Air Cooler: వేసవి కాలం వచ్చేసింది. మండే ఎండల కారణంగా ఇంటిని చల్లగా ఉంచుకోవడం చాలా అవసరం. ప్రస్తుతం మార్కెట్లో అనేక రకాల కూలర్లు అందుబాటులో ఉన్నాయి. కానీ ఎలాంటి అవగాహన లేకుండా కూలర్లను కొనే వారు చాలా మందే ఉంటారు. తర్వాత డబ్బులు వెస్ట్ చేశామని కూలర్ సరిగ్గా పనిచేయడం లేదని అనుకుంటాము. ఇలాంటివి జరగకుండా ఉండాలంటే.. కూలర్ కొనేటప్పుడు కొన్ని విషయాలను గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. సరైన కూలర్‌ను కొనడం ద్వారా.. మీరు మంచి కూలింగ్‌ను పొందడమే కాకుండా డబ్బును కూడా ఆదా చేసుకోవచ్చు. ఇంతకీ కూలర్ కొనేటప్పుడు ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలో ఇప్పుడు తెలుసుకుందాం.
గది సైజును బట్టి కూలర్ కొనండి:
పర్సనల్ కూలర్, రూమ్ కూలర్, డెజర్ట్ కూలర్ వంటి అనేక రకాల కూలర్లు ప్రస్తుతం మార్కెట్ లో లభిస్తున్నాయి. ప్రతి కూలర్ నిర్దిష్ట గది పరిమాణానికి అనుగుణంగా రూపొందించబడుతుంది. ఉదాహరణకు ఒక చిన్న గదికి పెద్ద డెజర్ట్ కూలర్ కొనడం సరైన పద్దతి కాదు. ఎందుకంటే వీటికి ఎక్కువ కరెంట్ అవసరం అవుతుంది. అంతే కాకుండా వీటి వల్ల గదిలో ఎక్కువ తేమ ఉండిపోతుంది. ఇలాంటి సందర్భంలో.. మీ గది పరిమాణానికి అనుగుణంగా కూలర్‌ను ఎంచుకోండి. చిన్న గదులకు వ్యక్తిగత కూలర్లు, మధ్య తరహా గదులకు గది కూలర్లు, పెద్ద హాళ్లు లేదా బహిరంగ ప్రదేశాలకు డెజర్ట్ కూలర్లు అనుకూలంగా ఉంటాయి. అందుకే సరైన సైజు కూలర్‌ను ఎంచుకోవడం ద్వారా.. మీరు అనవసరమైన ఖర్చులను నివారించవచ్చు.
కరెంట్:
వేసవి కాలం అంతా కూలర్‌లను ఎక్కువగా ఉపయోగిస్తుంటాం.అందుకే కూలర్ ఎక్కువగా వాడటం వల్ల మీ కరెంట్ బిల్లుపై ప్రత్యక్ష ప్రభావం పడుతుంది. కూలర్ల పరిమాణం బట్టి కరెంట్ ఖర్చవుతుంది. అందుకే కూలర్ కొనేటప్పుడు.. దాని విద్యుత్ వినియోగం లేదా శక్తి సామర్థ్యాలను చెక్ చేయండి. తక్కువ వాటేజ్ కూలర్ తక్కువ కరెంట్ వినియోగిస్తుంది. తక్కువ కరెంట్ ఖర్చుచేసే ఖరీదైన కూలర్‌ను ఎంచుకోవడం మంచిది. దీని ఫలితంగా తక్కువ కరెంట్ బిల్లు వస్తుంది.
Also Read: బడ్జెట్ బ్లాస్ట్..రూ.4000కే 18 లీటర్ల టాటా ఎయిర్ కూలర్
కూలర్ ప్యాడ్ ని చెక్ చేయండి:
సాధారణంగా కూలర్లలో రెండు రకాల ప్యాడ్‌లను ఉపయోగిస్తారు. మొదటిది చెక్క ఉన్ని ప్యాడ్, రెండవది తేనెగూడు ప్యాడ్. చెక్క ఉన్ని ప్యాడ్‌లు తక్కువ ధరలోనే అందుబాటులో ఉంటాయి. అంతే కాకుండా ఇవి ఎక్కువగా కూలింగ్‌ను అందిస్తాయి. కానీ ప్రతి సంవత్సరం వీటిని మార్చవలసి ఉంటుంది. అంతే కాకుండా వీటికి ఎక్కువగా నిర్వహణ ఖర్చులు ఉంటాయి. తేనెగూడు ప్యాడ్‌లకు తక్కువ నిర్వహణ అవసరం అవుతుంది.