BigTV English

Tecno Spark 20 Pro 5G: మరో బడ్జెట్ ఫోన్.. రూ.14 వేలకే 108 MP కెమెరా, బిగ్ బ్యాటరీ.. టెక్నో స్పార్క్ 20 ప్రో!

Tecno Spark 20 Pro 5G: మరో బడ్జెట్ ఫోన్.. రూ.14 వేలకే 108 MP కెమెరా, బిగ్ బ్యాటరీ.. టెక్నో స్పార్క్ 20 ప్రో!

Tecno Spark 20 Pro 5G: దేశంలో బడ్జెట్ మార్కెట్‌కు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఈ సెగ్మెంట్ తన స్థానాన్ని నిలుపుకునేందుకు అనేక కంపెనీలో పోటీపడుతున్నాయి. అంతే కాకుండా కొత్త కొత్త కంపెనీలు ఎంట్రీ ఇస్తున్నాయి. ఈ క్రమంలోనే స్మార్ట్‌ఫోన్ మేకర్ టెక్నో తన స్పార్క్ సిరీస్‌లో కొత్త బడ్జెట్ ఫోన్‌ను భారతదేశంలో విడుదల చేసింది. టెక్నో స్పార్క్ 20 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌లో డైమెన్షన్ 6080 ప్రాసెసర్, 108MP ప్రైమరీ రియర్ కెమెరా, 5000mAh బ్యాటరీ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ కొత్త Tecno స్మార్ట్‌ఫోన్‌లో ప్రత్యేకత ఏమిటి? ధర, ఫీచర్ల గురించి వివరంగా తెలుసుకుందాం.


టెక్నో స్పార్క్ 20 ప్రో 5G  8 GB RAM+128 GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర 15,999 రూపాయలు. అయితే ఫోన్ 8 GB RAM+ 256 GB స్టోరేజ్ వేరియంట్ రూ.16,999కి అందుబాటులోకి వచ్చింది. ఈ డివైస్ సేల్ జూలై 11 నుంచి అమెజాన్ ఇండియాలో ప్రారంభమవుతుంది. కంపెనీ స్మార్ట్‌ఫోన్‌ను క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, UPI చెల్లింపుల ద్వారా లిమిటెడ్ ఆఫర్ కింద రూ. 2000 అదనపు క్యాష్‌బ్యాక్‌తో అందిస్తోంది.

Also Read: Google Pixel 8 Price Cut: రూ.17 వేల డిస్కౌంట్.. ప్రీమియం స్మార్ట్‌ఫోన్.. ఛాన్స్ మిస్ చేసుకోవద్దు!


టెక్నో Spark 20 ప్రో 5G అనేది కంపెనీ మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్. దీని బ్యాక్ పెద్ద కెమెరా మాడ్యూల్ ఉంది. ఫోన్ స్టార్‌ట్రైల్ బ్యాక్, గ్లోసీ వైట్ కలర్‌లో వస్తుంది. హ్యాండ్‌సెట్‌లో 6.78 అంగుళాల IPS LCD డిస్‌ప్లే ఉంది. స్క్రీన్ FullHD+ (2460×1080 పిక్సెల్స్) రిజల్యూషన్‌తో 120 Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఫోన్‌లో MediaTek Dimension 6080 ప్రాసెసర్ ఉంది. Mali-G57 MC2 గ్రాఫిక్స్ కోసం అందుబాటులో ఉంది.

స్మార్ట్‌ఫోన్ Android 14 ఆధారిత HiOS 14 పై రన్ అవుతుంది. ఇందులో 5000mAh బ్యాటరీ ఉంటుంది.  ఇది 33W ఫాస్ట్ వైర్డ్‌, 10W రివర్స్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఫోటోగ్రఫీ కోసం 108 మెగాపిక్సెల్ ప్రైమరీ ఎపర్చరు F/1.8, 2 మెగాపిక్సెల్ డెప్త్‌తో పాటు ఎపర్చరు F/2.4, యాక్సిలరీ లెన్స్ ఉన్నాయి. ఫోన్ 30fps వద్ద 1440 పిక్సెల్‌ల వరకు వీడియో రికార్డింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది.

Also Read: Realme GT6 Launched: కొత్త ఫోన్ వస్తోంది.. 50MP కెమెరా, 120W ఫాస్ట్ ఛార్జింగ్.. రియల్‌మీ న్యూ స్మార్ట్‌ఫోన్!

సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ఫోన్‌లో 8-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది.కనెక్టివిటీ కోసం టెక్నో స్పార్క్ 20 ప్రో 5Gలో డ్యూయల్ సిమ్, 5G, 4G LTE, Wi-Fi 5, బ్లూటూత్ 5.3, GPS, FM రేడియో వంటి ఫీచర్లు ఉన్నాయి. బరువు 201 గ్రాములు. ఈ టెక్నో ఫోన్‌లో IP53 డస్ట్, వాటర్ రెసిస్టెంట్ రేటింగ్, డాల్బీ అట్మాస్, ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో కూడిన స్టీరియో స్పీకర్లు ఉన్నాయి.

Related News

Prostate Cancer: వైద్యరంగంలో ఏఐ విప్లవం.. క్యాన్సర్ నిర్థారణలో మరో ముందడుగు

OnePlus 24GB RAM Discount: వన్ ప్లస్ 24GB RAM ఫోన్‌పై భారీ తగ్గింపు.. రూ.33000 వరకు డిస్కౌంట్

Youtube Ad free: యూట్యూబ్‌లో యాడ్స్ తో విసిగిపోయారా?.. ఈ సింపుల్ ట్రిక్ తో ఉచితంగా యాడ్స్ బ్లాక్ చేయండి

iPhone 16 vs Pixel 10: రెండూ కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లు.. ఏది బెస్ట్?

itel ZENO 20: రూ.5999కే స్మార్ట్ ఫోన్.. 5,000mAh భారీ బ్యాటరీతో ఐటెల్ జెనో 20 లాంచ్

New Realme Smartphone: మార్కెట్లో ఎప్పుడూ లేని బ్యాటరీ పవర్! రాబోతున్న రియల్‌మీ బిగ్ సర్‌ప్రైజ్

Big Stories

×