బీజేపీ ఈ మాట అంటే ఫైర్ అయిన కాంగ్రెస్ నేతలు.. ఇప్పుడు నిరంజన్ హిరేమత్ ను మీడియా ముందుకు తీసుకొచ్చి తన కుమార్తె హత్య లవ్ జిహాద్ అని చెప్పుకొచ్చాడు. ఇక ఇవన్నీ పక్కన పెడితే.. నేహా హత్యపై కన్నడ ఇండస్ట్రీ సపోర్ట్ చేసిన పాపాన పోలేదు. మొట్ట మొదటిసారి కన్నడ హీరో రిషబ్ శెట్టి.. నేహా హత్యపై నోరు విప్పాడు.

Also Read: Sunita Kejriwal: కేజ్రీవాల్‌ను చంపడానికి బీజేపీ కుట్ర.. తినే ఆహారాన్ని కూడా వదలడం లేదు: సునీతా కేజ్రీవాల్


సోషల్ మీడియా ద్వారా ఆయన నిందితులకు శిక్ష పడాలని కోరాడు. ” నేహా హిరేమత్ ఘటన అమానుషం. నేహా కుటుంబానికి ఈ దుఃఖాన్ని భరించే శక్తిని భగవంతుడు ప్రసాదించాలని, ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా దోషులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అభ్యర్థిస్తున్నాను” అంటూ తెలిపాడు. దీంతో అభిమానులు.. మొట్టమొదటి హీరో దేనికి భయపడకుండా పోస్ట్ చేశాడు.. సూపర్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇకపోతే ప్రస్తుతం రిషబ్ కాంతార 2 సినిమాతో బిజీగా ఉన్నాడు.

Related News

Dharsha Guptha: ఇంస్టాగ్రామ్ ద్వారా నెలకు లక్షల్లో ఆదాయం..ఈ ముద్దుగుమ్మ పనే బాగుందే!

Vithika sheru: మట్టి వినాయకుడిని చేసిన హీరోయిన్.. వామ్మో ఈ టాలెంట్ కూడా ఉందా?

Dethadi Alekhya Harika: మన క్యారెక్టర్ ని డిసైడ్ చేసేది అదే.. బుల్లి కథతో హారిక పోస్ట్!

Big TV kissik talks : స్టేజ్ పై అమ్మాయిలతో పండు అలా.. అడ్డంగా పరువుతీసేసిన వర్ష…

Big TV kissik talks : శేఖర్ మాస్టర్ అలాంటి వాడే.. షాకింగ్ విషయాలను బయట పెట్టిన పండు..!

The Big Folk Night 2025 : జానపదంతో దద్దరిల్లిన ఎల్బీ స్టేడియం.. ఘనంగా బిగ్ టీవీ ఫోక్ నైట్

Big Stories

×