BigTV English
Advertisement

Father In Law Kill: ఇంట్లో ఒంటరిగా కోడలు.. వీధిలోనే గొయ్యి తీసి పాతేసిన మామ.. ‘దృశ్యం’లా కథ అల్లేశాడుగా!

Father In Law Kill: ఇంట్లో ఒంటరిగా కోడలు.. వీధిలోనే గొయ్యి తీసి పాతేసిన మామ.. ‘దృశ్యం’లా కథ అల్లేశాడుగా!

Father In Law Kill Daughter In Law| సినిమాలు చూసి జనం తెలివి మీరిపోతున్నారు. స్వార్థం కోసం హత్యలు చేసి వాటిని లోకానికి తెలియకుండా దాటిపెట్టడానికి ఎవరూ ఊహించలేని పనులు చేస్తున్నారు. ఆ తరువాత ఎవరికీ అనుమానం రాని విధంగా కథలు అల్లేస్తున్నారు. ఇలాంటి నేర ఘటనలు దేశంలో తరుచూ జరుగుతూనే ఉన్నాయి. తాజాగా అలాంటి ఒక షాకింగ్ ఘటన హర్యాణా రాష్ట్రంలోని ఫరీదాబాద్ నగరంలో జరిగింది. ఒక యువతిని చంపేసి అందరి కళ్ల ముందే ఆమెను పాతిపెట్టేశారు. కానీ అక్కడేం జరుగుతోందో చూసిన వారెవరికీ తెలియలేదు. అంతలా హంతకులు మాయ చేశారు.. ఈ భయనక హత్య కేసులో.


వివరాల్లోకి వెళితే.. ఫరీదాబాద్ జిల్లాకు చెందిన భూప్ సింగ్ (60) అనే వ్యక్తి నగరంలోని రోషన్ నగర్ లో నివసిస్తున్నాడు. అతని ఇంట్లో అతని భార్య సోనియా, కుమారుడు అరుణ్ సింగ్ (30), కూతురు కాజల్ ఉన్నారు. అయితే రెండేళ్ల క్రితం అంటే 2023 సంవత్సరంలో అరుణ్ సింగ్ కు అదే నగరంలో నివసించే తను కుమారితో వివాహం చేశాడు. అయితే తను ఆ ఇంట్లో కోడలిగా కొన్ని రోజుల తరువాత ఆమెకు కష్టాలు మొదలయ్యాయి. తన కుమారుడి వివాహంలో అడిగినంత వరకట్నం ఇవ్వలేదని భూప్ సింగ్, అతని భార్య సోనియా.. కొత్త కోడలిని వేధించడం మొదలుపెట్టారు. ఈ కారణంగానే పెళ్లి జరిగిన నాలుగు నెలల తరువాత వారి కోడలు తను తన పుట్టింటికి తిరిగి వెళ్లిపోయింది. అక్కడే ఏడాది పాటు ఉండిపోయింది. కట్నం డబ్బులు తీసుకొని వచ్చేంత వరకు ఆమెను వారు తమ ఇంట్లోకి అనుమతించలేదు.

ఈ కారణంగానే ఆమె తల్లిదండ్రులు ఎంతో కష్టపడి కొంతవరకూ ఆ కట్నం డిమాండ్ ను పూర్తి చేశారు. దీంతో తను తిరిగి తన అత్తగారింటికి చేరింది. కానీ మళ్లీ ఆమెకు వేధింపులు తప్పలేదు. మిగతా డబ్బులు ఆమె తల్లిదండ్రులు ఎప్పుడు ఇస్తారని ఆమెను ప్రశ్నించేవారు. ఈ క్రమంలో ఏప్రిల్ 21 2025 నుంచి తను కనిపించకుండా పోయింది. మూడు రోజుల తరువాత తమ కోడలు ఇల్లు వదిలివెళ్లిపోయిందని భూప్ సింగ్, అతని భార్య సోనియా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ కేసు విచారణ చేయగా.. తను చెల్లెలు ప్రియ.. పోలీసులకు తన అక్కను కట్నం కోసం వేధించేవారని చెప్పింది. అంతకు ముందు కట్నం డబ్బులు ఇవ్వలేదని ఏడాది పాటు తన అక్కను ఇంట్లో నుంచి వెలివేశారని తెలిపింది.


