E-Paper
Advertisement

డేటా సెంటర్ ఇష్యూ.. సీఎం చంద్రబాబు క్లారిటీ, నిర్మాణం కాకుండానే నీళ్లు ఇంకిపోయాయంటూ..

డేటా సెంటర్ ఇష్యూ.. సీఎం చంద్రబాబు క్లారిటీ,  నిర్మాణం కాకుండానే నీళ్లు ఇంకిపోయాయంటూ..
Advertisement

Anakapalli: డేటా సెంటర్ ఏంటో తెలీదని, దానివల్ల వచ్చే లాభాలు తెలీవన్నారు సీఎం చంద్రబాబు. వారికి కావాల్సింది కేవలం రాజకీయ మాత్రమేనని అన్నారు.ఎవరో చెబితే నమ్మాలా? ఇప్పటి వరకు డేటా సెంటర్ నిర్మాణం కాలేదన్నారు. నీళ్లు ఇంకిపోయాయని ప్రచారం చేయడాన్ని ఎద్దేశా చేశారు. తాగడానికి నీళ్లు లేవని అంటున్నారని, అది మాకు వద్దని అంటున్నారంటూ గుర్తుచేశారు.

 

అనకాపల్లి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన

Advertisement

గడిచిన నెల రోజులుగా ఉమ్మడి విశాఖ జిల్లాలో డేటా సెంటర్లు వద్దంటూ కొందరు వ్యక్తులు ప్రచారం చేస్తున్నారు. డేటా సెంటర్ల వల్ల తాగునీరు కలుషితమైపోతుందని కొందరు సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నారు. ఆ నీరు ఎందుకు పని చేయదని, దాని ప్రభావం ఆ చుట్టూ ఉన్న ప్రాంతాలపై పడుతుందని, పర్యావరణానికి హాని జరుగుతుందని ఊదరగొడుతున్నారు.

ఈ వ్యవహారం సీఎం చంద్రబాబు దృష్టికి వెళ్లడంతో దీనిపై నేరుగా స్పందించారు. ఇక్కడున్న యువతకు అవకాశం ఇస్తే.. ప్రపంచాన్ని శాసించే శక్తి మనవాళ్లకు ఉందన్నారు. అదే తన నమ్మకం అని అన్నారు. డేటా సెంటర్ తాను ఒకటి ప్రారంభిస్తే.. ఐదు సెంటర్లు వచ్చాయన్నారు. ఐదు గిగావాట్స్ సామర్థ్యం గల సెంటర్లు వస్తున్నట్లు చెప్పుకొచ్చారు. దీనివల్ల లక్షలాది ఏఐ నిఫుణులు తయారు అవుతారని అన్నారు.

Advertisement

 

డేటా సెంటర్ల ఆందోళనపై నోరు విప్పిన సీఎం

మంచి ఉద్యోగాలు వస్తాయన్నారు. దానివల్ల ఆదాయం కూడా పెరుగుతుందన్నారు. భోగాపురం ఎయిర్‌పోర్టు కేవలం ఆ ప్రాంతానికి కాదన్నారు సీఎం చంద్రబాబు. ఉత్తరాంధ్రకు మీ ఆశలకు-కలలకు రెక్కలన్నారు. ఇక్కడకు వ‌చ్చి మిమ్మల్ని చూశాక తనకు నమ్మకం పెరిగిందన్నారు. ఎప్పటికప్పుడు ఏం చేయ్యాలనేది ఆలోచిస్తామన్నారు.

అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గంలో ‘స్వర్ణాంధ్ర – స్వచ్చాంధ్ర’ కార్యక్రమంలో పాల్గొన్నారు సీఎం చంద్రబాబు. ఈ సందర్బంగా మాట్లాడిన ఆయన, మీ భూమికి ప‌క‌డ్బందిగా, ట్యాంప‌రింగ్ చేయ‌కుండా ప‌క్కాగా కొలిచి మ‌రీ పాస్ బుక్ ఇస్తామన్నారు. మీ భూమిని ఎవ‌రూ క‌బ్జా చేయ‌లేరని, 22-ఎ లో పెట్టలేరని వెల్లడించారు. గ‌త పాల‌న‌లో న‌కిలీ మ‌ద్యం వ‌ల్ల 30 వేల మంది చనిపోయారని గుర్తు చేశారు.

 

నిర్మాణం కాకుండా నీళ్లు ఇంకిపోయాయని ప్రచారంపై ఎద్దేవా

లక్షలాది మంది అనారోగ్యం పాలయ్యారని, మ‌న భూమిల‌న్నీ 22-ఎ లో పెట్టి భూక‌బ్జా పాల్పడ్డారని దుయ్యబట్టారు. క‌రెంట్ స‌ర‌ఫ‌రా విష‌యంలో అన‌కాప‌ల్లి జిల్లా అధికారుల‌కు వార్నింగ్ ఇచ్చారు సీఎం చంద్రబాబు. ఈ విషయంలో ప్రజలు హ్యాపీగా ఉన్నారా లేరా అనేది కొలమానమని అన్నారు. మీరు ఎంత పని చేశారనేది కాదన్నారు. ఈ విషయంలో వాళ్లంతా మెచ్చుకుంటే తాను కూడా చప్పట్లు కొడతానని అన్నారు.

ALSO READ: విశాఖ సిటీలో విద్యార్థుల గ్యాంగ్‌వార్.. పట్టపగలు కర్రలు-రాడ్లతో దాడులు

లేకపోతే వదిలిపెట్టనని అన్నారు. నిరంతరం కరెంట్ కష్టాలు లేకుండా చేయడం, క్వాలిటీ విద్యుత్ ఇవ్వడం మీ బాధ్యత అని తేల్చేశారు.  మళ్లీ వచ్చేసారి డేటా తీసుకుని మీ దగ్గరకు వస్తానని తేల్చేశారు. కస్టమర్లకు సర్వీసు తొలి ప్రాధాన్యమని, మీరు-నేను వారికి సేవకులమని అన్నారు.

Related News

ద్వారకా తిరుమలలో మహిళా ఉద్యోగిపై.. సీఎం చంద్రబాబు ప్రశంసల జల్లు!

బీసీలపై ఎందుకంత కక్ష?.. ఢిల్లీ వేదికగా వైసీపీ తీరుపై మండిపడ్డ రామ్మోహన్ నాయుడు!

బీసీ రిజర్వేషన్ల వివాదంపై క్లారిటీ ఇచ్చిన మంత్రి అచ్చెన్నాయుడు.. ఎమన్నారంటే?

ఏపీ పింఛనుదారులకు బిగ్ అలర్ట్.. నవంబర్ 1 నుంచి మారిపోతున్న రూల్స్ ఇవే!

ఏపీలో పాకిస్థాన్ గూఢచారి నెట్‌‌వర్క్ కలకలం.. ఇద్దరిని అరెస్ట్ చేసిన అధికారులు!

ఆ విధంగా ముందు.. చంద్రబాబు-పవన్ రెండుగంటలపాటు భేటీ, మరోసారి కూర్చోవాలని నిర్ణయం

వైసీపీకి ఆ సత్తా లేదు.. అందుకే కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు! – మంత్రి రాంప్రసాద్‌రెడ్డి

హోంగార్డు ఉద్యోగాల పేరుతో రూ.6.95 లక్షలు స్వాహా.. కేటుగాడు అరెస్ట్!

Big Stories

Advertisement
×