BigTV English

Samsung Galaxy Watch 7: మీ గుండె ఆరోగ్యాన్ని చెప్పే శాంసంగ్ గెలాక్సీ వాచ్.. ఇక అప్డేట్ చేసుకోండి మరి..

Samsung Galaxy Watch 7: మీ గుండె ఆరోగ్యాన్ని చెప్పే శాంసంగ్ గెలాక్సీ వాచ్.. ఇక అప్డేట్ చేసుకోండి మరి..

Samsung Galaxy Watch 7  is now coming with new HMR feature: శాంసంగ్ గెలాక్సీ వాచ్ 7.. ఇప్పుడు కొత్త హెచ్ ఎంఆర్ ఫీచర్ తో రాబోతోంది. ఇది మనుషుల గుండె వేగాన్ని కనిపెట్టి, ముందుగా సంకేతాలు ఇస్తుంది. ఇది హెల్త్ మానిటర్ యాప్ ద్వారా పనిచేస్తుంది. అయితే భారతదేశంలో శాంసంగ్ స్మార్ట్ వాచ్ ల ద్వారా.. ఒక విప్లవాత్మకమైన మార్పునకు ఎప్పుడో శ్రీకారం చుట్టిందని చెబుతున్నారు. స్మార్ట్ వాచ్ శ్రేణిలోని బయో యాక్టివ్ సెన్సార్ ఉపయోగించి, గుండె లయలో అసాధారణ తేడాలుంటే, అది వాచ్ ధరించేవారిని అప్రమత్తం చేస్తుంది. అలా వారిని కాపాడుతుందని అంటున్నారు. ఇది ముఖ్యంగా ప్రాణాంతక హృదయ నాళ పరిస్థితిని సూచిస్తుందని చెబుతున్నారు.


ఈ ఫీచర్ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా శాంసంగ్ వాచ్ ల్లో ఉండగా, ఇప్పుడు దానిని మరింత అప్ డేట్ చేశారని అంటున్నారు. అయితే మరో కొద్ది రోజుల్లో దక్షిణ కొరియా టెక్నాలజీ దిగ్గజ సంస్థ ఒకటి, భారత మార్కెట్ లోకి కొత్త స్మార్ట్ ఫోన్లతో తీసుకురానుందని తెలిపింది. అందుకే శాంసంగ్ లో కూడా ఈ ఫీచర్ ఉందని చెప్పడం తమ ఉద్దేశమని సంస్థ తెలిపింది.

ఇక్కడ మరో కొత్త విషయం ఏమిటంటే, ఇంతకుముందు శాంసంగ్ వాచ్ మోడళ్లు కొన్నవారికి కూడా.. ఈ ఫీచర్ అప్ డేట్ అవుతుందని కంగారుపడాల్సిన పనిలేదని శాంసంగ్ సంస్థ  తెలిపింది. అలాగే శాంసంగ్ గెలాక్సీ వాచ్ లపై ఐహెచ్ ఆర్ ఎం నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్టు సంస్థ ప్రకటనలో తెలిపింది. అది వచ్చిన వారు, అది ఆన్ చేస్తే ఆటోమేటిక్ గా మీ స్మార్ట్ వాచ్ లలో అప్ డేట్ అయిపోతుందని వివరించింది.


Also Read: మార్కెట్లో ట్రెండ్ అవుతున్న.. కొత్త మొబైల్ ‘వన్ ప్లస్ 13’.. ఫీచర్లు

రక్తపోటు, గుండె లయ సక్రమంగా లేకపోవడం, ఈసీజీ తరహా ఎన్నో ఫీచర్లు  శాంసంగ్ గెలాక్సీ స్మార్ట్ ఫోన్ లో ఉన్నాయని తెలిపింది. ఇకపోతే  గెలాక్సీ వాచ్ 7, గెలాక్సీ వాచ్ 6, గెలాక్సీ వాచ్ 5, గెలాక్సీ వాచ్ 4తో సహా కంపెనీ స్మార్ట్ వాచ్ లు సపోర్ట్ చేస్తాయని పేర్కొంది.

ఈ స్మార్ట్ వాచ్ ల ద్వారా ఇప్పటికే చాలామంది ప్రాణాలు కాపాడినట్టు శాంసంగ్ సంస్థ తెలిపింది. సమయానికి వారు ఆసుపత్రికి చేరుకోవడం లేదా డాక్టర్ల వద్దకు రెగ్యులర్ చెకప్ నకు వెళ్లేటప్పుడు, స్మార్ట్ వాచ్ ల్లో నమోదైన వివరాలు చెప్పి, సరైన మందులు తీసుకోవడం చేస్తున్నారని సంస్థ పేర్కొంది.

Related News

2025 Best Budget Phones: iQOO Z10x, Poco M7, Moto G85.. 2025లో ₹15,000 లోపు బెస్ట్ 5G ఫోన్స్ ఇవే..

GPT-5 Backlash: జిపిటి-5 వద్దు రా బాబు.. చాట్ జిపిటి కొత్త వెర్షన్‌పై యూజర్ల అసంతృప్తి

Vivo Y400 vs iQOO Z10R vs OnePlus Nord CE 5: రూ.25,000 లోపు బడ్జెట్ లో ఏది బెస్ట్?

iPhone 17 Pro GPT-5: ఐఫోన్ 17 ప్రోలో చాట్ జిపిటి-5.. ఆపిల్ సంచలన ప్రకటన

GPT 5 vs GPT 4: AI ప్రపంచంలో నెక్ట్ లెవెల్… ఇక ఉద్యోగాలు గోవిందా ?

Redmi Note 14 SE vs Tecno Pova 7 Pro vs Galaxy M36: ఒకే రేంజ్‌లో మూడు కొత్త ఫోన్లు.. ఏది బెస్ట్ తెలుసా?

Big Stories

×