BigTV English

Stomach Cancer: ఈ బ్లడ్ గ్రూపు ఉన్నవారికి పొట్ట క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువ, జాగ్రత్తగా ఉండాల్సిందే

Stomach Cancer: ఈ బ్లడ్ గ్రూపు ఉన్నవారికి పొట్ట క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువ, జాగ్రత్తగా ఉండాల్సిందే

క్యాన్సర్ తీవ్రమైన ప్రాణాంతక వ్యాధి. అది వచ్చిందంటే జీవితాన్ని నాశనం చేస్తుంది. ఆ వ్యక్తికి ఆరోగ్యాన్ని దూరం చేస్తుంది. అయితే ఒక వ్యక్తి బ్లడ్ గ్రూపును బట్టి కూడా అతనికి వచ్చే క్యాన్సర్ రకాలు ఆధారపడి ఉంటాయి. ముఖ్యంగా పొట్ట క్యాన్సర్ వచ్చే అవకాశం A బ్లడ్ గ్రూపు లేదా AB బ్లడ్ గ్రూపు ఉన్నవారికి ఎక్కువని తేలింది 2019లో ఒక క్యాన్సర్ నివేదిక ప్రకారం A పాజిటివ్ లేదా A నెగటివ్, AB నెగిటివ్ లేదా AB పాజిటివ్ బ్లడ్ గ్రూపు ఉన్నవారు భవిష్యత్తులో పొట్ట క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని అధికంగా కలిగి ఉంటారని తెలిసింది.


ఏమిటి సంబంధం?
అధ్యయనం ప్రకారం ఇతర బ్లడ్ గ్రూపులతో పోలిస్తే ఈ రెండు బ్లడ్ గ్రూపుల వారు పొట్ట క్యాన్సర్ విషయంలోనూ ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే రక్త వర్గానికి పొట్ట క్యాన్సర్ కు మధ్య సంబంధం ఏమిటనే సందేహం ఎక్కువ మందికి వస్తుంది. రక్త గ్రూపుల మధ్య కొన్ని జీవ సంబంధమైన తేడాలు ఉంటాయి. అవే వారికి వచ్చే వ్యాధుల ప్రమాదం పెంచుతాయి. ఏ బ్లడ్ గ్రూపు, ఏబి రక్త గ్రూపులు ఉన్నవారు O రక్త గ్రూప్ ఉన్నవారితో పోలిస్తే పొట్టలో తక్కువ ఆమ్లాలను ఉత్పత్తి చేస్తారు.

మరొక పరిశోధన ప్రకారం A బ్లడ్ గ్రూపు ఉన్నవారికి హెలికోబాక్టర్ పైలోరి అనే ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. హెలికోబాక్టర్ పైలోరి అనేది పొట్ట క్యాన్సర్ తో ముడిపడి ఉన్న ఒక రకమైన బ్యాక్టీరియాగా చెప్పుకోవాలి. ఇది ఎంతో ప్రమాదకరమైనది. అధ్యయనాల ప్రకారం A బ్లడ్ గ్రూప్ ఉన్నవారికి ఈ బ్యాక్టీరియా కారణంగానే పొట్ట క్యాన్సర్ వచ్చే ప్రమాదం చాలా వరకు పెరుగుతుంది. కాబట్టి ముందు నుంచే వారు ఆహారపు అలవాట్లు, జీవనశైలి విషయంలో జాగ్రత్తగా ఉంటే భవిష్యత్తులో పొట్ట క్యాన్సర్ బారిన పడకుండా జాగ్రత్త పడొచ్చు.


గతంతో పోలిస్తే క్యాన్సర్ కేసులు ఇప్పుడు అధికంగా నమోదవుతున్నాయి. దీనికి కారణం చెడు ఆహారం, నిశ్చల జీవనశైలి అని కూడా చెప్పుకోవాలి. వ్యాయామం చేయకుండా రోజంతా కూర్చోవడం, పడుకోవడం వంటివి చేయడం చాలా ప్రమాదకరం. అలాగే ఎక్కువ ఉప్పు, పంచదార, నూనెతో వండిన ఆహారాలకు దూరంగా ఉండాలి. ప్రాసెస్ట్ ఆహారానికి కూడా దూరంగా ఉండాలి. అప్పుడే మీరు ఆరోగ్యంగా జీవించగలరు.

Related News

ChatGPT: చాట్ జీపీటీని నమ్మాడు.. ఇక అతడు బతికేది ఐదేళ్లే

Digestion: జీర్ణ సమస్యలా ? ఈ టిప్స్‌‌తో.. చెక్ పెట్టండి !

Tomato Benefits: రోజుకో టమాటో తింటే.. ఇన్ని లాభాలా ?

Hair Straightening: పర్మనెంట్ హెయిర్ స్ట్రెయిటనింగ్‌తో.. ఇన్ని నష్టాలా ?

Vitamin D Supplements : విటమిన్ డి సప్లిమెంట్స్ వాడితే.. ముసలితనమే రాదట !

Children Growth: పిల్లలు వయస్సు తగ్గ ఎత్తు పెరగాలంటే ?

Big Stories

×