Thandel Pre Release Event: నాగచైతన్య హీరోగా తెరకెక్కిన ‘తండేల్’ మూవీని ప్రమోట్ చేయడానికి మేకర్స్ అంతా ప్రాణం పెడుతున్నారు. చైతూ కెరీర్‌లో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిన ఈ మూవీని చందు మోండేటి డైరెక్ట్ చేశాడు. బన్నీ వాసు ఈ మూవీని భారీ బడ్జెట్‌తో నిర్మించాడు. అందుకే ఈ సినిమాను మరింత ప్రమోట్ చేయడం కోసం ఏకంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను రంగంలోకి దించాలనుకున్నారు నిర్మాతలు. ‘పుష్ప 2’ తర్వాత, ఆ మూవీ ప్రీమియర్ షోలో జరిగిన ఘటన తర్వాత అల్లు అర్జున్ వేరే సినిమా ఈవెంట్లకు రావడం పూర్తిగా మానేశాడు. అందుకే ‘తండేల్’కు రావడం వల్ల తన సినిమాకు కూడా ప్లస్ అవుతుందని చాలా ఆశలు పెట్టుకున్నాడు నాగచైతన్య.
బయటికి వస్తాడనుకున్నారు
‘తండేల్’ కోసం, అందులో రాజు పాత్ర కోసం నాగచైతన్య చాలా కష్టపడ్డాడని, మాట, భాష దగ్గర నుండి అప్పీయరెన్స్ వరకు అన్నింటిని మార్చుకున్నాడని మూవీ టీమ్ అంతా తనను తెగ ప్రశంసిస్తున్నారు. అందుకే తను ఇంత కష్టపడిన సినిమాను ఎలాగైనా ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లాలని మొదటి నుండి ప్రతీ ప్రమోషన్‌లో పాల్గొన్నాడు చైతూ. అలాగే తనకు మూవీ టీమ్ కూడా సపోర్ట్‌గా నిలబడింది. అలా తనకు అల్లు అర్జున్ కూడా తోడైతే ‘తండేల్’ ప్రమోషన్స్‌లో మరింత జోరు పెరిగేది. అసలైతే మేకర్స్ ప్లాన్ కూడా అదే. అందుకే దాదాపు నెలన్నర రోజులుగా బయటికి రాకుండా ఉన్న అల్లు అర్జున్‌ను ‘తండేల్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం బయటికి తీసుకురావాలని అనుకున్నాడు అల్లు అరవింద్.
షాక్‌లో ఫ్యాన్స్
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన సినిమానే ‘పుష్ప 2’. ఆ సినిమా కోసం ఇండియా మొత్తం ఎదురుచూసింది. అందుకే ఆ సినిమా ప్రీమియర్ షోలకు విపరీతమైన ఫ్యాన్స్ వచ్చారు. ఆ ఫ్యాన్స్‌తో కలిసి సినిమా చూద్దామని అల్లు అర్జున్ కూడా ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌కు చేరుకున్నాడు. అదే సమయంలో ఫ్యాన్స్ మధ్య ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ కూడా మృతిచెందింది. అల్లు అర్జున్ రావడం వల్ల రేవతి మృతి చెందిందని తన చుట్టూ ఉచ్చు బిగుసుకుంది. దాని తర్వాత తన అరెస్ట్, జైలు, కోర్టు.. ఇలా చాలా జరిగాయి. అందుకే అప్పటినుండి అల్లు అర్జున్ ఫ్యాన్స్ ముందుకు రాలేదు. అలాంటిది ‘తండేల్’ ఈవెంట్‌కు రావడానికి ఒప్పుకున్నాడంటే ఫ్యాన్స్ అంతా షాకయ్యారు.
Also Read: ఇంట్లో శోభితాను అలాగే పిలుస్తాను, తను చాలా ఫీలయ్యింది.. బయటపెట్టిన నాగచైతన్య
పెద్ద దెబ్బే
నాగచైతన్య (Naga Chaitanya) కోసమో, అల్లు అరవింద్ కోసమో లేక బన్నీ వాసు కోసమో తెలియదు కానీ అల్లు అర్జున్ (Allu Arjun) మాత్రం ‘తండేల్’ (Thandel) ఈవెంట్ రావడానికి ఒప్పుకున్నాడు. దానికి సంబంధించిన తండేల్ రాజు కోసం పుష్ప రాజు ఈ ఈవెంట్‌కు వస్తున్నాడు అంటూ పోస్టర్ కూడా విడుదల చేశారు మేకర్స్. ఫిబ్రవరి 2న జరిగే ఈ ఈవెంట్‌కు బన్నీ వస్తాడని ఫ్యాన్స్‌తో పాటు నాగచైతన్య కూడా ఆశలు పెట్టుకున్నాడు. మొత్తానికి అల్లు అర్జున్ రాకతో ‘తండేల్’కు సరిపడా ప్రమోషన్స్ దొరుకుతాయని అనుకున్న చైతూ ఆశలపై బన్నీ పెద్ద దెబ్బేవేశాడని ప్రేక్షకులు అనుకుంటున్నారు.