Samsung Galaxy S24 Ultra: సామ్‌సంగ్ ఫోన్లకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. ఫోన్ ప్రియులను ఆకట్టుకునేందుకు కంపెనీ ఎప్పటికప్పుడు అదిరిపోయే ఫీచర్లతో ఫోన్లను రిలీజ్ చేస్తుంది. ముఖ్యంగా సామాన్యులకు అందుబాటు ధరలో రిలీజ్ చేస్తూ మరింత గుర్తింపు సంపాదించుకుంది. అయితే ఈ కంపెనీలో ప్రీమియం ఫోన్లు కూడా బాగా సేల్ అవుతున్నాయి. ధర ఎంతున్నా కొనేందుకు కొందరు ఆసక్తి చూపిస్తున్నారు. మరి మీరు కూడా సామ్‌సంగ్ నుంచి ఒక మంచి ప్రీమియం ఫోన్‌ను కొనుక్కోవాలని అనుకున్నట్లయితే ఇదే బెటర్ ఛాన్స్.
ఎందుకంటే సామ్‌సంగ్ కంపెనీ త్వరలో Samsung Galaxy S25 Ultra స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లో లాంచ్ చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలో దాని ముందు మోడల్ Samsung Galaxy S24 Ultraపై భారతదేశంలో భారీ తగ్గింపులు అందించబడుతున్నాయి. దాదాపు రూ.20,000 ఈ ఎస్ 24 అల్ట్రాపై పొందొచ్చు. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌పై తగ్గింపు పరిమిత సమయం వరకు మాత్రమే ఉంటుంది. అందువల్ల ఈ ఫోన్‌ను కొనుక్కోవాలని అనుకునే వారికి ఇదే మంచి సమయం అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు దాని కొత్త ధర, ఆఫర్ వివరాలు గురించి వివరంగా తెలుసుకుందాం.
Samsung Galaxy S24 Ultra Specifications
Samsung Galaxy S24 Ultra స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. ఈ ప్రిమియం ఫోన్ 6.8-అంగుళాల QHD+ డైనమిక్ AMOLED 2X డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, 2600నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుంది. పనితీరు విషయానికొస్తే.. ఇది Snapdragon 8 Gen 3 SoC చిప్‌సెట్‌ను పొందుతుంది. కెమెరా సెటప్ విషయానికొస్తే.. ఇది 200MP వైడ్ యాంగిల్ కెమెరా, 50MP ప్రధాన కెమెరా, 12MP అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్, 3x ఆప్టికల్ జూమ్ సామర్థ్యం, 30x డిజిటల్ జూమ్‌తో కూడిన 10MP టెలిఫోటో కెమెరాతో సహా క్వాడ్ రియర్ కెమెరా సిస్టమ్‌ను కలిగి ఉంది.
Also Read: లీకైన గెలాక్సీ ఎస్25 అల్ట్రా రెండర్స్.. భయ్యా ఫీచర్స్ మామూలుగా లేవుగా!
ఇక ఫోన్ ముందు భాగంలో సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం ఇది 12MP కెమెరాను కలిగి ఉంది. ఈ ప్రీమియం ఫోన్ 45W వైర్డు, 15W వైర్‌లెస్ ఛార్జింగ్‌తో 5000mAh బ్యాటరీని పొందుతుంది. ఇది కాకుండా Galaxy S24 Ultra ఏడేళ్ల పాటు సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్ పొందుతుంది. ఇది AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ఫీచర్లతో వస్తుంది. లైవ్ ట్రాన్స్‌లేట్, ఇంటర్‌ప్రెటర్, రియల్ టైమ్ వాయిస్, టెక్స్ట్ ట్రాన్స్‌లేషన్ కోసం చాట్ అసిస్ట్ వంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి.
Samsung Galaxy S24 Ultra Price And Offer
కంపెనీ తన ప్రీమియం ఫోన్ Galaxy S24 Ultra మోడల్‌లోని 12GB ర్యామ్ + 256GB స్టోరేజ్ వేరియంట్‌ను రూ. 1,29,999 ప్రారంభ ధరకు విడుదల చేసింది. ఇది ఇప్పుడు ఈ ఫోన్‌పై కంపెనీ దాదాపు రూ.20,000 తగ్గింపు అందిస్తుంది. ఈ తగ్గింపుతో Samsung Galaxy S24 Ultra ని రూ.1,09,999కి కొనుక్కోవచ్చు. అలాగే పలు బ్యాంక్ ఆఫర్‌లు ఉన్నాయి. ఇందులో రూ.8,000 ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.
అలాగే రూ. 12,000 అదనపు అప్‌గ్రేడ్ బోనస్ కూడా లభిస్తుంది. ఇది కాకుండా కస్టమర్‌లు ఎంపిక చేసిన బ్యాంక్ కార్డ్ ట్రాన్సక్షన్లపై రూ.12,000 వరకు క్యాష్‌బ్యాక్ ప్రయోజనాన్ని కూడా పొందవచ్చు. ఇది మాత్రమే కాదు 24 నెలల పాటు నో-కాస్ట్ EMI ఆప్షన్‌లు కూడా ఉన్నాయి. అయితే కస్టమర్లు గుర్తుంచుకోవలసిన విషయం ఏంటంటే.. ఈ ఆఫర్ పరిమిత కాలానికి మాత్రమే ఉంటుంది. ఈ ఆఫర్‌లు దేశవ్యాప్తంగా ఉన్న Samsung ఇండియా ఆన్‌లైన్ స్టోర్‌లు, ఆఫ్‌లైన్ స్టోర్‌లలో అందుబాటులో ఉన్నాయి.