TECNO POP 9 : ఎప్పటికప్పుడు తక్కువ బడ్జెట్ లో బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ ను తీసుకొస్తున్న ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ టెక్నో. ఈ కంపెనీ తాజాగా మరో కొత్త మొబైల్ ను లాంచ్ చేయడానికి సిద్ధమైంది. ఈ మొబైల్ ఫీచర్స్ తో పాటు ధర తెలిస్తే నిజంగా షాక్ అవ్వాల్సిందే. ఈ రోజుల్లో వస్తున్న మొబైల్స్ తో పోలిస్తే అతి తక్కువ ధరకే బెస్ట్ ఫీచర్ మొబైల్ ను త్వరలోనే లాంచ్ చేయనున్నట్లు తెలుస్తుంది. ఇక తాజాగా ఈ మొబైల్ లాంచ్ డేట్ తో పాటు స్పెసిఫికేషన్స్ సైతం లీక్ అవ్వడంతో టెక్ ప్రియులు ఉర్రూతలూగుతున్నారు.
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ టెక్నో మరో కొత్త మెుబైల్ ను ఇండియాలో లాంచ్ చేయడానికి సిద్ధమైంది. నవంబర్ 26న ఈ మొబైల్ మార్కెట్లోకి రానున్నట్టు తెలుస్తోంది. టెక్నో టాప్ 9 పేరుతో రాబోతున్న ఈ మొబైల్ ఫీచర్స్ అత్యద్భుతంగా ఉన్నాయి. కెమెరా క్వాలిటీతో పాటు బ్యాటరీ కెపాసిటీ మొబైల్ ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్స్ పై ఓ లుక్కేద్దాం.
టెక్నో తీసుకురాబోతున్న టెక్నో టాప్ 9 మొబైల్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంతో పనిచేస్తుంది. ఇక ఇందులో మీడియా టెక్ హీలియో జీ 50 ప్రాసెసర్ ఉండనుంది. ఈ స్మార్ట్ ఫోన్ 3జిబి రామ్ తో పాటు 64gb ఇంటర్నల్ స్టోరేజ్ ను కలిగి ఉంది.
డిస్ ప్లే – ఈ మొబైల్ డిస్ ప్లే ను వినుత్నంగా టెక్నో డిజైన్ చేసింది. ఇందులో 6.67 అంగుళాల డిస్ప్లే తో పాటు 90Hz రిఫ్రెష్ రేట్ డిస్ ప్లే ఉండనుంది. ఇక డిటిఎస్ సరౌండ్ సౌండ్ సపోర్ట్ తో రాబోతున్న ఈ మొబైల్.. కెమెరా ఫీచర్స్ సైతం అద్భుతంగా ఉన్నాయి. ఇందులో 13 ఎంపీ కెమెరాతో పాటు డస్టర్ అండ్ వాటర్ కు IP54 రేటింగ్ ను టెక్నో అందిస్తుంది. దీంతో ఈ స్మార్ట్ ఫోన్ వాటర్ డస్ట్ కు డామేజ్ కాదని తెలిపింది.
స్పెషల్ ఎట్రాక్షన్ బ్యాటరీ – ఈ స్మార్ట్ ఫోన్ లో 5000 mah బ్యాటరీ సదుపాయం కలదు. ఇక ఒక్కసారి ఛార్జ్ చేస్తే 100 గంటలపాటు మ్యూజిక్ ప్లే బ్యాక్ సపోర్ట్ ఇస్తుందని తెలుస్తుంది. కనెక్టివిటీ విషయానికి వస్తే డ్యూయల్ సిమ్ స్లాట్ తో పాటు వైఫై, జిపిఎస్, బ్లూటూత్ ఆడియో సదుపాయం కలదు.
ధర విషయానికి వస్తే 3GB + 64GB స్టోరేజ్ ధర రూ.6499గా టెక్నో తెలిపింది. ఈ మెుబైల్ పై డిస్కౌంట్స్ సైతం వచ్చే అవకాశం ఉందని చెప్పుకొచ్చింది. ఇక ఈ మొబైల్ నవంబర్ 26 నుంచి అమెజాన్ లో అందుబాటులో ఉండనున్నట్టు తెలిపిన టెక్నో.. ఈ మొబైల్ మూడు రంగుల్లో వస్తుందని తెలిపింది.గ్లిట్టరీ వైట్, లైమ్ గ్రీన్, స్టార్ట్రైల్ బ్లాక్ కలర్స్ లో ఈ మొబైల్ అందుబాటులో ఉంటుందని తెలిపిన టెక్నో.. ఇక అతి తక్కువ ధరకే బెస్ట్ మొబైల్ కొనాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని తెలిపింది.
ALSO READ : అరే.. మెున్ననే లాంఛ్ అయ్యాయి.. అప్పుడే సగానికి పైగా డిస్కౌంటా.. !!