Big Stories

Tecno Camon 30 Premier: నాలుగు 50MP కెమెరాలతో టెక్నో ఫోన్ లాంచ్.. కెమెరా ఫీచర్స్ చూస్తే షాక్ అవ్వాల్సిందే..!

Tecno Launched Camon 30 Premier 5G Mobile with Four 50MP Camera’s: దేశంలో టెక్ కంపెనీల మధ్య బీభత్సమైన పోటీ నెలకొంది. స్మార్ట్‌ఫోన్ కంపెనీలు వరుసబెట్టి ఫోన్లను లాంచ్ చేస్తున్నాయి. మొబైల్ లవర్స్‌ను అట్రాక్ట్ చేస్తున్నాయి. తక్కువ ప్రైజ్‌తో బెస్ట్ ఫీచర్లను ఆఫర్ చేయడంతో యూజర్లు కూడా కొత్తగా లాంచ్ అయ్యే ఫోన్లను కొనడానికి ఇంటరెస్ట్ చూపుతున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ టెక్ కంపెనీ టెక్నో తమ బ్రాండ్ నుంచి Tecno Camon 30 ప్రీమియర్ 5G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనుంది.

- Advertisement -

ఈ స్మార్ట్‌ఫోన్ టెక్నో కంపెనీ పోలార్ ఏస్ ఇమేజింగ్ సిస్టమ్‌తో వస్తుంది. ఇందులో బ్యాక్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. క్వాలిటీ ఫోటోల కోసం లేటెస్ట్ టెక్నాజీని ఉపయోగించారు. ఈ ఫోన్‌ మీడియా టెక్ డైమెన్సిటీ 8200 SoC ప్రాసెసర్‌తో ఉంటుంది. 5000mAh బ్యాటరీ, ఫాస్ట్‌ఛార్జింగ్ సపోర్ట్ ప్యాక్ ఉంది. అంతేకాకుండా ఇందులో డాల్బీ అట్మాస్ డ్యూయల్ స్పీకర్లు ఉన్నాయి. దీంతో మంచి క్వాలిటీ సౌండ్‌ను ఎంజాయ్ చేయవచ్చు.

- Advertisement -
Tecno Camon 30 Premier 5G
Tecno Camon 30 Premier 5G

Also Read: లిమిటెడ్ డీల్.. రూ. 4000 ఇయర్‌బడ్స్.. మరీ ఇంత సవకా!

టెక్నో ఈ స్మార్ట్‌ఫోన్ ధరను ఇంకా వెల్లడించలేదు. ఆన్‌‌లైన్‌లో ఉన్న సమాచారం ప్రకారం.. ఈ 5జీ ఫోన్ 12GB RAM+512GB స్టోరేజ్‌తో వస్తోంది. రెండు కలర్ ఆఫ్షన్స్‌లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఆల్ప్స్ స్నోవీ సిల్వర్,హవాయి లావా బ్లాక్ కలర్స్ ఇందులో ఉన్నాయి. కానీ మోడల్ గురించి ఎటువంటి సమాచారం లేదు. ఈ ఏడాది మే నెలలో ఫోన్ సేల్‌కు వచ్చే అవకాశం ఉంది.

టెక్నో కామన్ 30 ప్రీమియ్ 5జీ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్ల విషయానికి వస్తే ఈ 5G స్మార్ట్ ఫోన్ 6.77 ఇంచెస్ డిస్‌ప్లే‌, 120Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటక్షన్‌తో వస్తుంది. ఇది LTPO అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. MediaTek డైమెన్సిటీ 8200 చిప్‌సెట్ ద్వారా ఫోన్ పవర్ ‌ఫుల్‌గా పనిచేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 14-ఆధారిత HiOS 14పై రన్ అవుతుంది.

Also Read: మోటో నుంచి న్యూ స్మార్ట్‌ఫోన్.. ఫీచర్లు లీక్!

ఈ స్మార్ట్‌ఫోన్ కెమెరా విషయానికి వస్తే ఇందులో 50మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌తో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. 3x ఆప్టికల్ జూమ్‌తో 50-మెగాపిక్సెల్ సెన్సార్, 50-మెగాపిక్సెల్ మూడో కెమెరా ఉంటుంది. ఫోన్ ఫ్రంట్ కెమెరా కూడా 50 మెగాపిక్సెల్ ఆటోఫోకస్‌తో వస్తుంది. కనెక్టవిటీ కోసం 5G, 4G, GNSS, Wi-Fi, OTG,USB టైప్-సి వంటివి ఉన్నాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News