Humanity dies: ప్రస్తుత రోజుల్లో మానవత్వం అనేది లేకుండా పోతుంది. కళ్ల ముందు మనిషి చచ్చిపోతున్నా.. పట్టించుకోకుండా వెళ్లిపోతున్నారు. దేశంలో ఇటీవల కాలంలో దారుణ సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. మాములుగా ఎవరైనా రోడ్డు ప్రమాదంలో చనిపోతే.. పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పరిశీలిస్తున్నారు. కానీ మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ సరిహద్దుల్లో హృదయ విధాకర ఘటన చోటుచేసుకుంది.
యూపీ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దులో ఆదివారం రాత్రి ఓ యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. అయితే యువకుడు డెడ్ బాడీని రోడ్డుపై ఉంచి రెండు రాష్ట్రాల పోలీసులు తమ పరిధిలోకి రాదంటూ తిరిగి వెళ్లిపోయిన ఘటన అందర్నీ కలిచివేస్తోంది. ఇరు రాష్ట్రాల పోలీస్ అధికారులు బాధ్యతారాహిత్యం వల్ల యువకుడి డెడ్ బాడీ నాలుగు గంటలకు పైగా రోడ్డు పైనే ఉండిపోయింది. చివరగా అక్కడి గ్రామస్థులు ధర్నాకు దిగడంతో ఉన్నత అధికారులు ఎట్టకేలకు స్పందించారు.
అధికారులు వివరాల ప్రకారం.. రాహుల్ అహిర్వార్ (27) అనే యువకుడు ఉపాధి కోసం రాజధాని ఢిల్లీకి పయనమయ్యాడు. అయితే అతను వెళ్తున్న సమయంలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ప్రమాదానికి గురయ్యాడు. మధ్యప్రదేశ్‌లోని హర్పాల్‌పుర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో రోడ్డు దాటుతున్న ఆ యువకుడిని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. రోడ్డు ప్రమాదంలో రాహుల్ అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ఉత్తరప్రదేశ్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే సంఘటనా స్థలాన్ని పరిశీలించిన వారు ఇది తమ రాష్ట్ర పరిధి కాదని చెప్పి వెళ్లిపోయారు. తర్వాత వచ్చిన మధ్యప్రదేశ్ పోలీసులు యువకుడు చనిపోయిన ప్రాంతం ఉత్తరప్రదేశ్‌లోని మహోబ్‌కాంత్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందని బ్యాక్ వెళ్లిపోయారు. నిన్న రాత్రి 7 గంటలకు యాక్సిడెంట్ జరిగితే రాత్రి 11 గంటల వరకూ మృతదేహం రోడ్డుపైనే ఉంది. దీంతో అక్కడి స్థానికులు ఆందోళనకు దిగారు. పోలీసుల తీరుకు నిరసగా రోడ్డుపై ధర్నా చేశారు.
పోలీసులపై ఉన్నతాధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చివరకు 4 గంటల తర్వాత ఘటనా స్థలానికి వచ్చిన మధ్యప్రదేశ్ పోలీసులు వచ్చారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.
Stenographer Jobs: రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో మేనేజర్ ఉద్యోగాలు..
రాహుల్ అహిర్వార్ మృతిపై ఆయన తల్లిదండ్రులు మాట్లాడారు. తమ కుమారిడికి ఇటీవలే పెళ్లి అయిందని.. ఇంతలోనే ఇలా జరగిందని వాపోయారు. కుమారిడి పోగుట్టుకుని పుట్టెడు దు:ఖంలో ఉంటే.. పోలీసులు ప్రవర్తన తీరు మాత్రం తమకు తీవ్ర ఆవేదనకు గురిచేసిందని అన్నారు. తన కొడుకు చావుకు కారణమైన వారిని గుర్తించి.. కఠిన శిక్ష వేయాలని ఉన్నతాధికారులను కోరారు. రాహుల్ అహిర్వార్ చనిపోయిన ప్రాంతం మధ్యప్రదేశ్ రాష్ట్ర పరిధిలోకే.. వస్తుందని కానీ పోలీసులు ఎవరూ బాధ్యత తీసుకోవడానికి ముందుకు రాకపోవడంతో నాలుగు గంటలకు పైగా మృతదేహం రోడ్డుపైనే ఉండిపోయిందన్నారు. తన కొడుకు సంఘటనపై పోలీసులు ప్రవర్తించిన తీరు చాలా బాధకు గురిచేసిందని భావోద్వేగానికి గురయ్యారు.