Abhijeet Bhattacharya: సాధారణంగా ఇండస్ట్రీలో పైకి కనిపించేవి నిజాలు కావు. చాలామంది సెలబ్రిటీలకు పొగరు ఉండదు.. అహంకారం ఉండదు. పంక్చువాలిటీ ఉంటారు.. ఎవరైనా వస్తే వెయిట్ చేయించరు అని చెప్తారు కానీ, లోపాలు జరిగేది వేరు ఉంటుంది. ఇలాంటివి వేరే సెలబ్రిటీల ద్వారా తెలిస్తే.. అవునా.. నిజమా .. ? అని షాక్ అవుతూ ఉంటాం. తాజాగా ఒక సింగర్.. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ కు టైమ్ సెన్స్ లేదని, తనను రెండు రోజుల వరకు వవెయిట్ చేయించాడని ఒక ఇంటర్వ్యూలో వాపోయాడు. అతను ఎవరు కాదు.. బాలీవుడ్ స్టార్ సింగర్ అభిజీత్ భట్టాచార్య.
1982 లో సింగర్ గా కెరీర్ మొదలుపెట్టిన అభిజీత్ స్టార్ సింగర్ గా కొనసాగుతూ వస్తున్నాడు. ఆయన కెరీర్ లో ఎంతోమంది మ్యూజిక్ డైరెక్టర్స్ వద్ద పనిచేశాడు. ఎన్నోవేల హిట్ ఆల్బమ్స్ లో తన అద్భుతమైన గొంతును వినిపించిన ఆయనకు వాయిస్ ఆఫ్ SRK, కింగ్ ఆఫ్ మెలోడీ, బాద్‌షా ఆఫ్ 1990 అనే బిరుదులు ఉన్నాయి. ఇక అలాంటి ఈ సింగర్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఏఆర్ రెహమాన్ గురించి మాట్లాడాడు.
Sankranthiki Vasthunam Trailer: వింటేజ్ వెంకీ మామ ఈజ్ బ్యాక్.. ట్రైలర్ అదిరిపోయింది
ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్ గా చేసిన సినిమాల్లో దిల్ హాయ్ దిల్ మే ఒకటి. ఈ సినిమానే తెలుగులో ప్రేమికుల రోజు అనే పేరుతో రిలీజ్ చేశారు. కునాల్ సింగ్, సోనాలి బింద్రే జంటగా నటించిన ఈ సినిమాలోని అన్ని సాంగ్స్ చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. ముఖ్యంగా ఈ సినిమాలో వాలు కనులదానా.. నీ విలువ చెప్పు మైనా అనే సాంగ్ ఇప్పటికీ ఎక్కడోచోట వినిపిస్తూనే ఉంటుంది. ఈ సాంగ్ ను హిందీలో ఆలపించింది అభిజీత్ నే. ఈ సాంగ్ తరువాత ఆయన ఏఆర్ రెహమాన్ డైరెక్షన్ లో ఇప్పటివరకు ఒక్క సాంగ్ ను కూడా పడలేదు. అందుకు కారణం అభిజీత్ చెప్పుకొచ్చాడు.
“నా కెరీర్ అప్పుడప్పుడే ఊపు అందుకుంటుంది. ఆ సమయంలోనే వాలు కనులదానా.. నీ విలువ చెప్పు మైనా సాంగ్ హిందీ వెర్షన్ కోసం నన్ను పిలిచారు. చెప్పిన సమయానికి రావాలని చెప్పారు. నేను కూడా చాలా టైమ్ పాటించే మనిషిని. వారు చెప్పిన సమయానికే షూటింగ్ కు వెళ్లాను. రెహమాన్ తో మాట్లాడడానికి నన్ను గంటలకొద్దీ వెయిట్ చేయించారు. ఆ తరువాత ఆయన వెళ్లిపోయారని చెప్పారు. అదేంటి నేను వెయిట్ చేస్తున్నాను.. రికార్డింగ్ అని చెప్పారు కదా అని అడిగితే సరైన రెస్పాన్స్ రాలేదు.
Anchor Syamala: పవన్ కళ్యాణ్ నీతులే చెప్తాడు.. మళ్లీ కెలికిన యాంకర్ శ్యామల
రేపు రికార్డింగ్ ఉంటుందని చెప్పి హోటల్ కు పంపించారు. సర్లే అని నేను రెస్ట్ తీసుకోవడానికి పడుకున్నాను. అర్ధరాత్రి రెండు గంటలకు కాల్ చేసి రికార్డింగ్ కు రమ్మన్నారు. ఇప్పుడు టైమ్ ఎంత.. ? ఇప్పుడు రికార్డింగ్ ఏంటి అని అడిగాను. ఇప్పుడు రాలేను.. తెల్లారక వస్తాను అని చెప్పాను. తీరా స్టూడియోకు వెళ్తే అక్కడ రెహమాన్ లేరు. అతని అసిస్టెంట్ ఉన్నాడు. వాళ్లకు ఒక పద్దతి లేదు. టైమ్ సెన్స్ అస్సలు లేదు. నేను పద్దతి ప్రకారం నడుచుకునే మనిషిని.
క్రియేటివిటీ పేరు చెప్పి.. అర్ధరాత్రి పాడించడం ఏంటో నాకర్థం కాలేదు. తరువాతి రోజు నాకు జలుబు చేసి గొంతు రాలేదు. అదే చెప్పి పాడలేను.. సమయం కావాలని అన్నాను. దానికి వాళ్లు ఒప్పుకోకుండా పాడాలి అని చెప్పి బలవంతం చేశారు. సరే అని ఎలాగోలా పాట పూర్తిచేసి రెహమాన్ గురించి అడిగితే జవాబు లేదు. అలా ఆయనను కలవకుండానే అక్కడనుంచి బయటకు వచ్చాను. సినిమా హిట్ కాకపోయినా ఆ సాంగ్ మంచి గుర్తింపు అందుకుంది. ఆ క్రెడిట్ మొత్తం రెహమాన్ కు వచ్చింది. ఎన్నోసార్లు ఆయనను కలవాలని అనుకున్నాను. కానీ, అటునుంచి సరైన స్పందన లేదు. మనుషులను వెయిట్ చేయించినంత మాత్రాన గొప్పవాళ్లు అయిపోరు” అంటూ అభిజీత్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.