BigTV English

AP Govt: ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన.. వారి ఖాతాల్లో ఏకంగా లక్షల్లో నగదు జమ

AP Govt: ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన.. వారి ఖాతాల్లో ఏకంగా లక్షల్లో నగదు జమ

AP Govt: ఏపీలో వారికి సంక్రాంతి ముందే వచ్చింది. ఎన్నాళ్ల నుండో వేచి వున్న వారి ఎదురుచూపులకు శుభం కార్డు పడింది. కూటమి ప్రభుత్వం తీసుకున్న ఒక్క నిర్ణయంతో వారి ఖాతాల్లో నగదు జమ అయింది. అది కూడ ఒక లక్ష, 2 లక్షలు అనుకుంటే పొరపాటే. రావాల్సిన బకాయి మొత్తం ప్రభుత్వం విడుదల చేసింది. ఆశలు వదులుకున్న తమకు ప్రభుత్వం అండగా నిలిచిందని వారు వ్యక్తం చేస్తున్న ఆనందం అంతా ఇంతా కాదు. ఇంతకు వారెవరు? ప్రభుత్వం ఏం చేసిందనే విషయాలు తెలుసుకుందాం.


ప్రభుత్వం అందిస్తానన్న సాయం కోసం వారు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. ఇంతకు సాయం అందేనా? తమ కష్టం తీరేనా అనుకుంటూ వారు పడ్డ ఆవేదన అంతా ఇంతా కాదు. ఎట్టకేలకు వారి కల నెరవేరింది. వారే పోలవరం నిర్వాసితులు. ఏపీ జలప్రసాదిని పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంతో ఎన్నో కుటుంబాలు ఆవాసాన్ని కోల్పోయాయి. వారి పరిహారం అందిస్తామని నాడు ప్రభుత్వం మాటిచ్చింది. అయితే వైసీపీ ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు ఇచ్చింది శూన్యమన్నది టీడీపీ వాదన. పోలవరం నిర్వాసితులకు ఇవ్వాల్సిన పరిహారంపై మాజీ సీఎం జగన్, ఐదేళ్లుగా అదిగో ప్యాకేజీ ఇదిగో ప్యాకేజీ అని మోసం చేశారని టీడీపీ విమర్శిస్తోంది.

మొత్తం 9 వేల మంది నిర్వాసితులు ఎప్పుడెప్పుడా అంటూ సాయం కోసం ఎదురుచూపుల్లో ఉన్నారు. కూటమి అధికారం చేపట్టింది. నిర్వాసితుల సమస్యను గుర్తించింది. 6 నెలల్లో పోలవరం నిర్వాసితులకు దాదాపు రూ. 1000 కోట్లు పరిహారాన్ని వారి ఖాతాల్లో జమ చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. నిర్వాసితుల్లో ఒక్కొక్క కుటుంబానికి రూ. 10 లక్షల నుంచి 40 లక్షల వరకు పరిహారం అందింది. ఈ దశలో ఇటీవల మరోమారు నిర్వాసితులకు నగదు జమ చేసింది.


పోలవరం నిర్వాసితులకు అండగా ఉండేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు హయాంలోనే 2017 అక్టోబర్ లో పోలవరం నిర్వాసితుల ఖాతాల్లో భూముల పరిహారం రూ.800 కోట్లు జమ అయినట్లు, ఆ తర్వాత మళ్లీ తమ ఇబ్బందులు కూటమి ప్రభుత్వంలో తొలగినట్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Tirumala: తిరుమల అలిపిరి మెట్ల మార్గం ఓ అద్భుతం.. ఇక్కడికి వెళ్లే భాగ్యం మీకు దక్కిందా?

తమ ఖాతాల్లో నగదు జమ కావడంతో, తమకు ముందుగా సంక్రాంతి పండుగ వచ్చిందని భావిస్తున్నామని సోషల్ మీడియాలో వీడియోలను కూడ నిర్వాసితులు విడుదల చేయడం విశేషం. మరి మీరు కూడ పోలవరం నిర్వాసితులైతే, వెంటనే మీ ఖాతాలు చెక్ చేసుకోండి. అలాగే ఎట్టి పరిస్థితుల్లో పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేసి తీరుతామని సీఎం చంద్రబాబు ఇటీవల ప్రకటించారు. ఇప్పటికే కేంద్రం సైతం నిధులు విడుదల చేస్తున్న నేపథ్యంలో ప్రాజెక్ట్ పూర్తిపై ప్రజల్లో ఆశలు చిగురించాయని చెప్పవచ్చు.

Related News

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Visakhapatnam Crime: భార్య పేకాటపై భర్త కంప్లైంట్.. పెద్ద సంఖ్యలో చిక్కిన పేకాట రాణులు..!

Jagan Fear: తమ్ముడు బాటలో జగన్.. అసలు మేటరేంటి?

Big Stories

×