E-Paper
Advertisement

కేవలం చూడటానికే కాదు.. మీ స్మార్ట్ టీవీతో ఈ అద్భుతమైన పనులు కూడా చేయొచ్చు!

కేవలం చూడటానికే కాదు.. మీ స్మార్ట్ టీవీతో ఈ అద్భుతమైన పనులు కూడా చేయొచ్చు!
Advertisement

Smart TV secret feature: ప్రస్తుతం ప్రతి ఇంటా స్మార్ట్ టీవీల హవా నడుస్తోంది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, యూట్యూబ్ చూడటానికి.. మాత్రమే వీటిని ఎక్కువగా ఉపయోగిస్తుంటాం. కానీ, గూగుల్ , ఆండ్రాయిడ్ లేటెస్ట్ అప్‌డేట్స్ ప్రకారం.. మీ స్మార్ట్ టీవీ కేవలం ఒక ఎంటర్‌టైన్‌మెంట్ స్క్రీన్ మాత్రమే కాదు, ఒక పవర్‌ ఫుల్ మల్టీ టాస్కింగ్ గ్యాడ్జెట్. చాలా మందికి తెలియని ఆ అద్భుతమైన రహస్య ఫీచర్లు దీనిలో.. ఉంటాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

టీవీ హిడెన్ ట్రిక్స్ :

1. మీ స్మార్ట్ టీవీనే పీసీ లేదా మానిటర్‌:

మీ దగ్గర ల్యాప్ టాప్ లేదా పీసీ లేకపోయినా టెన్షన్ పడాల్సిన పని లేదు. మీ స్మార్ట్ టీవీకి.. బ్లూ టూత్ కీ బోర్డ్, మౌస్ కనెక్ట్ చేస్తే చాలు.. అది పూర్తి స్థాయి కంప్యూటర్‌లా మారి పోతుంది. క్రోమ్ బ్రౌజర్ లేదా ఇతర క్లౌడ్ ప్లాట్‌ ఫారమ్‌ల ద్వారా మీరు ఆఫీస్ వర్క్ చేసుకోవచ్చు. ఆర్టికల్స్ చదివే అవకాశం కూడా ఉంటుంది. లేదా పిల్లల ఆన్‌లైన్ క్లాసులకు దీన్ని పెద్ద మానిటర్‌లా ఉపయోగించవచ్చు.

2. మొబైల్ స్క్రీన్ మిర్రరింగ్ అండ్ డ్యూయల్ వ్యూ:

Advertisement

ఫోటోలు లేదా వీడియోలను చిన్న ఫోన్ స్క్రీన్‌లో చూసి విసిగిపోయారా? మీ స్మార్ట్ టీవీలోని ‘క్యాస్ట్’ లేదా ‘మిరాకాస్ట్’ ఫీచర్‌తో క్షణాల్లో మొబైల్ స్క్రీన్‌ను టీవీకి కనెక్ట్ చేయవచ్చు. అంతేకాకుండా.. గూగుల్ లేటెస్ట్ అప్‌డేట్స్ ద్వారా కొన్ని టీవీలలో ‘డ్యూయల్ వ్యూ’ ఆప్షన్ వస్తోంది. దీని వల్ల ఒకవైపు టీవీలో సినిమా చూస్తూనే.. మరో వైపు ఫోన్ స్క్రీన్‌ను సైడ్ బై సైడ్ చూడొచ్చు.

3. వాయిస్ కంట్రోల్ & స్మార్ట్ హోమ్ ఆటోమేషన్ :

రిమోట్ తో టైప్ చేయడం చాలా ఇబ్బందిగా అనిపిస్తుందా? ఇప్పుడు ఆ అవసరమే లేదు. మీ స్మార్ట్ టీవీ రిమోట్‌లోని.. మైక్ బటన్ నొక్కి వాయిస్ కమాండ్ ఇస్తే చాలు.. మీరు కోరిన సినిమా లేదా యూ ట్యూబ్ వీడియో క్షణాల్లో ప్లే అవుతుంది. అంతేకాదు.. మీ ఇంట్లోని స్మార్ట్ లైట్స్, ఏసీ, ఫ్యాన్లను కూడా మీ స్మార్ట్ టీవీ గూగుల్ అసిస్టెంట్ ద్వారా కంట్రోల్ చేయొచ్చు.

