Upcoming Smartphones: మీరు కొత్త స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలని చూస్తున్నారా. అయితే మీకు గుడ్ న్యూస్. ఎందుకంటే వచ్చే వారం, బడ్జెట్, మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ల విభాగంలో అనేక కొత్త ఫోన్లు మార్కెట్‌లో అడుగుపెట్టనున్నాయి. ఈ కొత్త స్మార్ట్‌ఫోన్లు మీకు అద్భుతమైన కెమెరా, శక్తివంతమైన బ్యాటరీ, అద్భుతమైన డిస్‌ప్లేను అందించనున్నాయి. ప్రతి ఫోన్ యూజర్ అవసరాలకు సరిపోయే విధంగా ఉండటంతోపాటు మీకు అనేక విధాలుగా ఉపయోగపడనున్నాయి.
వినియోగదారుల నుంచి..
ప్రత్యేకంగా, ఏప్రిల్ 15న మూడు విభిన్న ఫోన్లు లాంచ్ అవుతున్నాయి. దీంతో ఫోన్ల ప్రపంచంలో ఇవి హాట్ టాపిక్‌గా మారాయి. అన్ని వర్గాలకు సరిగ్గా సరిపోయే ఈ ఫోన్లు, వినియోగదారుల నుంచి మంచి స్పందనను పొందే అవకాశం ఉంది. మరి అవి ఎటువంటి ఫోన్లు? వాటి ప్రత్యేకతలు ఏంటి? అనే విషయాలను ఇప్పుడు తీలుసుకుందాం.
1. మోటరోలా ఎడ్జ్ 60 స్టైలస్
మోటరోలా కంపెనీ, ఏప్రిల్ 15, 2025న ఎడ్జ్ 60 స్టైలస్ ఫోన్‌ను లాంచ్ చేయబోతుంది. ఈ ఫోన్ డ్రాయింగ్, ఉత్పాదకత కోసం స్టైలస్ ఫీచర్లను అందిస్తుంది. ఇది 6.67 అంగుళాల డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 7s జనరేషన్ 2 ప్రాసెసర్, మోటో AI ఫీచర్లతో వస్తుంది. 8GB ర్యామ్, 256GB స్టోరేజ్ వేరియంట్ సపోర్ట్ ద్వారా వస్తున్న దీని ధర సుమారు రూ.22,999 నుంచి ప్రారంభమవుతుంది.
2. రెడ్‌మి A5
రెడ్‌మి, ఏప్రిల్ 15న బడ్జెట్ ఫోన్‌ను విడుదల చేయబోతుంది. గ్లోబల్ వేరియంట్‌లో 120Hz డిస్‌ప్లే, 5,200mAh బ్యాటరీతో వస్తుంది. భారతదేశంలో దీని ధర రూ. 10,000 కంటే తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఈ ఫోన్ వినియోగదారులకు అందుబాటులోకి రానుంది.
Read Also: Samsung Ballie: బాలి వచ్చాడు..ఇంట్లోనే ఫ్యూచర్ టచ్, కొత్త …
3. ఏసర్ స్మార్ట్‌ఫోన్‌లు
ఏప్రిల్ 15న, ఏసర్ తన కొత్త ఫోన్‌ను లాంచ్ చేయబోతుంది. ఫోన్ పేరు, స్పెసిఫికేషన్లు ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు. 4GB ర్యామ్, 64GB స్టోరేజ్, 5,000mAh బ్యాటరీతో ఉండే అవకాశం ఉంది.
4. శామ్‌సంగ్ గెలాక్సీ M56 5G
శామ్‌సంగ్, ఏప్రిల్ 17న గెలాక్సీ M56 5G ఫోన్‌ను ప్రారంభించబోతుంది. బ్యాక్ కెమెరా మాడ్యూల్ డిజైన్, sAMOLED+ స్క్రీన్, 50MP OIS సపోర్ట్ ఉన్న ప్రధాన సెన్సార్, AI ఇమేజింగ్ టూల్స్‌తో ఇది వస్తుంది. ఎక్సినోస్ 1480 ప్రాసెసర్‌తో రానున్న ఈ ఫోన్ ధర సుమారు రూ.25,000 నుంచి రూ.30,000 వరకు ఉండే అవకాశం ఉంది.
5. ఇన్ఫినిక్స్ 5జీ
ఇన్ఫినిక్స్, ఏప్రిల్ 18న తన కొత్త ఫోన్‌ను లాంచ్ చేయబోతుంది. 64MP సోనీ IMX682 సెన్సార్‌తో, 4K వీడియో రికార్డింగ్, 12 ఫోటోగ్రఫీ మోడ్‌లు, డ్యూయల్ వీడియో మోడ్‌ను అందిస్తాయి. దీని ధర రూ. 20,000 కంటే తక్కువగా ఉండే అవకాశం ఉంది.
ఈ ఫోన్లు, బడ్జెట్, మిడ్-రేంజ్ విభాగాల్లో శక్తివంతమైన ఫీచర్లతో వస్తున్నాయి. మీ అవసరాలకు అనుగుణంగా, వీటిలో మీరు ఏదైనా ఫోన్ ఫీచర్లు, ధర వంటి వివరాలను పరిశీలించి, కొనుగోలు చేయవచ్చు.
Read Also: Samsung Ballie: బాలి వచ్చాడు..ఇంట్లోనే ఫ్యూచర్ టచ్, కొత్త …