Samsung Galaxy Book 5 Pro : దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ టెక్ దిగ్గజం, ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ సామ్ సాంగ్ కొత్త ల్యాప్ టాప్‌ను లాంఛ్ చేసింది. కొత్త ఇంటెల్ కోర్ అల్ట్రా సిరీస్ 2 చిప్సెట్తో పాటు డైనమిక్ అమోలెడ్ 2X డిస్ప్లే సహా మరిన్ని అత్యాధునిక ఫీచర్లతో విడుదల చేసింది. ఇంకా మైక్రోసాఫ్ట్ కోపైలెట్, శాంసంగ్ గెలాక్సీ ఏఐ ఫీచర్లు కూడా ఉన్నాయి. అయితే ఈ కొత్త ల్యాప్ టాప్ ధరల వివరాలు ఏమీ తెలియలేదు.
ఎప్పటికప్పుడు తన కస్టమర్స్ కోసం లేటెస్ట్ గ్యాడ్జెట్స్ అందుబాటులోకి తీసుకొస్తున్న ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ సామ్ సాంగ్ తాజాగా హై క్వాలిటీ ల్యాప్ టాప్ ను లాంఛ్ చేసింది. అదిరిపోయే ఫీచర్స్ తో పాటు స్పెసిఫికేషన్స్ తో వచ్చేసిన ఈ లాప్టాప్ ప్రస్తుతం టెక్ ప్రియులను అలరిస్తుంది. ఇక Samsung Galaxy Book 5 Pro పేరుతో వచ్చేసిందీ ల్యాప్ టాప్.
Samsung Galaxy Book 5 Pro Features
స్పెసిఫికేషన్స్ అండ్ ఫీచర్స్ –
ఈ శాంసంగ్ గెలాక్సీ బుక్ 5 ప్రో రెండు డిఫరెంట్ సైజ్‌లలో అందుబాటులో ఉండనుంది. 14 ఇంచ్, 16 ఇంచ్ సైజ్‌లలో లభించనుంది. అలానే డైనమిక్ అమెలెడ్ 2X డిస్ప్లే, విజన్ బూస్టర్ ఫీచర్ కూడా ఉండనుంది. ఇతర ఏ ల్యాప్‌టాప్‌లో లేనంత స్ట్రీమింగ్ బెస్ట్ వ్యూ ఎక్స్పీరియన్స్ ఇవ్వనుందట. న్యూట్రల్ ప్రాసెసింగ్ యూనిట్‌తో కూడిన ఇంటెల్ కోర్ అల్ట్రా ప్రాసెసర్ సిరీస్ 2ను కలిగి ఉంది. ఇది ఒక సెకండ్‌కు 47 ట్రిలియన్ ఆపరేషన్స్‌ను సపోర్ట్ చేస్తుంది.
కలర్స్ విషయానికొస్తే, రెండు డిఫరెంట్ కలర్స్‌లో ఈ సిరీస్ ల్యాప్టాప్ అందుబాటులోకి రానుంది. సిల్వర్, గ్రే రంగుల్లో లభించనుంది. ఇంకా ఏఐ ఫీచర్స్ కూడా ఉన్నాయి. సెర్స్ చేయడానికి గూగుల్స్ సర్కిల్ ఉంది. దీంతో యూజర్స్ స్క్రీన్‌పై కావాల్సిన దానిని హైలైట్ చేసి, వెబ్‌లో ఏం కావాలో సెర్చ్ చేయొచ్చు.
ఇంకా ఈ ల్యాప్టాప్ హెచ్డీఆర్ టెక్నాలజీని, క్వాడ్ స్పీకర్ సెటప్, డాల్బీ అట్మాస్‌ను సపోర్ట్ చేస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 20 గంటలకు పైగా పనిచేస్తుంది. కనెక్టివిటీ విషయానికొస్తే, 3.5ఎమ్ఎమ్ హెడ్‌ఫోన్ జాక్‌ను, మైక్రోఎస్డీ కార్డ్ రీడర్, యూఎస్బీ టైప్ ఏ పోర్ట్స్, థండర్‌బోల్ట్స్ 4 పోర్ట్స్, హెచ్డీఎమ్ఐ 2.1 పోర్ట్స్‌ను సపోర్ట్ చేస్తుంది. ధర విషయానికొస్తే ఇంకా దీని ధర కన్ఫామ్ కాలేదు కానీ, భారత కరెన్సీలో దాదాపు రూ. లక్ష ఉండొచ్చని అంచనా. అంటే ఆపిల్ మ్యాక్ బుక్ తో సమాన ధర ఉన్నట్టేనని తెలుస్తుంది.
జనవరి 2, 2025 నుంచి సేల్ ప్రారంభం కానుంది. అయితే ఈ ల్యాప్‌టాప్‌ను శాంసంగ్ తన హోమ్ కంట్లోనే లాంఛ్ చేసింది. గ్లోబల్ మార్కెట్‌తో పాటు భారత్ మార్కెట్లో ఎప్పుడు లాంఛ్ చేస్తుందో కన్ఫామ్ కాలేదు. త్వరలోనే దీనికి సంబంధించిన వివరాలు బయటకు రానున్నాయి. ఇక ఏది ఏమైనా ఈ లాప్టాప్ లాంఛ్ అయ్యాక టెక్ ప్రియులను అలరిస్తుందని స్మార్ట్ గాడ్జెట్స్ ప్రియులు అంచనా వేస్తున్నారు.
ALSO READ : మీ కారు మిమ్మల్మి సైబర్ నేరస్థులకు అప్పగించేస్తుంది.. నిజం.. నమ్మరా!