Samsung Z Fold 7 Series : లేటెస్ట్ మొబైల్స్ లో ఫ్లిప్ మొబైల్స్ కు ఉండే డిమాండే వేరు. అందుకే టాప్ స్మార్ట్ ఫోన్ కంపెనీలన్నీ లేటెస్ట్ ఫీచర్స్ తో అదిరే ఫ్లిప్ మొబైల్స్ ను తీసుకొచ్చేస్తున్నాయి. ఇప్పటికే సామ్సాంగ్ ఫ్లిప్ మొబైల్స్ ను లాంఛ్ చేసి యూజర్స్ ను ఆకట్టుకుంది. ఆపిల్ సైతం వచ్చే ఏడాది ఫ్లిప్ మొబైల్ ను తీసుకురాబోతుందని రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఇప్పుడు శాంసంగ్ నుంచి మరో రెండు ఫ్లిప్ మొబైల్స్ రాబోతున్నట్టు సమాచారం. ఈ మొబైల్స్ జులైలో జరగబోతున్న సామ్సంగ్ ఈవెంట్ లో లాంచ్ కాబోతున్నాయని తెలుస్తుంది. మరి ఈ మొబైల్ ఫీచర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం
సామ్‌సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 7 (Z Fold 7) , జెడ్ ఫ్లిప్ 7 (Z Flip 7) ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్స్ ఈ ఏడాది లాంఛ్ కాబోతున్నాయని సమాచారం. ఈ మెుబైల్స్ ఫీచర్స్ అదిరేలా ఉన్నాయి. కెమెరా, డిస్ ప్లే, బ్యాటరీ, ప్రాసెసర్ ఫీచర్స్ లేటెస్ట్ అప్ గ్రేడ్స్ తో రాబోతున్నాయి. ఇక ఈ మెుబైల్ ఫీచర్స్ పై మీరూ ఓ లుక్కేసేయండి.
1. Samsung Galaxy Z Fold 7 –
జెడ్ ఫోల్డ్ 7 మెుబైల్ 7.6 అంగుళాల డిస్‌ప్లేతో, 120Hz రిఫ్రెష్ రేట్ AMOLED డిస్ ప్లే తో రాబోతుంది. 6.2 అంగుళాల కవర్ డిస్‌ప్లే కూడా ఉండనుంది. ఇది Qualcomm Snapdragon 8 Gen 3 లేదా Exynos 2400 ప్రాసెసర్‌తో పనిచేస్తుందని సమాచారం. 12GB లేదా 16GB RAM, 256GB నుండి 1TB స్టోరేజ్ వేరియంట్లు అందిస్తుంది. ఈ ఫోల్డ్ 7 కెమెరా 50MP ప్రధాన కెమెరా, 12MP అల్ట్రా వైడ్, 12MP టెలెఫోటో లెన్స్‌తో రాబోతున్నట్లు తెలుస్తుంది. ఫోల్డ్ 7 లో 4,400mAh బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్, వైర్‌లెస్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు ఉండనున్నాయి. Android 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో One UI 6 ఇంటర్ఫేస్ తో రాబోతుంది.
2. Samsung Galaxy Z Flip 7 –
జెడ్ ఫ్లిప్ 7 మెుబైల్ 6.7 అంగుళాల Dynamic AMOLED 120Hz డిస్ ప్లే కలిగి ఉంది. 3.4 అంగుళాల కవర్ డిస్‌ప్లేతో రాబోతుంది. జెడ్ ఫ్లిప్ 7 లో Snapdragon 8 Gen 3 లేదా Exynos 2400 ప్రాసెసర్, 8GB లేదా 12GB RAM, 128GB నుండి 512GB స్టోరేజ్ వేరియంట్లు ఉండనున్నట్లు తెలుస్తుంది. ఈ డివైజ్ లో 50MP ప్రధాన కెమెరా, 12MP అల్ట్రా వైడ్ కెమెరాతో రేర్ కెమెరా సెటప్ ఉండనుంది. 3700mAh బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్, వైర్‌లెస్ ఛార్జింగ్ మద్దతు అందిస్తుంది. ఫోల్డబుల్ డిజైన్‌లో ఇది పోర్టబుల్, స్టైలిష్ ఫీచర్స్ ఉండనున్నట్లు తెలుస్తుంది.
ఈ రెండు ఫోల్డబుల్ ఫోన్లు Android 14 ఆధారిత One UI 6 తో పనిచేస్తాయి. ఇవి మంచి ఫోల్డింగ్ మెకానిజం, మెరుగైన బ్యాటరీ లైఫ్, ఐఫోన్‌లతో పోటీపడే అధునాతన కెమెరా ఫీచర్లతో రాబోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికీ సామ్సాంగ్ ఈ మెుబైల్స్ లాంచ్ డేట్‌లను అధికారికంగా ప్రకటించబడలేదు. కానీ సామ్‌సంగ్ సాధారణంగా ఈ మోడళ్లను ఆగస్టు, సెప్టెంబర్ మధ్యలో తీసుకువచ్చే అవకాశం కనిపిస్తుంది.
ALSO READ : Vivo V50 నుంచి iQOO Neo 10R వరకూ.. ఈ నెలలో రాబోతున్న మెుబైల్స్ ఇవే!