Mee Ticket : తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పేసింది. తెలంగాణలోని ఆలయాలు, పర్యాటక ప్రదేశాలు, పార్కులు, మెట్రో ట్రైన్ టికెట్స్ వంటి అన్ని టికెట్ సర్వీసులను ఇకపై ఒకటే ప్లాట్ఫామ్ లో కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పించింది. ఇందుకోసం మీ టికెట్ (Mee Ticket)పేరుతో ఓ యాప్ ను తీసుకొచ్చింది. ఇక ఈ యాప్ ఏంటి? ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.
నిజానికి ఇప్పటివరకు వివిధ రకాల టికెట్లు అన్నీ తీసుకోవడానికి వేరువేరు ప్లాట్ఫామ్స్ ఉన్న సంగతి తెలిసింది. ఎందుకోసం వినియోగదారులు వేరువేరుగా హోటల్స్ ను ఉపయోగించాల్సి ఉండేది. ఇకపై ఇలాంటి సమస్య లేకుండా డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ సర్వీసెస్ డెలివరీ విభాగం మీ టికెట్ ను పరిచయం చేసింది.
Mee Ticket Registration –
ఈ Mee Ticket యాప్ ను ప్లే స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాప్ ఓపెన్ చేసాక రిజిస్టర్ అవ్వాలి. స్క్రీన్ లో మొబైల్ నెంబర్ తో పాటు నాలుగు అంకెల పిన్ ఇచ్చి రిజిస్టర్ అవ్వాలి. దీంతో ప్రతిసారి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. హోమ్ పేజ్ లో కనిపించే ఆప్షన్లను వివిధ అంశాల వారీగా విభజించారు. సెర్చ్ ఆప్షన్ ద్వారా మీకు కావాల్సిన సమాచారాన్ని వెతికే అవకాశం ఉంటుంది.
మీకు కావల్సిన అదనపు వివరాలతో పాటు యాప్ వినియోగంలో ఏవైనా సమస్యలు తలెత్తితే వాటి కోసం హెల్ప్ విభాగం కూడా ఉంటుంది. ఇందులో ఉండే మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ తో తేలికగా కాంటాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.
Metro Tickets In Mee Ticket App –
మెట్రో టికెట్ ఆప్షన్ లోకి వెళ్లి మెట్రో టికెట్లను నేరుగా కొనుగోలు చేయవచ్చు.
Bus Tickets In Mee Ticket App –
ఇందులో త్వరలోనే బస్సు టికెట్స్ సైతం బుక్ చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం అందిస్తుంది.
Parks Tickets In Mee Ticket App –
తెలంగాణలో ఉన్న అన్ని పార్క్స్ కు సంబంధించిన లిస్ట్ ఇందులో ఉంది. వీటిలో బోటింగ్ ఆప్షన్ లోకి వెళ్తే రాష్ట్రంలో ఉన్న వివిధ చోట్ల ఉండే బోటింగ్స్ కనిపిస్తాయి.
Zoo Parks In Mee Ticket App –
జూ పార్క్ సెక్షన్ లో కాకతీయ జులాజికల్ పార్క్, నెహ్రూ జూలాజికల్ పార్క్ తో పాటు కమ్యూనిటీ హాల్ సెక్షన్ లో ESD ఫంక్షన్ హాల్, పీపుల్స్ ప్లాజా సైతం ఉన్నాయి.
Temple Tickets In Mee Ticket App –
ఈ యాప్ ద్వారా టెంపుల్ కి సంబంధించిన టికెట్లు సైతం పొందవచ్చు. ఇందులో తెలంగాణలో ఉన్న అన్ని ప్రముఖ దేవాలయాల టికెట్లతో పాటు అన్ని రకాల సేవా టికెట్లు లభిస్తున్నాయి.
ఇక ఈ యాప్ లో టికెట్స్ కొనుగోలు చేయాలంటే పేమెంట్ యూపీఐ ఆప్షన్ ద్వారా చేయవచ్చు. క్లిక్ చేయగానే మీ మొబైల్ లో ఉన్న యూపీఐ బ్యాంక్ యాప్స్ తో డబ్బులు చెల్లించే అవకాశం ఉంటుంది.
ALSO READ : 2025లో యాపిల్ జాతరే జాతర.. ఏకంగా 20 గ్యాడ్జెట్స్ లాంఛ్