నాసా నిత్యం అంతరిక్షం పై పరిశోధనలు చేస్తూనే ఉంటుంది. భూమి లాంటి గ్రహాలు ఎన్ని ఉన్నాయో తెలుసుకునేందుకు, అలాగే అక్కడ జీవం ఉందో లేదో అంచనా వేసేందుకు ప్రయత్నిస్తూ ఉంటుంది. అలా చేసిన ప్రయత్నాల్లో కొన్ని ప్రత్యేకమైన, కొత్త గ్రహాలు బయటపడుతూ ఉంటాయి. ఇప్పుడు అలాంటి ఒక గ్రహం గురించే మనం చెప్పుకోబోతున్నాము. ఇది భవిష్యత్తులో అంతరిక్షంలో పెద్ద విస్ఫోటనానికి కారణమయ్యే అవకాశం ఉంది.
విశ్వంలో ఉన్న వేల గ్రహాలలో HIP67522b అనే గ్రహం కూడా ఒకటి. దాని చుట్టూ ఒక నక్షత్రం తిరుగుతూ ఉంటుంది. అది దాని ఉపగ్రహం. ఈ గ్రహము తన చుట్టూ తిరుగుతున్న నక్షత్రానికి అతి దగ్గరగా సంచరిస్తోంది.
ఎందుకు ఈ గ్రహం ప్రమాదకరం?
HIP67522b అనే గ్రహమం గురు గ్రహం అంతా పరిమాణంలో ఉంటుంది. ఇది దాని నక్షత్రానికి చాలా దగ్గరగా తిరుగుతోంది. కేవలం ఏడు రోజుల్లోనే తన నక్షత్రం చుట్టూ కక్ష్యను పూర్తి చేస్తుంది. అంటే అది అత్యధిక వేగంతో తిరుగుతోంది. ఈ వేగం కారణంగా ఆ నక్షత్రానికి సంబంధించిన అయస్కాంత క్షేత్రాలకు భంగం కలుగుతోంది. దీనివల్ల ఆ నక్షత్రం పై భయంకరమైన పేలుళ్లు సౌర జ్వాలలు వస్తున్నాయి.
భూమికి నష్టమా?
ఈ గ్రహం అతి వేగంగా, దగ్గరగా తిరగడం వల్ల నక్షత్రం ఉపరితలం తీవ్రమైన ప్రభావం చూపిస్తున్నాయి. దీనివల్ల అక్కడ తీవ్రమైన సౌర జ్వాలలతో, పేలుళ్లు వంటివి సంభవించే అవకాశం పెరిగిపోతోంది. టెలిస్కోప్ ద్వారా నక్షత్రంలో జరుగుతున్న వింత పనుల గురించి నాసా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ గ్రహం నక్షత్రాన్ని దాటి వెళుతున్నప్పుడల్లా 15 కు పైగా జ్వాలలు, విస్ఫోటనాలు జరుగుతున్నట్టు గుర్తించారు. అయితే ఆ జ్వాలలు భూమి వైపు దిశలోనే కనిపిస్తున్నాయి. అందుకే నాసా శాస్త్రవేత్తలు ఆ గ్రహం పై దృష్టిని సారించారు.
ఒక గ్రహం దాని చుట్టూ ఉండే ఉపగ్రహాన్ని ఇంతగా ప్రభావితం చేయడం ఇదే మొదటిసారి అని నాసా చెబుతోంది. ఈ గ్రహం ఆ ఉపగ్రహం తాలూకా అయస్కాంత రేఖలను కదిలించి దాని ఉపరితలంపై వినాశనానికి కారణమయ్యే పేలుళ్లను సృష్టిస్తోంది. దీన్ని చూసి శాస్త్రవేత్తలు కూడా ఆశ్చర్యపోతున్నారు. కొన్నాళ్లకు అది టైం బాంబులా మారి పేలిపోయే అవకాశం ఉంటుంది. అదే జరిగితే దాని ముక్కలు ఇతర గ్రహాల వైపుగా చెల్లాచెదురుగా పడవచ్చు. భూమి వైపు వచ్చే అవకాశం ఎంతవరకు ఉంటుందో కూడా నాసా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
ఏదైనా గ్రహం లేదా ఉపగ్రహం, నక్షత్రం తాలూకా అయస్కాంత క్షేత్రాలు చాలా శక్తివంతమైనవి. వాటికి అంతరాయం కలిగితే తీవ్ర విస్ఫోటనాలు జరిగే అవకాశం ఉంటుంది. ఇది చుట్టూ ఉండే గ్రహాలపై కూడా ఎంతో ప్రభావాన్ని చూపిస్తుంది.
HIP67522b అని పిలిచే ఈ గ్రహం సూర్యుడు కంటే కూడా కొంచెం పెద్దదిగానే ఉంటుంది. భూమి నుండి 407 కాంతి సంవత్సరాల దూరంలో ఇది ఉంది. కాంతి సంవత్సరం అంటే .. కాంతి ఒక సంవత్సరంలో ప్రయాణించే దూరం. అంటే 5.9 ట్రిలియన్ మైళ్ళు. కిలోమీటర్ల లో చెప్పాలంటే 9.5 ట్రిలియన్ కిలోమీటర్లు.
ఈ గ్రహం నిత్యం వేడెక్కిపోతూ ఉంటే వందల మిలియన్ల సంవత్సరాల తర్వాత ఈ గ్రహం ద్రవ్యరాశి తగ్గిపోతూ ఉంటుంది. అంటే గురు గ్రహం సైజులో ఉన్న ఈ గ్రహం, చివరికి నెప్ట్యూన్ గ్రహం సైజుకు వచ్చేస్తుంది. ఆ తర్వాత అది ఎప్పుడైనా పేలిపోవచ్చు. అందుకే దీన్ని టైం బాంబుగా చెబుతున్నారు నాసా శాస్త్రవేత్తలు.