BigTV English

Lava: లావా ఎలా ఏర్పడుతుంది? భూమి లోతుల నుంచి వచ్చే అగ్నిపర్వత ప్రవాహం గురించి మీలో ఎంత మందికి తెలుసు?

Lava: లావా ఎలా ఏర్పడుతుంది? భూమి లోతుల నుంచి వచ్చే అగ్నిపర్వత ప్రవాహం గురించి మీలో ఎంత మందికి తెలుసు?

Lava: లావా… ఈ పదం వినగానే మన కళ్ల ముందు కరిగిన రాయి లాంటి మండుతున్న ప్రవాహం, ఎర్రగా మెరిసే దృశ్యం కనిపిస్తుంది. ఒకవైపు ఈ లావా అందం మనల్ని ఆకర్షిస్తుంది, మరోవైపు దాని శక్తి విధ్వంసం సృష్టిస్తుంది. కానీ ఈ లావా ఎలా ఏర్పడుతుంది? భూమి లోతుల నుంచి ఉపరితలం వరకూ దాని ప్రయాణం ఎలా ఉంటుంది? వంటి అనేక ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఈ ఆర్టికల్ చదవాల్సిందే..


వేడి రాళ్ల వల్ల లావా
లావా కథ భూమి లోపల, మాంటిల్ అనే పొరలో మొదలవుతుంది. ఈ మాంటిల్ భూమి ఉపరితలం కింద, సుమారు 30 నుంచి 100 కిలోమీటర్ల లోతులో ఉంటుంది. ఈ పొరలో రాళ్లు సాధారణంగా గట్టిగానే ఉంటాయి. కానీ కొన్ని ప్రాంతాల్లో 1,000 నుంచి 2,000 డిగ్రీల సెల్సియస్ వేడి ఉంటుంది. ఈ వేడితో రాళ్లు కరిగి, ద్రవంగా మారతాయి. ఈ ద్రవాన్నే మాగ్మా అంటారు.

మాగ్మా ఎలా తయారవుతుంది?
దీనికి మూడు కారణాలు ఉన్నాయి. మొదట, మాంటిల్‌లోని భయంకరమైన వేడి రాళ్లను కరిగిస్తుంది. రెండోది, భూమి ఉపరితలంపై టెక్టానిక్ ప్లేట్లు ఒకదానికొకటి దూరంగా జరిగినప్పుడు, కింద ఒత్తిడి తగ్గుతుంది. దీనివల్ల రాళ్లు సులభంగా కరుగుతాయి. దీన్ని డీకంప్రెషన్ మెల్టింగ్ అంటారు. మూడోది, సముద్రంలోని టెక్టానిక్ ప్లేట్లు మాంటిల్‌లోకి చొచ్చుకుపోయి, నీరు, గాలులను జోడిస్తే, రాళ్లు కరిగే ఉష్ణోగ్రత తగ్గుతుంది. ఈ కారణాల వల్ల మాంటిల్‌లో మాగ్మా ఏర్పడుతుంది.


మాగ్మా గట్టి రాళ్ల కంటే తేలికగా ఉంటుంది. అందుకే అది హీలియం బెలూన్ గాలిలో ఎగిరినట్టు, భూమి ఉపరితలంలోని పగుళ్ల ద్వారా పైకి వస్తుంది. ఈ మాగ్మా అగ్నిపర్వతాల కింద కొన్ని కిలోమీటర్ల లోతులో మాగ్మా చాంబర్స్‌లో నిల్వ ఉంటుంది. ఈ చాంబర్స్ ఒక ట్యాంక్ లాంటివి, మాగ్మాను సేకరిస్తాయి.

అగ్నిపర్వతం ఎప్పుడు విస్ఫోరిస్తుంది?
మాగ్మా చాంబర్‌లో ఒత్తిడి పెరిగినప్పుడు. ఈ ఒత్తిడి మాగ్మాలో కరిగిన కార్బన్ డయాక్సైడ్, నీటి ఆవిరి లాంటి వాయువుల వల్ల వస్తుంది. సోడా బాటిల్‌ను షేక్ చేస్తే బుడగలు వచ్చినట్టు, ఈ వాయువులు ఒత్తిడిని పెంచుతాయి. ఒత్తిడి ఎక్కువైనప్పుడు, మాగ్మా అగ్నిపర్వత గొట్టం ద్వారా బయటకు పొంగుతుంది. బయటకు వచ్చిన ఈ మాగ్మానే లావా.

