BigTV English

Samsung Released Galaxy A55 & A35: ఇండియన్ మార్కెట్లోకి సామ్‌సంగ్ Galaxy A55 మరియు Galaxy A35.. అబో.. ఫీచర్స్ అదుర్స్!

Samsung Released Galaxy A55 & A35: ఇండియన్ మార్కెట్లోకి సామ్‌సంగ్ Galaxy A55 మరియు Galaxy A35.. అబో.. ఫీచర్స్ అదుర్స్!

Samsung smartphones


Samsung Released Galaxy A55 & A35 in Indian Market: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నిరక్షణకు తెరపడింది. సామ్‌సంగ్ తన కొత్త స్మార్ట్ ఫోన్‌ను ఇండియా మార్కెట్‌లోకి సంస్థ లాంచ్ చేసింది. ఇందులో భాగంగా సామ్‌సంగ్ గెలాక్సీ ఏ55, ఏ35ని రిలీజ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్‌లను కంపెనీ మిడ్​ రేంజ్​ కేటగిరీల్లో తీసుకొచ్చింది. ఇంతకీ ఈ స్మార్ట్ ఫోన్స్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

సామ్‌సంగ్‌ గ్యాలక్సీ ఏ55


ఈ ఫోన్‌లో .. 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో కూడిన 6.6 ఇంచ్​ సూపర్​ అమోలెడ్​ డిస్‌ప్లే ఉంటుంది. ఇది గొరిల్లా గ్లాస్​ విక్టస్​ ప్రొటెక్షనన్‌‌తో లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ ఇన్​-హైస్​ ఎక్సినోస్​ 1480 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇందులో 8జీబీ ర్యామ్​- 128జీబీ స్టోరేజ్​, 8జీబీ ర్యామ్​- 256జీబీ స్టోరేజ్‌తో రెండు వేరియంట్లు ఉన్నాయి. ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో ఏ55 పనిచేస్తుంది.

కెమెరా విషయానికొస్తే.. సామ్‌సంగ్ గెలాక్సీ ఏ55లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన ట్రిపుల్‌ రెయిర్ కెమెరా సెటప్‌ను ఇచ్చారు. 12 ఎంపీ అల్ట్రావైడ్, 5 ఎంపీ మాక్రో లెన్స్ ఉండనున్నాయి. ఇక ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే 32 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇందులో లో- లైట్​ ఫొటోగ్రఫీ కోసం ఏఐ ఇమేజ్​ సిగ్నల్​ ప్రాసెసింగ్​ అందించారు. 5000 ఎంఏహెచ్​ బ్యాటరీ కెపాసిటితో ఇది పనిచేస్తుంది.

Also Read: ఏంటీ.. వన్‌ప్లస్ 5జీ స్మార్ట్‌ఫోన్ ధర ఇంత చీప్ ఆ.. ఈ ఆఫర్ అస్సలు వదలకూడదు..

సామ్​సంగ్​ గెలాక్సీ ఏ35

సామ్​సంగ్​ గెలాక్సీ ఏ35 ఫీచర్ల విషయానికొస్తే.. 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేటుతో కూటిన ఫుల్ హె‌డీ+ఆమోలెడ్ డిస్‌ప్లే పొందుపరిచారు. ఎక్సినోస్​ 1380 ప్రాసెసర్‌‌పై ఫోన్ రన్ అవుతుంది. ఏ35
6జీబీ ర్యామ్​- 128జీబీ స్టోరేజ్​, 6జీబీ ర్యామ్​- 256జీబీ స్టోరేజ్​, 8జీబీ ర్యామ్​- 256జీబీ స్టోరేజ్ వేరియంట్స్‌లో లభిస్తుంది. ఆండ్రాయిడ్​ 14 ఆపరేటింగ్‌ సిస్టమ్‌ వన్​ యూఐ 6.1 సాఫ్ట్‌వేర్ ఆధారంగా ఇది పని చేస్తుంది. దీనిలో నాక్స్​ 3.1 ప్రొటెక్షన్​ ఉంటుంది.

Also Read: ఐఫోన్ 15 పై క్రేజీ ఆఫర్.. మరో 4 రోజుల వరకే ఛాన్స్!

కెమెరా విషయానికొస్తే.. ఏ 35 స్మార్ట్‌ఫోన్‌లో 50ఎంపీ ప్రైమరీ కెమెరా సెటప్ అందించారు. ఇందులో 8 ఎంపీ అల్ట్రావైడ్, 5 ఎంపీ మైక్రో లెన్స్‌తో ఉంటాయి. 13 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. 5000 ఎంఏహెచ్​ బ్యాటరీపై ఇది పనిచేస్తుంది.

Tags

Related News

Galaxy S24 vs iPhone 16 Pro: గెలాక్సీ S24 అల్ట్రా vs ఐఫోన్ 16 ప్రో.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఆఫర్లతో ఏది బెస్ట్?

iPhone 17 Series 5G: ఐఫోన్ 17 సిరీస్ 5జి.. కొత్త ఫీచర్లతో టెక్ లవర్స్‌కి పెద్ద గిఫ్ట్

Apple Foldable iPhone: ఆపిల్ ఫోల్డెబుల్ ఫోన్ డిజైన్ లీక్.. అత్యంత ఖరీదైన ఐఫోన్ ఇధే

Samsung Galaxy S25 5G: వామ్మో.. ఏకంగా 200MP కెమేరానా.. మార్కెట్లోకి వచ్చేసిన సామ్‌సంగ్ గెలెక్సీ ఎస్25 5G

PS5 Big Discount: ప్లే స్టేషన్ 5పై భారీ తగ్గింపు.. ఇండియాలో మాత్రమే

Amazon Flipkart Iphones: అమెజాన్ ఫ్లిప్‌కార్ట్‌ ఫెస్టివల్ సేల్.. ఐఫోన్ 15, 16పై బెస్ట్ డీల్స్ ఇవే

Realme 15T 5G: రియల్‌మీ 15టి 5జి స్మార్ట్‌ఫోన్‌ లాంచ్.. పవర్ యూజర్స్ కోసం స్పెషల్ మొబైల్..

WhatsApp Secert Chat: వాట్సాప్ లో సీక్రెట్ చాటింగ్ ఫీచర్..  ఎలా చేయాలంటే..

Big Stories

×