E-Paper
Advertisement

Moto E14 Launching: మోటో నుంచి న్యూ స్మార్ట్‌ఫోన్.. ఏకంగా 5,000mAh బ్యాటరీ.. లీకైన ఫీచర్స్!

Moto E14 Launching: మోటో నుంచి న్యూ స్మార్ట్‌ఫోన్.. ఏకంగా 5,000mAh బ్యాటరీ.. లీకైన ఫీచర్స్!
Advertisement

Moto E14 Launching in India: టెక్ కంపెనీ మోటోరోలా ఈ ఏడాది ప్రారంభం నుంచే బడ్జెట్ ఫోన్లపై ఫోకస్ చేసింది. మిడ్ రేంజ్ ప్రైజ్ సెగ్మెంట్‌లో ఎక్కువగా ఫోన్లను తీసుకొస్తుంది. మోటో ఫోన్లకు ఆన్‌లైన్ సైటుల్లో కూడా మంచి రేటింగ్ లభిస్తుంది. కొనుగోలుదారులు కూడా ఈ ఫోన్లను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. దీంతో కంపెనీ బడ్జెట్ ఫోన్ల మార్కెట్‌ను విస్తరించే ప్రయత్నం చేస్తొంది. కొత్త స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేసేందుకు సిద్ధమైంది. .

మోటో ఇప్పుడు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తోంది. కంపెనీ  Moto E14 స్మార్ట్‌పోన్‌ను త్వరలో గ్లోబల్ మార్కెట్‌లో లాంచ్ చేయనుంది. నేడు ఈ ఫోన్ టెలికమ్యూనికేషన్ అండ్ డిజిటల్ గవర్నమెంట్ రెగ్యులర్ అథారిటీ సర్టిఫికేషన్‌ కోసం ధరఖాస్తు చేసుకోంది.

Moto E14
Moto E14
Advertisement

Also Read: లిమిటెడ్ డీల్.. రూ. 4000 ఇయర్‌బడ్స్.. మరీ ఇంత సవకా!

మోటరోలా మోడల్ నంబర్ XT2421-14తో రాబోయే స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేస్తుందని TDRA సర్టిఫికేషన్ సూచిస్తుంది. మోడల్ నంబర్ ,మోనికర్ కాకుండా ఈ స్మార్ట్‌ఫోన్ గురించి ఎటువంటి సమాచారాన్ని సంస్థ అందిచదు.

Advertisement

బ్యాటరీ విషయానికి వస్తే TUV రైన్‌ల్యాండ్ సర్టిఫికేషన్ ఈ మోటోరోలా స్మార్ట్‌ఫోన్  4,850mAh బ్యాటరీతో వస్తుంది. 4850mAh రేటెడ్ బ్యాటరీ 5,000mAh సాధారణ సామర్థ్యంతో లాంచ్ అవుతుంది. మోలో TUV రైన్‌ల్యాండ్ సర్టిఫికేషన్‌లో 10W, 15W, 20W ఛార్జింగ్ అడాప్టర్‌లతో స్మార్ట్‌ఫోన్‌ను పరీక్షించింది.

మోటరోలా తన రాబోయే స్మార్ట్‌ఫోన్‌లో 20W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇస్తుందని TUV వెల్లడించింది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్ ఇతర స్పెసిఫికేషన్‌ల గురించి ఇంకా ఎలాంటి సమాచారం అందలేదు. Moto E14 ఇంతకు ముందు స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఉన్న మోటో ఫోన్లను పోలి ఉండనుంది. Moto E13 అప్‌గ్రేడ్ వెర్షన్‌గా రావచ్చు. కాబట్టి ఈ 13లో ఉన్నటువంటి ఫీచర్లనే ఈ 14లో కూడా చేసే అవకాశం ఉంది.

Also Read: వన్‌ప్లస్ 11R నుంచి కొత్త వేరియంట్.. ఏప్రిల్ 18న లాంచ్!

మోటో E13లో కంపెనీ 6.5 అంగుళాల డిస్‌ప్లే, Unisoc T616 SoC చిప్‌సెట్, గ్రాఫిక్స్ కోసం Mali G57 GPU, ఆపరేటింగ్ సిస్టమ్ కోసం Android 13 Go ఎడిషన్ సపోర్ట్, 13MP బ్యాక్, 5MP ఫ్రంట్ కెమెరా, 5000mAh బ్యాటరీ, 10W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ని అందించింది. ఇక ఈ ఫోన్ అప్‌గ్రేడ్ వెర్షన్‌లో కంపెనీ ఎలాంటి స్పెసిఫికేషన్‌లను అందజేస్తుందో చూడాలి.

Tags

Related News

Huawei Watch GT 7 సిరీస్ లాంచ్.. 21 రోజుల బ్యాటరీ, అద్భుతమైన ఫీచర్లు!

వేగంగా కదులుతోన్న ఆస్ట్రేలియా ఖండం.. ఆసియాలోని ఆ దేశాలను ఢీకొట్టనుందా?

ఈ మ్యూజిక్ బీట్స్ చూస్తే.. మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే!

పాకెట్ ఫ్రెండ్లీ ప్రైస్‌లో.. డైనమిక్ థండర్ సౌండ్!

కొత్త మోడల్ వచ్చేలోపే శాంసంగ్ మాస్టర్ ప్లాన్.. బెస్ట్ AI ఫోన్‌పై ఊహించని డిస్కౌంట్!

భారీ బ్యాటరీ, అల్టిమేట్ లుక్.. మార్కెట్‌ను షేక్ చేయడానికి Redmi 17 5G వచ్చేసింది!

రూ.15,799లకే 43ఇంచుల టీవీ..ఆఫర్ అంటే ఇలా ఉండాలి

చైనా ఫోన్లకు చెక్ పెడుతూ.. హైదరాబాద్‌లోనే తయారైన తొలి Mivi 5G ఫోన్ వచ్చేస్తోంది!

Big Stories

Advertisement
×