Tik Tok – Trump: నెటిజన్లను ఎంతగానో అలరించిన ‘టిక్ టాక్’ మళ్లీ అందుబాటులోకి రాబోతోంది. గతంలో మాదిరిగానే వినియోగదారులకు ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ అందించనుంది. అయితే, ఇండియాలో కాదండోయ్.. అమెరికాలో! ‘టిక్ టాక్’ ప్రొవైడర్లపైనా పెనాల్టీలను విధించమని ట్రంప్ చెప్పడంతో.. షట్ డౌన్ అయిన కొద్ది గంటల్లోనే తమ కస్టమర్లకు తిరిగి సేవలను ప్రారంభించబోతున్నట్లు సోషల్ మీడియా ఫ్లాట్ ఫారమ్ ప్రకటించింది. తమకు మద్దతు తెలిపిన ట్రంప్ కు కృతజ్ఞతలు తెలిపింది. బైడన్ నిషేధం విధించిన తర్వాత టిక్ టాక్ కార్యకలాపాలు నిలిపివేయబడ్డాయి. అయితే, ట్రంప్ హామీతో అమెరికాలోనే సుమారు 17 కోట్ల మంది టిక్ టాక్ యూజర్లకు తమ సేవలను మళ్లీ పునరుద్దరించింది.
ట్రంప్ నకు కృజ్ఞతలు తెలిపిన టిక్ టాక్ యాజమాన్యం
ట్రంప్.. అమెరికా అధ్యక్షుడికిగా జనవరి 20(భారత్ లో 21)న ప్రమాణస్వీకారం చేయనున్నారు. అయన అధికారంలోకి రాగానే టిక్ టాక్ యాప్ యాక్సెస్ ను పునరుద్దరిస్తామని ట్రంప్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో బైడెన్ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు రద్దు కానున్నాయి. అంతేకాదు, టిక్ టాక్ సేవలు నిలిపివేసిన కొద్ది గంటల్లోనే మళ్లీ పునరుద్దరించబడ్డాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ నకు టిక్ టాక్ యాజమాన్యం కృతజ్ఞతలు తెలిపింది. 17 కోట్ల మంది యూజర్లకు టిక్ టాక్ సేవలు అందించడంతో పాటు.. 70 లక్షల మంది చిన్న వ్యాపారాల డెవలప్ మెంట్ కు హామీ ఇచ్చింది. అమెరికాలో టిక్ టాక్ ను మరింత విస్తరించేందుకు ప్రెసిడెంట్ ట్రంప్ తో కలిసి పని చేస్తామని ప్రకటించింది. “మా సర్వీస్ ప్రొవైడర్లతో ఒప్పందం ప్రకారం.. టిక్ టాక్ సేవలను పునరుద్ధరించే ప్రక్రియ కొనసాగుతోంది. 170 మిలియన్లకు పైగా అమెరికన్లకు టిక్ టాక్ ను అందించడంతో పాటు 7 మిలియన్లకు పైగా చిన్న వ్యాపారాలు అభివృద్ధి చెందడానికి ట్రంప్ అనుమతించారు. మా సర్వీస్ ప్రొవైడర్లు ఎటువంటి జరిమానాలు ఎదుర్కోవాల్సి ఉండదని స్పష్టమైన హామీని ఇచ్చినందుకు ప్రెసిడెంట్ ట్రంప్ నకు థ్యాంక్స్ చెప్తున్నాం. టిక్ టాక్ ను యునైటెడ్ స్టేట్స్ లో ఉంచేందుకు మేము ట్రంప్‌తో కలిసి పని చేస్తాం” అని టిక్ టాక్ యాజమన్యం ప్రకటించింది.
STATEMENT FROM TIKTOK:
In agreement with our service providers, TikTok is in the process of restoring service. We thank President Trump for providing the necessary clarity and assurance to our service providers that they will face no penalties providing TikTok to over 170…
— TikTok Policy (@TikTokPolicy) January 19, 2025
గతంలో వ్యతిరేకం.. ఇప్పుడు అనుకూలం..
2020లో టిక్ టాక్ కంపెనీ అమెరికన్ల వ్యక్తిగత సమాచారాన్ని చైనా ప్రభుత్వంతో పంచుకుంటుందని, దానిపై నిషేధం విధించాలని అమెరికా ప్రభుత్వం నిర్ణయించింది. వాస్తవానికి గతంలో ట్రంప్ ప్రెసిడెంట్ గా ఉన్న సమయంలో టిక్ టాక్ పై నిషేధం విధించాలని ట్రంప్ కూడా వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో బైడెన్ సర్కారు తీసుకొచ్చిన చట్టాన్ని కాంగ్రెస్ అమలు చేసింది. టిక్ టాక్ చైనీస్ మాతృ సంస్థ తొమ్మిది నెలల్లోపు అమెరికాకు అమ్మాలని ఆదేశించింది. ఈ నిర్ణయంతో టిక్ టాక్ అమెరికాలో తన సేవలను నిలిపివేసింది. తాజాగా ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించడంతో కీలక నిర్ణయం తీసుకున్నారు. భద్రతా కారణాల నేపథ్యంలో టిక్ టాక్ లో 50 శాతం వాటాను అమెరికాకు విక్రయించాలని సూచించారు. తాను అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత టిక్ టాక్ మీద నిషేధాన్ని ఎత్తివేస్తూ ఎగ్జిక్యుటివ్ ఆర్డర్ జారీ చేయనున్నారు.
Read Also: లా నీనా వస్తోంది.. ఇండియాపై అలాంటి ప్రభావం, అసలు ఏంటిదీ?