Samsung Galaxy S25 : ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ Samsung రాబోయే Galaxy S25 సిరీస్‌ను జనవరి 2025లో లాంఛ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ మెుబైల్ ఫీచర్స్ తో పాటు కలర్ ఆఫ్షన్స్ సైతం అదిరిపోయేలా ఉన్నాయి.
Samsung తన ఫ్లాగ్‌షిప్ లో Samsung Galaxy S25 సిరీస్ ను జనవరి 2025లో ప్రారంభించటానికి సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో ఈ సిరీస్ లో S25+, S25 అల్ట్రా, కొత్త స్లిమ్ మోడల్స్ రాబోతున్నట్లు తెలుస్తుంది. ఇక Samsung Galaxy S25, Galaxy S25+ మోడల్స్ కలర్ వేరియంట్స్ సైతం అత్యద్భుతంగా ఉన్నాయి. ఈ మోడల్స్ ఐదు కలర్ ఆప్షన్లలో రాబోతున్నట్లు తెలుస్తుంది. నలుపు, ఆకుపచ్చ, ఊదా, నీలం, తెలుపు/వెండి రంగులలో అందుబాటులో ఉండే అవకాశం కనిపిస్తుంది.
Galaxy S24, S24+ మెుబైల్స్ అంబర్ ఎల్లో, కోబాల్ట్ వైలెట్, మార్బుల్ గ్రే, ఒనిక్స్ బ్లాక్ కలర్స్ లో అందుబాటులోకి వచ్చాయి. ఇక వీటిలో సఫైర్ బ్లూ, జేడ్ గ్రీన్, సాండ్‌స్టోన్, ఆరెంజ్ స్టాండర్డ్ కలర్స్ ఆన్ లైన్ లో అందుబాటులో ఉన్నాయి. ఇక Galaxy S25 అల్ట్రా టైటానియం బ్లాక్, టైటానియం బ్లూ, టైటానియం గ్రే, టైటానియం సిల్వర్‌తో సహా “టైటానియం” థీమ్‌తో రాబోతున్నట్లు తెలుస్తుంది.
ఇక Galaxy S25 లైనప్ లో Galaxy S25, Galaxy S25+, Galaxy S25 అల్ట్రా మెుబైల్స్ ఉండనున్నట్లు తెలుస్తుంది. ఈ మెుబైల్స్ అన్నీ US వెర్షన్‌తో మోడల్ నంబర్ SM-S937 ప్రాసెసర్ కింద పనిచేయనున్నాయి. నిజానికి Galaxy S25 Slim మోడల్ కూడా రాబోతుంది. సామ్ సాంగ్ గేలక్సీ మెుబైల్స్ ఫీచర్స్ సైతం అదిరిపోయేలా ఉన్నాయి. ఇక ఇందులో కెమెరా స్పెషల్ ఎట్రాక్షన్ గా మారనున్నట్లు తెలుస్తుంది. హై క్వాలిటీ ఇమేజెస్ ను ఇచ్చే 200MP కెమెరా ఇందులో ఉండే అవకాశం కనిపిస్తుంది.
ఇక Galaxy S25 అల్ట్రాలో 3x ఆప్టికల్ జూమ్‌తో 10MP టెలిఫోటో లెన్స్, 5x ఆప్టికల్ జూమ్‌తో సూపర్ టెలిఫోటో కెమెరా, 200MP మెుయిన్ కెమెరా, 50MP అల్ట్రావైడ్ కెమెరాతో రాబోతుంది. Galaxy S25 స్లిమ్ 12MP అల్ట్రావైడ్ కెమెరా, 10MP టెలిఫోటో కెమెరాతో రాబోతుందని.. ఇక Galaxy S25+ మెుబైల్ లో ఉన్నట్లే 200MP కెమెరా ఉండనుంది. S25 స్లిమ్ లో ఫ్రంట్ కెమెరా మిగిలిన సామ్ సాంగ్ మోడల్స్ లో ఉన్నట్లే 12MP కెమెరా ఉండనుంది.
ఇందులో 5000mah బ్యాటరీతో పాటు 100W ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చే అవకాశం ఉంది. ఇక ఇంతకుముందు మోడల్స్ లో వచ్చినట్టే స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ చిప్ సెట్ తో ఈ మెుబైల్స్ రాబోతున్నాయని.. 16 GB + 512 GB స్టోరీజ్ సదుపాయం ఉండే అవకాశం ఉందని టెక్ వర్గాలు ఇప్పటికే అంచనా వేసేస్తున్నాయి. మరి వచ్చే నెలలోనే లాంఛ్ కాబోతున్న ఈ మెుబైల్స్ పై మరిన్ని అప్డేట్స్ త్వరలోనే వచ్చే అవకాశం కనిపిస్తుంది.
ALSO READ : ఐఫోన్ 15 ప్రో, సామ్ సాంగ్ గేలక్సీ S24 అల్ట్రా ధర ఒకటే.. మరి వీటిలో ఏది బెస్ట్..!