దీంతో పోలీసులు భూప్ సింగ్ ఇంటి ఇరుగుపొరుగున నివసించే వారిని ప్రశ్నించారు. అప్పుడు వారికి ఒక విచిత్ర విషయం తెలిసింది. సరిగ్గా తను కనబడకుండా పోయిన తరువాతి రోజు భూప్ సింగ్, అతని కుమారుడు ఇంటి బయటి వీధిలో ఒక పెద్ద 10 అడుగుల గుంత తవ్వించారు. ఇంట్లో డ్రైనేజీ సమస్య ఉందని.. అందుకే తవ్విస్తున్నామని తెలిపారు. అయితే రాత్రికి రాత్రి ఆ గుంత ను కాంక్రీట్ తో మూసివేశారు. డ్రైనేజీ గుంత అయితే దాన్ని కాంక్రీట్ తో మూసి వేయడం చాలా ఆశ్చర్య కరంగా అనిపించిందని భూప్ సింగ్ పొరుగింటి యజమాని చెప్పాడు. ఇదంతా విని పోలీసులు ఆ గుంత స్థానంలో తవ్వించగా.. లోపలి నుంచి తను మృతదేహం లభించింది.

పోలీసులు శవాన్ని పోస్ట్ మార్టం కోసం తరలించారు. ఆ తరువాత భూప్ సింగ్, అతని కుటుంబాన్ని అదుపులోకి తీసుకొని గట్టిగా ప్రశ్నించగా.. వాళ్లు ఒక షాకింగ్ నిజం చెప్పారు. పోలీసులు కథనం ప్రకారం.. ఏప్రిల్ 21 2025 రాత్రి ఇంట్లో కేవలం తను ఒంటరిగా ఉంది. ఆ సమయంలో అందరూ బయటికి వెళ్లిపోయారు. అయితే ఆ సమయంలో భూప్ సింగ్ ఇంటికి వచ్చి ఆమె తలపై దాడి చేశాడు. ఆ తరువాత ఆమె గొంత బిగించి చంపేశాడు. ఆ సమయంలో ఇంట్లో ఉన్నవారంతా సినిమా చూసేందుకు వెళ్లారు. వారంతా వచ్చే లోపు భూప్ సింగ్ కోడిలిని చంపేశాడు. ఆ తరువాత ఇంటికి వచ్చిన తన భార్య, కొడుకుతో కలిసి ఆ శవాన్ని ఎక్కడైనా పాతిపెట్టేయాలి లేక దాచిపెట్టాలని భావిస్తుండగా.. ఇంటి ముందే డ్రైనేజి గుంత కోసం చిన్న ఎక్స్ కెవేటర్ తో తవ్వించి.. రాత్రి ఎవరూ లేని సమయంలో అందులో వారి కోడలి మృతదేహాన్ని పడేసి.. దానిపై కాంక్రీట్ తో నింపేశారు. ఆ తరువాతి రోజు కూలీలను పిలిచి అంతా లెవెల్ కూడా చేసేశారు.

Also Read: ఊరెళ్లిన భర్త.. లవర్‌తో హనీమూన్ వెళ్లేందుకు 2 పిల్లలను చంపిన భార్య

పోలీసులు తను హత్య, కట్నం వేధింపుల కేసు నమోదు చేసి భూప్ సింగ్, అతని భార్య సోనియా, కొడుకు అరుణ్ సింగ్, కూతరు కాజల్ ని నిందితులు చేర్చారు. ఈ నలుగురిని అదుపులోకి తీసుకొని విచారణ సాగిస్తున్నారు.

Related News

UP Lovers Incident: UPలో దారుణం.. లవర్‌ను గన్‌తో కాల్చి.. తర్వాత ప్రియుడు కూడా..

Bengaluru Central Jail: బెంగళూరు సెంట్రల్ జైలు.. ఖైదీలు ఓ రేంజ్‌లో పార్టీ, ఐసిస్ రిక్రూటర్ కూడా

Nara Lokesh: బీహార్ ఎన్నికల ప్రచారంలో వైసీపీ ప్రస్తావన.. లోకేష్ కౌంటర్లు మామూలుగా లేవు

Earthquake In Japan: జపాన్‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..

Blood Flow ECMO: మరణించిన తర్వాత కూడా రక్త ప్రసరణ.. ఆసియాలో తొలిసారిగా ఎక్మో టెక్నిక్

Center Scrap Selling: స్క్రాప్ అమ్మితే రూ.800 కోట్లు.. చంద్రయాన్-3 బడ్జెట్ ను మించి ఆదాయం

Karregutta Operation: హిడ్మా పని ఖతం! కర్రెగుట్టను చుట్టుముట్టిన 200 మంది పోలీసులు

Cyber Security Bureau: దేశవ్యాప్తంగా సైబర్ సెక్యూరిటీ బ్యూరో మెగా ఆపరేషన్.. 81 మంది అరెస్ట్

Big Stories

×