దేన్నైనా కరిగించే శక్తి..!
లావా రకాలు దాని రసాయన గుణాలు, ఉష్ణోగ్రత మీద ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకు, హవాయిలోని బసాల్టిక్ లావా చాలా ద్రవంగా ఉంటుంది. ఇది గంటకు 30 కిలోమీటర్ల వేగంతో ప్రవహిస్తుంది. చల్లబడినప్పుడు ఇది మృదువైన, తాడు లాంటి ఉపరితలాన్ని ఏర్పరుస్తుంది. దీన్ని పహోయిహోయి అంటారు. కానీ ఆండిసిటిక్, రియోలిటిక్ లావా మందంగా, నెమ్మదిగా కదులుతుంది. ఇవి చల్లబడినప్పుడు గరుకైన ఉపరితలం ఏర్పడుతుంది. లావా ఉష్ణోగ్రత 700 నుంచి 1,200 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. ఈ ఎరుపు, నారింజ రంగులో మెరిసే లావా తన దారిలో ఏదైనా కరిగించగలదు.

పిల్లో బసాల్ట్
అగ్నిపర్వతాలే కాదు, సముద్రంలో టెక్టానిక్ ప్లేట్లు దూరంగా జరిగే చోట, మాగ్మా నేరుగా బయటకొచ్చి కొత్త సముద్ర ఉపరితలాన్ని సృష్టిస్తుంది. దీన్ని సీఫ్లోర్ స్ప్రెడింగ్ అంటారు. ఇక్కడ లావా నీటిలో చల్లబడి, దిండు ఆకారంలో రాళ్లుగా మారుతుంది. దీన్ని పిల్లో బసాల్ట్ అంటారు. భూమి మీద, ఐస్‌లాండ్, పశ్చిమ అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో పగుళ్ల నుంచి లావా బయటకొచ్చి, విశాలమైన లావా క్షేత్రాలను ఏర్పరుస్తుంది.

లావా చల్లబడిన తర్వాత బసాల్ట్, ఒబ్సిడియన్ లాంటి ఇగ్నియస్ రాళ్లుగా మారుతుంది. ఈ రాళ్లు భూమి ఉపరితలంలో భాగమవుతాయి. కొన్ని రాళ్లు క్షీణించి, టెక్టానిక్ ప్రక్రియల ద్వారా మళ్లీ మాంటిల్‌లోకి వెళతాయి. అక్కడ నుంచి మళ్లీ ఈ చక్రం మొదలవుతుంది.

Related News

Vivo T4R 5G vs iQOO Z10R 5G vs OnePlus Nord CE: 5 ఢీ అంటే ఢీ.. ఈ మూడు ఫోన్లలో ఏది బెస్ట్ తెలుసా?

Galaxy A55 vs Xiaomi 14 CIVI vs OnePlus Nord 5: మూడు ఫోన్లలో ఏది బెటర్.. విన్నర్ ఎవరెంటే?

iQOO Z10 Turbo+ 5G: iQOO Z10 టర్బో+ 5G లాంచ్.. ప్రీమియం ఫోన్లకు పోటీనిచ్చే మిడ్ రేంజ్ సూపర్ ఫోన్

Instagram New Feature: అయిపాయే.. ఇన్‌స్టాలో లైక్స్ చేస్తే వాళ్లు కూడా చూసేస్తారా!

Block Spam Calls: స్పామ్ కాల్స్‌తో విసిగిపోయారా? ఈ సెట్టింగ్స్‌తో ఈజీగా బ్లాక్ చేయండి

AI Bike Garuda: ముగ్గురు విద్యార్థుల సృష్టి.. దేశంలో ఫస్ట్ ఏఐ బైక్, ఖర్చు ఎంతో తెలుసా?

Big Stories

×