Advertisement

Also Read: వంటింటి కోసం బెస్ట్ ఫ్రిజ్ ఏది? ఎల్జీ, శాంసంగ్ మోడల్స్ మధ్య తేడాలు!

4. గేమింగ్ జోన్ :

ప్లే స్టేషన్ లేదా ఎక్స్‌ బాక్స్ కన్సోల్ లేదని బాధపడుతున్నారా ? మీ స్మార్ట్ టీవీలో.. క్లౌడ్ గేమింగ్ యాప్స్ (ఉదాహరణకు ఎక్స్ బాక్స్ క్లౌడ్ గేమింగ్ లేదా ఎన్విడియా జెట్ ఫోర్స్) ద్వారా హై-ఎండ్ వీడియో గేమ్‌లను నేరుగా ఆడొచ్చు. బ్లూటూత్ గేమింగ్ కంట్రోలర్‌ను టీవీకి పెయిర్ చేస్తే.. సరి పోతుంది.

5. డిజిటల్ ఆర్ట్ గ్యాలరీ & యాంబియంట్ మోడ్:

టీవీ ఆఫ్ చేసినప్పుడు ఆ నల్లటి స్క్రీన్ చూడటానికి బాగోలేదనిపిస్తే.. మీ స్మార్ట్ టీవీలోని ‘యాంబియంట్ మోడ్’ లేదా ‘ఆర్ట్ మోడ్’ను యాక్టివేట్ చేయండి. ఇది మీ గదికి రాయల్ లుక్ ఇస్తుంది. ప్రపంచ ప్రఖ్యాత పెయింటింగ్స్, మీ ఫ్యామిలీ ఫోటోలను అందమైన వాల్‌ పేపర్‌లా మార్చుకోవచ్చు. ఇది తక్కువ పవర్ తీసుకుంటూ.. మీ లివింగ్ రూమ్‌ను ఒక ఆర్ట్ గ్యాలరీలా మారుస్తుంది.

Related News

రూ15,000 లోపే 6000mAh బ్యాటరీ, డ్యూయల్ స్క్రీన్.. హానర్ కొత్త ఫోన్ లాంచ్!

వాట్సప్‌లో కొత్త ప్రైవసీ ఫీచర్.. లింక్డ్ డివైజ్‌లలో ఇక ఆ చాట్స్ కనిపంచవు!

స్టూడెంట్స్‌కి గుడ్ న్యూస్.. ఫ్రీగా ఏడాది పాటు ఫోటోషాప్ సబ్‌స్క్రిప్షన్.. ఇలా క్లెయిమ్ చేసుకోండి!

ఇక సైబర్ నేరగాళ్ల పని గోవిందా.. కేంద్రం తెచ్చిన ఈ సూపర్ టూల్ గురించి తెలుసా?

జియో చౌకైన ప్లాన్ లాంచ్.. రూ.123కే 28 రోజుల వ్యాలిడిటీ.. డైలీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్!

డైమెన్సిటీ 7360 MAX ప్రాసెసర్‌తో ఒప్పో మాస్ ఎంట్రీ.. గేమింగ్ ప్రియులకు పూనకాలే!

స్కూల్ బ్యాగ్ కాదు.. బుల్లెట్ ప్రూఫ్ కవచం.. టర్కీ కంపెనీ వినూత్న ఆవిష్కరణ!

చూడగానే నచ్చేసే క్యూట్ డిజైన్.. బోస్ సౌండ్‌తో నాయిస్ మాస్టర్ బడ్స్ ఓపెన్, ఆఫర్ ధర ఎంతంటే?

Big Stories

Advertisement
×