Cyber Frauds: గత కొంతకాలంగా దేశంలో సైబర్ మోసాలు విపరీతంగా పెరగిపోతున్నాయి. స్కామర్లు రకరకాల పద్దతుల్లో అమాయకుల నుంచి అందినకాడికి డబ్బులు దండుకుంటున్నారు. బ్యాంకు కేవైసీ మెసేజ్ లు, బంఫర్ ప్రైజ్ విన్నింగ్ మెసేజ్ లు, డిజిటల్ అరెస్టులు అంటూ సామాన్యుల నుంచి భారీ మొత్తంలో డబ్బును కాజేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పౌరులను అలర్ట్ చేసింది. గుర్తు తెలియని నెంబర్ల నుంచి కాల్స్, మెసేజెస్ వస్తే రెస్పాండ్ కావద్దని అధికారులు వెల్లడించారు. ఫేక్ జాబ్ ఆఫర్లు, లాటరీ మనీ, స్పెషల్ కూపన్ గిఫ్టులు అంటూ ఎవరు కాల్స్ చేసినా నమ్మకూడదన్నారు.
గత కొంతకాలంగా ఇంటర్నేషనల్ కాల్స్ తో మోసాలు
గత కొంతకాలంగా స్కామర్లు ఇంటర్నేషనల్ కాల్స్ తో మోసాలకు పాల్పడుతున్నారు. అయితే, ఈ స్కామర్లంతా ఇండియాలోనే ఉంటూ ఇంటర్నేషన్ నెంబర్స్ ద్వారా కాల్స్ చేస్తారు. అయితే, ఫోన్ నెంబర్ ముందు +91 అనేది ఇండియన్ కోడ్. మనకు దేశ వ్యాప్తంగా ఎక్కడి నుంచి కాల్ చేసిన +91 అని వస్తుంది. అలా కాకుండా ఇతర కోడ్ తో వచ్చే నెంబర్లతో కాస్త జాగ్రత్తగా ఉండాలి. +92 (పాకిస్తాన్), +84 (వియత్నాం), +62 (ఇండోనేషియా), +1 (అమెరికా), +98 (ఇరాన్) సహా ఇతర కోడ్ నెంబర్లతో వచ్చే కాల్స్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ రిసీవ్ చేసుకోకూడదంటున్నారు సైబర్ నిపుణులు.
Read Also: వాట్సాప్ కాల్ తో లొకేషన్ ట్రేస్.. సేఫ్ గా ఉండాలంటే ఆ సెట్టింగ్ మార్చాల్సిందే
ఫేక్ కాల్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే?
⦿ ఇంటర్నేషనల్ నెంబర్ నుంచి కాల్ వస్తే అప్రమత్తంగా ఉండాలి. ఎట్టిపరిస్థితుల్లోనూ లిఫ్ట్ చేయాలి. కాల్ కట్ కాగానే నెంబర్ ను బ్లాక్ చేయడం ఉత్తమం.
⦿ ఒకవేళ కాల్ రిసీవ్ చేసుకున్నా, మీకు ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ లాంటి వివరాలను ఎదుటి వ్యక్తులకు చెప్పకూడదు.
⦿ వాట్సాప్, టెలిగ్రామ్, ఫేస్ బుక్ ద్వారా కాల్స్ చేసినా రియాక్ట్ కాకపోవడం మంచిది.
⦿ గుర్తు తెలియని వాట్సాప్ గ్రూపులలో ఉండకూడదు.
⦿ గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే జాబ్ ఆఫర్లు, పెట్టుబడి ఆఫర్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ అట్రాక్ట్ కాకూడదు.
⦿ ఒకవేళ మీరు స్కామర్లు చెప్పిన మాటలు నమ్మి డబ్బులు పోగొట్టుకుంటే వెంటనే 1930 హెల్ప్ లైన్ నెంబర్ కు కాల్ చేసి విషయం చెప్పాలి.
⦿ మీరు డబ్బులు కోల్పోయినట్లు ఆధారాలు అందజేయాలి.
⦿ వెంటనే మీ అకౌంట్స్ నుంచి ఏ అకౌంట్ కు డబ్బులు వెళ్లాయో ఆ అకౌంట్లను ఫ్రీజ్ చేస్తారు.
⦿ ఆ తర్వాత విచారణ జరిపి డబ్బులు మనకు వచ్చేలా చేస్తారు.
వీలైనంత వరకు గుర్తు తెలియని కాల్స్ కు స్పందించకపోవడమే మంచిదని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. అనవసరంగా తెలియని కాల్స్ అటెంట్ చేసి ఇబ్బందులకు గురి కాకూడదంటున్నారు. ఒకవేళ గుర్తు తెలియని వ్యక్తులు కాల్ చేసి మీద ఆధార్, బ్యాంక్ వివరాలను అడిగినా వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పకూడదంటున్నారు. వెంటనే అలాంటి కాల్స్ ను బ్లాక్ చేయాలంటున్నారు.
Read Also:మీ ఖాతాలోకి పొరపాటు డబ్బులు పంపామని ఫోన్ చేస్తారు.. ఆపై!