Indian Railways: క్రెడిట్ కార్డులు మంచి డీల్స్ తో పాటు ప్రత్యేకమైన తగ్గింపులను అందిస్తాయి. తక్కువ ఖర్చుతో విలాసవంతమైన విహారయాత్రలు చేసే అవకాశం ఉంటుంది. మీరు తరచుగా రైలు ప్రయాణాలు చేస్తున్నట్లయితే, రైలు టికెట్ బుకింగ్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన ట్రావెల్ క్రెడిట్ కార్డుల గురించి తెలుసుకోండి. ఈ క్రెడిట్ కార్డులతో ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ (IRCTC) బుకింగ్‌లు, కాంప్లిమెంటరీ రైల్వే లాంజ్ యాక్సెస్, రివార్డ్ పాయింట్లు సహా మరెన్నో ప్రత్యేక క్యాష్ బ్యాక్‌లకు యాక్సెస్ పొందే అవకాశం ఉంటుంది.
బెస్ట్ ట్రావెల్ క్రెడిట్ కార్డులు
⦿ SBI IRCTC ప్లాటినం క్రెడిట్ కార్డ్: యాన్యువల్ ఫీజు రూ. 500 కాగా, రెన్యువల్ ఫీజు రూ. 300.
⦿ ఎయిర్ ఇండియా SBI సిగ్నేచర్ క్రెడిట్ కార్డ్: యాన్యువల్ ఫీజు రూ. 4999 కాగా, రెన్యువల్ ఫీజు రూ. 4999.
⦿ కోటక్ రాయల్ సిగ్నేచర్ క్రెడిట్ కార్డ్: యాన్యువల్ ఫీజు లేదు, రెన్యువల్ ఫీజు రూ. 999.
⦿ HDFC భారత్ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్: యాన్యువల్ ఫీజు రూ. 500, రెన్యువల్ ఫీజు రూ. 500.
❂SBI IRCTC ప్లాటినం క్రెడిట్ కార్డ్
☀IRCTC బుకింగ్‌లపై 1.8% రాయితీ పొందే అవకాశం ఉంటుంది.
☀IRCTC యాప్ నుంచి చేసే AC1, AC2, AC3, చైర్ కార్ బుకింగ్‌లపై 10% వ్యాల్యూను రివార్డు పాయింట్లుగా పొందచ్చు.
☀ఎంపిక చేసిన స్టేషన్లలో కాంప్లిమెంటరీ రైల్వే లాంజ్ ఎంట్రీ ఉంటుంది.
☀ప్రతి రూపాయికి 1 రివార్డ్ పాయింట్‌ని పొందచ్చు.
❂ఎయిర్ ఇండియా SBI సిగ్నేచర్ క్రెడిట్ కార్డ్
☀యాన్యువల్ ఫీజు పే చేసిన 15 రోజులలోపు 20,000 రివార్డ్ పాయింట్లను పొందే అవకాశం ఉంటుంది.
☀మీ మెంబర్ షిప్ ను రెన్యువల్ చేసిన ప్రతిసారి 5000 బోనస్ పాయింట్లను పొందచ్చు.
☀మూడు నెలలకు రెండు కాంప్లిమెంటరీ డొమెస్టిక్ ఎయిర్ పోర్ట్ లాంజ్ యాక్సెస్‌ను పొందచ్చు.
☀వెబ్ సైట్ ద్వారా ఎయిర్ ఇండియా టిక్కెట్లను బుక్ చేసినప్పుడు ప్రత్యేకమైన ఆఫర్లు లభిస్తాయి.
☀దేశమంతా పెట్రోల్ బంకుల దగ్గర 1% ఫ్యూయెల్ సర్ ఛార్జ్ మినహాయింపు ఉంటుంది.
❂కోటక్ రాయల్ సిగ్నేచర్ క్రెడిట్ కార్డ్
☀ IRCTC బుకింగ్‌లపై ఏడాదికి రూ. 500 వరకు తగ్గింపు పొందచ్చు.
☀రూ. 500 నుంచి రూ. 3000 వరకు ఫ్యూయెల్ కొనుగోలుపై 3 శాతం తగ్గింపు పొందే అవకాశం ఉంటుంది.
☀ఎయిర్ పోర్టు, ఎంపిక చేసిన రైల్వే లాంజ్ లకు ఉచిత యాక్సెస్ ఉంటుంది.
❂HDFC భారత్ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్
☀IRCTC రైలు టికెట్ బుకింగ్‌లు, యుటిలిటీ చెల్లింపులు, ఫ్యూయెల్ కొనుగోలుపై 5% ఇన్ స్టంట్ క్యాష్ బ్యాక్ లభిస్తుంది.
☀దేశంలోని అన్ని పెట్రోల్ బంకుల్లో 1% ఫ్యూయెల్ సర్ ఛార్జ్ మినహాయింపు ఉంటుంది.
☀EasyEMI, PayZapp, SmartBUY ద్వారా జరిగే అన్ని లావాదేవీలపై 5% క్యాష్‌బ్యాక్ ఆఫర్ లభిస్తుంది.
Read Also: టికెట్లతోనే కాదు.. క్యాన్సలేషన్‌తో కూడా డబ్బులే డబ్బులు.. ఎంత వస్తుందంటే?