BigTV English

Samsung Galaxy Ring: ఈ రింగ్ ఉంటే మీరే కింగ్.. మీ హెల్త్ డేటాను ట్రాక్ చేస్తుంది!

Samsung Galaxy Ring: ఈ రింగ్ ఉంటే మీరే కింగ్.. మీ హెల్త్ డేటాను ట్రాక్ చేస్తుంది!

Samsung Galaxy Ring: ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. దీని కారణంగా కొత్తకొత్త గ్యాడ్జెట్లు మార్కెట్‌లోకి వస్తున్నాయి. ఇటీవల కాలంలో ఈ ట్రెండ్ మరింత ఎక్కువైంది. స్మార్ట్‌ఫోన్ వాడకం పెరగడంతో దాని సహాయంతో పనిచేసే యాక్ససరీస్‌‌కు డిమాండ్ ఏర్పడుతుంది.  దీనిలో భాగంగానే స్మార్ట్ వాచ్‌ల క్రేజ్ భారీగా పెరుగుతోంది. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ స్మార్ట్‌వాచ్‌లు లేదా ఫిట్‌నెస్ వాచ్‌లను వినియోగిస్తున్నారు.


ఇలా చేతికి ధరించే ప్రొడక్ట్స్ కేవలం వాచ్‌లకే పరిమితం కాలేదు. ఇప్పుడు స్మార్ట్ రింగులు కూడా ఈ సెగ్మెంట్‌లో స్థానాన్ని సంపాదించుకున్నాయి. స్మార్ట్ రింగ్ వైపు యూజర్ల మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ శాంసంగ్ కూడా రింగ్ లాంచ్ చేసింది. సామ్‌సంగ్ తన అన్‌ప్యాక్డ్ 2024 ఈవెంట్‌లో స్మార్ట్ రింగ్‌ను పరిచయం చేసింది.

Also Read: కొత్త కలర్.. వన్‌ప్లస్ అదిరింది.. కెమెరా, ఫీచర్లు సూపర్!


ఈ ఈవెంట్‌లో రింగ్‌లు మాత్రమే కాకుండా, వాచ్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు, బడ్స్‌తో సహా ఇతర డివైజ్‌లను కూడా కంపెనీ విడుదల చేసింది. అయితే సామ్‌సంగ్ తీసుకొచ్చిన కొత్త రింగ్ గురించి మాట్లాడితే.. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకునే లక్ష్యంతో ఈ స్మార్ట్ రింగ్‌ను డెవలప్ చేశారు. ఇది మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడంతో పాటు మిమ్మల్ని ఫిట్‌గా ఉంచుకోవడంలో ఈ రింగ్ సహాయపడుతుంది. దీని గురించి వివరంగా తెలుసుకుందాం.

అన్‌ప్యాక్డ్ 2024 ఈవెంట్ సందర్భంగా స్మార్ట్ రింగ్ పరిచయం చేసింది. దీని ధర 399 డాలర్లు అంటే దాదాపు 34 వేల రూపాయలు. ఈ డివైస్ సెలెక్టె చేసిన మార్కెట్‌లలో జూలై 10, 2024 నుండి ప్రీ-ఆర్డర్ కోసం అందుబాటులో ఉంటుంది. అయితే స్మార్ట్ రింగ్ జూలై 24, 2024 నుండి కొనుగోలు చేయవచ్చు. టైటానియం బ్లాక్, టైటానియం సిల్వర్, టైటానియం గోల్డ్ కలర్ వంటి మూడు కలర్స్‌లో దక్కించుకోవచ్చు.

సామ్‌సంగ్ రింగ్ స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే ఇది మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి ప్రత్యేకంగా రూపొందించారు. ఈ రింగ్‌ని సామ‌సంగ్ హెల్త్ యాప్‌కి కనెక్ట్ చేయడం ద్వారా మీరు మీ ఆరోగ్యాన్ని మానిటర్ చేయవచ్చు. మీరు మీ హార్ట్ బీట్ మీ నిద్ర అలవాట్లను చెక్ చేయాలన్నా లేదా మీ BP మొదలైనవాటిని తనిఖీ చేయాలనుకుంటే, మీరు ఈ రింగ్‌తో చేయవచ్చు. టైటానియంతో చేసిన ఈ రింగ్ వాటర్‌లో కూడా చెక్కుచెదరకుండా ఉంటుంది.

ఈ 2.3-3.0 గ్రాముల స్మార్ట్ రింగ్‌లో బాడీ టెంపరేచర్ సెన్సార్ ఉంది. దీన్ని ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 7 రోజుల పాటు ఉపయోగించవచ్చు. స్మార్ట్ రింగ్  మీ ఆరోగ్య రిపోర్ట్ సిద్ధం చేయడానికి AI టెక్నాలజీని కూడా ఈ రింగ్‌లో అందుబాటులో ఉంది. మీరు శారీరకంగా, మానసికంగా ఎంత ఆరోగ్యంగా ఉన్నారో లేదో తెలుసుకోవచ్చు.  రోజంతా మీరు చేసే యాక్టివీటీస్ ఆధారంగా మీరు ఎంత ఫిట్‌గా ఉన్నారో రింగ్ నిర్ణయిస్తుంది.

Also Read: మరో బడ్జెట్ ఫోన్.. రూ.14 వేలకే 108 MP కెమెరా, బిగ్ బ్యాటరీ.. టెక్నో స్పార్క్ 20 ప్రో!

అలానే ఈ స్మార్ట్ రింగ్‌లో మీరు కాల్స్ ఫీచర్లును చూడొచ్చు. అలారం ఆఫ్ చేయడం వరకు అనేక ఫీచర్‌లు ఉంటాయి. రింగ్ ఎక్కడ పోయినా, ఫైండ్ మై రింగ్ వంటి ఫీచర్‌తో మీరు దాన్ని ఐడెంటిఫై చేయవచ్చు. ఇది మాత్రమే కాదు మీరు రింగ్ ద్వారా మీ సామ్‌సంగ్ గెలాక్సీ ఫోన్‌ని కూడా కంట్రోల్ చేయవచ్చు. ఇతర కంపెనీల స్మార్ట్ రింగ్‌లు రూ. 5000 ప్రారంభ ధరతో ఇప్పటికే మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి.

Tags

Related News

OnePlus 24GB RAM Discount: వన్ ప్లస్ 24GB RAM ఫోన్‌పై భారీ తగ్గింపు.. రూ.33000 వరకు డిస్కౌంట్

Youtube Ad free: యూట్యూబ్‌లో యాడ్స్ తో విసిగిపోయారా?.. ఈ సింపుల్ ట్రిక్ తో ఉచితంగా యాడ్స్ బ్లాక్ చేయండి

iPhone 16 vs Pixel 10: రెండూ కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లు.. ఏది బెస్ట్?

itel ZENO 20: రూ.5999కే స్మార్ట్ ఫోన్.. 5,000mAh భారీ బ్యాటరీతో ఐటెల్ జెనో 20 లాంచ్

New Realme Smartphone: మార్కెట్లో ఎప్పుడూ లేని బ్యాటరీ పవర్! రాబోతున్న రియల్‌మీ బిగ్ సర్‌ప్రైజ్

Google Pixel 10 Pro Fold vs Galaxy Z Fold 7: ఏ ప్రీమియం ఫోల్డబుల్ ఫోన్ లో ఏది బెటర్?

Big Stories

×