BigTV English

MS Dhoni Fan Base: ధోనీ వస్తే.. ఆ రీసౌండే వేరబ్బా: డికాక్ భార్య

MS Dhoni Fan Base: ధోనీ వస్తే.. ఆ రీసౌండే వేరబ్బా: డికాక్ భార్య

De Kock Wife On MS Dhoni Fan Base: ఇండియన్ క్రికెట్ లో స్టార్ ప్లేయర్ గా ఎదగాలంటే ఎంతో కష్టపడాలి. ఎంతో కమిట్మెంట్ ఉండాలి. ఎంతో సాధన చేయాలి. ఎంతో డెడికేషన్ ఉండాలి. అవన్నీ ఆటగాళ్లలో ఉండటమే కాదు, జట్టులో కూడా ఉండేలా చూడాలి. ఒక కెప్టెన్ గా వాళ్లలో వాటిని పెంపొందించాలి.


క్రికెట్ లో మ్యాచ్ గెలవడం కాదు, అందులో కంట్రీ ప్రెస్టేజ్ ఉందని చాటి చెప్పిన వారిలో సౌరవ్ గంగూలీ, మహేంద్ర సింగ్ ధోనీ ఒకరని చెప్పాలి. వారిద్దరి రాకతోనే ఇండియన్ క్రికెట్ స్వరూప స్వభావాలే మారిపోయాయి. వ్యక్తిగత రికార్డుల కోసం కాదు, దేశం కోసం ఆడాలి, గెలుపు కోసం ఆడాలనే భావనను ఆటగాళ్లలో తీసుకొచ్చారు.

లేకపోతే ఎంతసేపు నేను సెంచరీ చేశానా? నాకొక రికార్డ్ వచ్చిందా? అన్నట్టే ఆడుకునేవారు. అలాంటి వాతావరణాన్ని మార్చి పారేశారు.అందుకనే వారు హీరోలయ్యారు. ఇక ధోనీ గురించి అందరికీ తెలిసిందే. తనిప్పటికి కూడా 42 వయసులో, మోకాలి నొప్పులతో కూడా ధనాధన్ క్రికెట్ ఆడుతున్నాడు. చివర్లో వచ్చి సిక్సుల మీద సిక్సులు, ఫోర్లు కొట్టి బ్రహ్మాండమైన ఫినిషింగ్ ఇస్తున్నాడు.


విషయానికి వస్తే లక్నో తో జరిగిన మ్యాచ్ లో ధోనీ చివర్లో వచ్చాడు. తను గ్రౌండులో అడుగుపెడుతంటే సరికి ఒక్కసారిగా స్టేడియం అంతా హోరెత్తిపోయింది. అంతేకాదు 9 బంతుల్లోనే 28 పరుగులు చేయడంతో అభిమానుల ఆనందానికి అంతే లేకుండా పోయింది.

అభిమానులు చేసే అరుపులు, కేకలు మరికొంత సేపు ఉండి ఉంటే, నా చెవులు చిల్లులు పడేవి…అని లక్నో సూపర్ జెయింట్స్ ఓపెనర్ క్వింటన్ డికాక్ భార్య సాషా ఇన్ స్టాలో షేర్ చేసింది. ఇప్పుడీ పోస్టు నెట్టింట వైరల్ గా మారింది.

Also Read: ధోని రికార్డ్ బ్రేక్ చేసిన కేఎల్ రాహుల్..

ధోనీ బ్యాటింగ్ కి వచ్చినప్పుడు ధ్వని తీవ్రత 95 డెసిబల్స్ కు చేరింది. భారీ శబ్ధాలతో చేసిన అల్లరి ఒక్క పదినిమిషాలు కొనసాగితే…ఎవరికైనా సరే, టెంపరరీగా వినికిడి లోపం రావడం ఖాయమని రాసుకొచ్చింది. అంతేకాదు తన స్మార్ట్ వాచ్ లో చూపించిన మెసేజ్ ని కూడా పోస్ట్ చేసింది. వీటికి తోడు.. తలకొట్టుకుంటున్నట్టుగా ఒక ఎమోజీని జత చేసింది.

ఇది చూసిన నెటిజన్లు ఘాటుగా కాకపోయినా, మరి తలా అంటే ఏమనుకున్నారు మేడమ్…ధోనీ ఒక ఎమోషన్, ఒక వైబ్రేషన్…అది భారతీయులకు మాత్రమే అర్థమవుతుంది, ఏదేమైనా మా ధోనీ లెవల్ వేరే అని రాసుకొచ్చారు.

Related News

Mark Wood : రోహిత్ శర్మకు బౌలింగ్ వేయడం నా వల్ల కాదు.. ఇంగ్లాండ్ బౌలర్ సంచలన వ్యాఖ్యలు

Michael Clarke Cancer : ఇప్పటివరకు క్యాన్సర్ బారిన పడ్డ క్రికెటర్లు వీళ్లే.. లిస్టులో టీమ్ ఇండియా ప్లేయర్ కూడా

Virender Sehwag :ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ లో వేలు పెట్టిన సెహ్వాగ్.. ఆడుకుంటున్న ఫ్యాన్స్

AB de Villiers : RCB కోసం రంగంలోకి ఏబీ డివిలియర్స్.. సరికొత్త రోల్ ఫిక్స్.. ఇక ఫ్యాన్స్ కు పండగే

Michael Clarke Cancer: మైఖేల్ క్లార్క్ కు క్యాన్సర్… ముక్కు కట్ చేసి మరీ ట్రీట్మెంట్

Ravichandran Ashwin: ఐపీఎల్ కు రిటైర్మెంట్ ప్రకటించిన అశ్విన్.. ధోని టార్చర్ తట్టుకోలేకే !

Big Stories

×