EPAPER

Champions Trophy 2025| ఇండియా vs పాకిస్తాన్ మ్యాచ్ కష్టమే!.. దుబాయ్ లేదా శ్రీలంకలో ఆడే అవకాశం

Champions Trophy 2025| ఇండియా vs పాకిస్తాన్ మ్యాచ్ కష్టమే!.. దుబాయ్ లేదా శ్రీలంకలో ఆడే అవకాశం

Champions Trophy 2025 updates(Cricket news today telugu): పాకిస్తాన్ లో రాబోయే సంవత్సరం లో జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సిరీస్ కోసం భారత క్రికెట్ జట్టు వెళ్లే అవకాశాలు కనబడడం లేదు. రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియా ఆడబోయే ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ లు పాకిస్తాన్ కు బదులుగా దుబాయ్ లేదా శ్రీలంకలో జరిగే అవకాశాలున్నాయి.


జాతీయ మీడియా కథనాల ప్రకారం.. ఇండియా క్రికెట్ బోర్డ్ బిసిసిఐ.. టీమిండియా ఆడబోయే మ్యాచ్ లన్నీ మరో దేశంలో నిర్వహించాలని అంతర్జాతీయ క్రికెట్ బోర్డుని కోరనుంది. ఛాంపియన్స్ ట్రోఫీ సిరీస్ ని 2023 ఆసియా కప్ లాగా హైబ్రిడ్ మాడల్ లో నిర్వహించాలని బిసిసిఐ ప్రతిపాదనుంచనుంది.

Also Read: Hardik Pandya | లోకం అంతా ఒకవైపు.. పాండ్యా ఒక్కడూ ఒకవైపు


ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో మొత్తం 8 జట్లు పాల్గొనగా.. మొత్తం 15 మ్యాచ్ లు ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 2024 మధ్య జరుగనున్నాయి. ఈ 15 మ్యాచ్ లను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు.. ఏడు లాహోర్‌లో , అయిదు రావల్ పిండిలో, మూడు కరాచీలో నిర్వహించనుంది. వీటిలో ఇండియా, పాకిస్తాన్ మధ్య జరిగే హోరాహోరీ మ్యాచ్ మార్చి 1న లాహోర్ లో షెడ్యూల్ చేశారు.

కానీ టీమిండియా 2008 తరువాత నుంచి పాకిస్తాన్ లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. గత 16 ఏళ్లలో రెండు దేశాల మధ్య 2012-13లో ఒక సిరీస్ మాత్రమే జరిగింది. పైగా పాకిస్తాన్ లో జరిగిన 2023లో ఆసియా కప్ సిరీస్ కు కూడా ఇండియా జట్టు వెళ్లలేదు. ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ కూడా శ్రీలంకలోనే జరిగింది. ఇండియా, పాకిస్తాన్ మధ్య బార్డర్ వివాదంతో తలెత్తిన శత్రుత్వమే దీనికి కారణం.

Also Read: టీమిండియా హెడ్ కోచ్ సాలరీ ఎంతో తెలుసా?.. రాహుల్ ద్రవిడ్, రవిశాస్త్రితో సమానంగా గౌతమ్ గంభీర్

టీమిండియా పాకిస్తాన్ వెళ్లకపోయినా.. పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఇండియాలో జరిగిన 2023 వన్ డే ప్రపంచ్ కప్ లో పాల్గొనింది. వన్డే ప్రపంచ కప్ లో భాగంగా హైదరాబాద్, అహ్మదాబాద్, చెన్నై, బెంగళూరు, కోల్ కతా జరిగిన మ్యాచ్ లలో పాకిస్తాన్ ఆడింది.

ఈ నేపథ్యంలో టీమిండియా.. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాకిస్తాన్ వెళ్లాలో.. లేదో? భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది.

Related News

IND VS NZ: న్యూజిలాండ్ ను చిత్తు చేసిన టీమిండియా

Washington Sundar: 7 వికెట్లతో దుమ్ములేపిన వాషింగ్టన్ సుందర్..కుప్పకూలిన న్యూజిలాండ్ !

IND VS NZ: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్..3 మార్పులతో టీమిండియా !

IND VS NZ: నేటి నుంచే రెండో టెస్ట్..జట్ల వివరాలు, పిచ్ కాండీషన్స్ ఇవే !

Zimbabwe: టీ20ల్లో జింబాబ్వే ప్రపంచ రికార్డ్.. 20 ఓవర్లలో 344 పరుగులు

HCA: HCA ఎన్నికలు, వివాదాలపై సుప్రీంకోర్టు కీలక ప్రకటన !

IPL 2025: కేఎల్‌ రాహుల్‌ ఔట్‌..ఆ బౌలర్‌కు రూ.14 కోట్లు..లక్నో రిటైన్షన్‌ లిస్ట్‌ ఇదే !

Big Stories

×