India Squad for England Series: ఫిబ్రవరి 19వ తేదీ నుండి ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రారంభం అవుతుంది. కానీ అంతకుముందే ఈనెల జనవరి 22న స్వదేశంలో ఇంగ్లాండ్ తో ఐదు మ్యాచ్ లు టీ-20 సిరీస్ ప్రారంభం కానుంది. ఆ తరువాత ఫిబ్రవరి 6 నుంచి 3 వన్డేల సిరీస్ మొదలవుతుంది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కి ముందు ఈ సిరీస్ లు ఓ ప్రాక్టీస్ అనుభూతిని ఇస్తాయి. ఇండియా – ఇంగ్లాండ్ మధ్య జరిగే తొలి టీ-20 మ్యాచ్ కలకత్తాలోని ఈడెన్ గార్డెన్స్ లో జనవరి 22న ప్రారంభం అవుతుంది.
Also Read: India Squad for Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ.. భారత జట్టు ప్రకటన.. గిల్ కు బంపర్ ఆఫర్
రెండవ టీ-20 మ్యాచ్ చెన్నై చిదంబరం స్టేడియంలో జనవరి 25న, మూడవ టీ-20 రాజ్కోట్ లో జనవరి 28న, నాలుగోవ టి-20 పూణేలో జనవరి 31న, ఐదవ టి20 ఫిబ్రవరి 2న ముంబైలో జరుగుతాయి. ఈ టి – 20 లకు సూర్య కుమార్ యాదవ్ నాయకత్వంలోని జట్టును ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ టి-20 సిరీస్ ముగిసిన అనంతరం ఫిబ్రవరి 6వ తేదీ నుండి 3 వన్డేల సిరీస్ మొదలవుతుంది. ఇంగ్లాండ్ తో జరిగే ఈ 3 వన్డేల సిరీస్, అలాగే ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం రోహిత్ శర్మ నాయకత్వంలోని జట్టును జనవరి 18వ ప్రకటించారు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్.
ఇంగ్లాండ్ తో 3 వన్డేల సిరీస్, ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కి పూర్తి భారత జట్టు : రోహిత్ శర్మ ( కెప్టెన్), శుభమన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా/హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, అర్షదీప్ సింగ్, యశస్వి జస్వాల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా. అయితే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అదరగొట్టిన తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డికి ఈసారి నిరాశ ఎదురైంది.
పేస్ ఆల్రౌండర్లలో హార్దిక్ పాండ్యా వైపే సెలెక్టర్లు మొగ్గు చూపారు. దీంతో తెలుగు క్రికెట్ అభిమానులు నిరాశకు గురయ్యారు. మరోవైపు పేస్ బౌలర్ మహమ్మద్ సిరాజ్, బ్యాటర్ తిలక్ వర్మను కూడా జట్టులోకి తీసుకోలేదు. దీంతో తెలుగు రాష్ట్రాల నుంచి ఛాంపియన్స్ ట్రోఫీలో ప్రతినిత్యం లేకుండా పోయింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో గాయపడిన బుమ్రా ఛాంపియన్ ట్రోఫీలో ఆడడం అనుమానమైన వార్తలకు తెరపడింది.
Also Read: Actor Chiranjeevi: క్రికెట్ లో చిరంజీవి పెట్టుబడులు.. ఢిల్లీ కాపిటల్స్ తో కలిసి భారీ స్కెచ్ !
ఈ జట్టులో బుమ్రా పేరును సెలెక్టర్లు ప్రకటించారు. కానీ గాయం కారణంగా ఇంగ్లాండ్ తో జరగబోయే మొదటి రెండు వన్డేలకు అతడు అందుబాటులో ఉండడం లేదు. ఇంగ్లాండ్ తో జరగబోయే 3 వన్డేల షెడ్యూల్ వివరాలు చూస్తే ఫిబ్రవరి 6వ తేదీన మొదటి వన్డే నాగపూర్ వేదికగా జరుగుతుంది. ఫిబ్రవరి 9న రెండవ వన్డే కటక్ లోని బారాబతి స్టేడియం వేదికగా జరుగుతుంది. ఫిబ్రవరి 12వ తేదీన మూడవ వన్డే అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరుగుతుంది. ఈ మ్యాచ్ లు ఉదయం 10 గంటలకు ప్రారంభం అవుతాయి.
BCCI have announced the 15-member squad for the three match ODI series against England starting from 6th February, 2025 🇮🇳🏏
Harshit Rana has been added to the squad in place of Jasprit Bumrah for the ODI series against England.#BCCI #INDvENG #ODI #Indiancricket #Insidesport… pic.twitter.com/gLpapQAAs3
— InsideSport (@InsideSportIND) January 18, 2025