BigTV English

Cinema Pichodu Review : ‘సినిమా పిచ్చోడు మూవీ’ రివ్యూ

Cinema Pichodu Review : ‘సినిమా పిచ్చోడు మూవీ’ రివ్యూ

రివ్యూ : సినిమా పిచ్చోడు మూవీ
నటీనటులు : కుమార్ స్వామి,
దర్శకత్వం : కుమార్ స్వామి
సంగీతం : తరుణ్ రానా ప్రతాప్
రిలీజ్ : నవంబర్ 22


కుమార్ స్వామి నుండి గతంలో మంచి చిత్రాలు వచ్చాయి. ఇప్పుడు “సినిమా పిచ్చోడు” సినిమా తో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు ఆయన. స్వీయ దర్శకత్వంలో కుమార్ స్వామి నటించిన ఈ సినిమా టీజర్, ట్రైలర్ మంచి ఆసక్తిని రేకెత్తించాయి. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుందా? అనే ప్రశ్నకి సమాధానం ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం రండి.

కథ
జోష్ అలియాస్ కుమారస్వామి (హీరో) గ్రామంలో పాల వ్యాపారి. కానీ హీరోకి సినిమాలు అంటే ప్రాణం. అందుకే అతను అందరిని పేరుతో కాకుండా సినిమాల పేర్లతో పిలవటం అలవాటు చేసుకుంటాడు. అయితే ఆ గ్రామంలో ఉన్నవాళ్లు అతన్ని సినిమా పిచ్చోడు అని తిడుతూ ఉంటారు. ఇలాంటి టైంలో జోష్ వాళ్ళ గ్రామంలో డెమో తీయడానికి వస్తుంది భాను (సావిత్రి కృష్ణ). హీరోయిన్ కి కాలేజ్ చైర్మన్ డెమో ఫిలిం తీయడానికి అవకాశం కల్పిస్తాడు. తను తన టీంతో గ్రామానికి వస్తారు. ఇలాంటి టైమ్ లో సినిమా అంటే బాగా ఇష్టపడుతున్న హీరోని హీరోయిన్ ఇస్తాపడుతుంది. ఈ క్రమంలో అనుకోకుండానే హీరోకి అవకాశం వస్తుంది. అసలు హీరోకి అవకాశం ఎలా వచ్చింది? తన కోరిక ఎలా నెరేవేర్చుకున్నాడు? ప్రేమించిన వాడి కోసం హీరోయిన్ చేసిన సాయం ఏంటి? జోష్ గతమేంటి? అనేది మిగిలిన కథ.


విశ్లేషణ
‘సినిమా పిచ్చోడు’ కథ చాలా సాదా సీదాగా మొదలవుతుంది. ఫస్ట్ హాఫ్ లో అక్కడక్కడా వచ్చే కామెడీ సోసోగానే అనిపిస్తుంది. విలన్ సర్పంచ్ హీరోకి వరుసకు మామ. అతనికి హీరో వార్నింగ్ ఇచ్చే ఎపిసోడ్ అంతా రొటీన్ గానే అనిపిస్తుంది. సర్పంచ్ సినిమా షూటింగ్ అడ్డుకున్నా కానీ హీరో జోష్ (హీరో), హీరోయిన్ సావిత్రి కృష్ణ ఇద్దరు కలిసి ఏ విధంగా పూర్తి చేశారు అన్నది మిగతా కథ. ఇలాంటి కథ కుమారస్వామి ఎలా ఎంపిక చేసుకున్నాడు అనేది అస్సలు అర్థం కాదు. కానీ తక్కువ బడ్జెట్లో మంచి సినిమా తీయవచ్చు అని నిరూపించాడు కుమార స్వామి. ఇంటర్వెల్ బ్లాక్ బాగుంది. మరీ ఎక్సయిట్ చేసేలా ఉంటుంది. కానీ సెకండ్ హాఫ్ స్టార్టింగ్ పోర్షన్ వీక్ గానే అనిపిస్తుంది. ఆ తర్వాత వచ్చే సీన్స్ మాత్రం కట్టి పడేస్తాయి. కథనం కూడా వేగం పుంజుకుంటుంది. అందరూ అటెన్షన్ తో కూర్చుంటారు. సెకండాఫ్ లో కొన్ని ట్విస్ట్ లు ఊహించని విధంగా ఉంటాయి. సిటీకి వచ్చాక అతనికి ఎదురైన ఇబ్బందులు, వాటిని ఎలా ఎదుర్కొన్నాడు అనేది సెకండ్ హాఫ్ కథ. హీరో అవ్వాలనే తన కోరికను ఎలా నెరవేర్చుకున్నాడు? సినిమా పిచ్చోడు ముద్ర నుంచి బయటపడి, సినిమా హీరోగా ఎలా నిలబడగలిగాడు అనేది రెండో భాగం కథ. మళ్ళీ క్లైమాక్స్ సాగదీసినట్టు ఉన్నా.. ఓకే అని ప్రేక్షకులు కన్విన్స్ అయ్యే ఛాన్స్ ఉంది. నటీనటుల విషయానికొస్తే.. కుమార స్వామి ఎప్పటిలానే హుషారుగా నటించాడు. సావిత్రి కృష్ణ పాత్ర ఆకట్టుకుంటుంది. డైరెక్టర్ పాత్రలో ఆమె ఇమిడి పోయింది. మిగతా పాత్రధారులందరూ వారి వారి పరిధి మేరకు అద్భుతంగా నటించారు. భరత్, జ్యోతి చౌదరి, జోషిత్ ఎన్నేటి, కిట్టయ్య తదితరులు నటన పరంగా పర్లేదు అన్పించారు.

Related News

Tehran Movie Review : ‘టెహ్రాన్’ మూవీ రివ్యూ… యాక్షన్‌‌తో దుమ్మురేపే గ్లోబల్ స్పై థ్రిల్లర్

Coolie Movie Review : కూలీ మూవీ రివ్యూ… లోకి ‘లో’ మార్క్

WAR 2 Movie Review : వార్ 2 మూవీ రివ్యూ.. జస్ట్ వార్ – నో రోర్

Coolie Twitter Review : కూలీ సినిమా ట్విట్టర్ రివ్యూ

War 2Twitter Review : ‘వార్ 2 ‘ ట్విట్టర్ రివ్యూ.. బాక్సాఫీస్ బద్దలవ్వాల్సిందే..!

Coolie Review: కూలీ మూవీకి ఆ హీరో ఫస్ట్ రివ్యూ.. అదేంటీ అలా అనేశాడు, వెళ్లొచ్చా?

Big Stories

×