భార్యాభర్తల బంధం ఎంతో అమూల్యమైనది. ఆ బంధం శాశ్వతమైనదిగా మార్చుకోవాలంటే జీవిత భాగస్వాములు ఇద్దరిలోనూ ఆ సంకల్పం ఉండాలి. సాధారణంగా పిల్లలు పుట్టాక దంపతుల మధ్య దూరం పెరుగుతుంది. ఆ దూరం కాస్త ప్రేమ తగ్గేలా చూస్తుంది. ఎందుకంటే పిల్లల పైన ధ్యాసం పెట్టడం వల్ల జీవిత భాగస్వాములు ఒకరిపై ఒకరు ఆసక్తి చూపించుకోలేరు. తిరిగి వారి బంధం బలోపేతం చేసుకోవడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. పిల్లలు పుట్టిన తర్వాత కూడా సులువుగా భార్యాభర్తల బంధాన్ని మునుపటిలా మార్చుకునేందుకు ప్రయత్నించండి.
ఇద్దరు దంపతులు ముగ్గురవడం ఎంతో ఆనందకరమైన సంఘటన. పిల్లల బాధ్యతలు కూడా ఇద్దరూ పంచుకోవాలి. ఒకరి ఇంటి పనులు చేస్తే మరొకరు పాపాయిని చూసుకోవాలి. నిత్యం పనులు చేస్తున్నట్టే అనిపిస్తుంది. అందుకే ఇద్దరికీ మానసికంగా శారీరకంగా తీవ్రంగా అలసిపోయినట్టు అనిపిస్తుంది. సమయం దొరికితే నిద్రపోవడానికి ఆసక్తి చూపిస్తారు. ఒకరిపై ఒకరు ప్రేమ కురిపించుకోవడానికి సమయం దొరకదు. దీనివల్లే జీవిత భాగస్వాముల మధ్య దూరం పెరిగినట్టు అనిపిస్తుంది. జీవితం భార్య భర్త పైన లేదా భర్త భార్యపైన చిటికీమాటికీ చికాకు పడుతూ ఉండడం ఏదో ఒకటి అనడం వంటివి జరుగుతూ ఉంటాయి. ఇది కేవలం శారీరక అలసట, మానసిక అలసట వల్లే కలుగుతుంది. అలాంటి సమయంలో కూడా ఇద్దరు ప్రేమగా ఉంటే ఎందుకు ప్రయత్నించాలి.
పిల్లలు నిద్రపోయే సమయం ఎక్కువగానే ఉంటుంది. నెలల పిల్లలు రోజులో సగం గంటలు నిద్రలోనే ఉంటారు. వారు నిద్రపోతున్నప్పుడే కాసేపు భార్యాభర్తలు అన్యోన్యంగా గడిపేందుకు ప్రయత్నించాలి. ఒకరితో ఒకరు ప్రేమగా మాట్లాడుకోవాలి. పిల్లల పాలన ఎలా చూసుకోవాలో చర్చించుకోవాలి. పాపాయి నిద్రపోయినప్పుడే భార్యాభర్తలిద్దరూ కలిసి ఏదో ఒక పని చేసేందుకు ప్రయత్నించాలి. కలిసి వండుకోవడం, కలిసి టీవీ చూడడం, ఏదైనా ఆటలు ఆడడం వంటివి చేయాలి. కుటుంబ సభ్యులు ఎవరైనా ఇంటికి వస్తే పాపాయిని వారికి అప్పగించి భార్యాభర్తలిద్దరూ మార్కెట్ కు వెళ్లడం, కిరాణా సామాన్లు కొనడం వంటివి చేస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల ఇద్దరు ఒకరికొకరు మళ్ళీ దగ్గరవుతారు.
పిల్లలు పుట్టాక చాలామంది తల్లులు ఆ చంటి పాపాయి దగ్గరే పూర్తిగా ఉండిపోతారు. జీవిత భాగస్వామిని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తారు. ఇలా చేయడం వల్లే మగవారు ఇంటికి వచ్చేందుకు ఇష్టపడరు. కాబట్టి పిల్లలు పుట్టాక మహిళలు భర్తలకు కూడా కాస్త సమయాన్ని ఇవ్వాలి. ఇందుకోసం పాపాయిని నిద్రపుచ్చాక భర్తతో కలిసి గడిపేందుకు ప్రయత్నించాలి. ఒకరికి ఇష్టమైన వంటకాలు మరొకరు వండి పెట్టుకోవాలి. పిల్లలను ఉయ్యాల్లో వేసి ఊపుతూ కూడా మాట్లాడుకోవచ్చు.
పిల్లలు కూర్చునే వయసుకు వస్తే వారి చేతికి ఏదో ఒక వస్తువు ఇచ్చినా వారు ఆడుకుంటూ ఉంటారు. అలా పిల్లలను పక్కన పెట్టుకొని కూడా భార్యాభర్తలు కాసేపు సంతోషంగా మాట్లాడుకోవచ్చు. మనసుంటే మార్గం ఉంటుందని పెద్దలు ఊరికే అనలేదు. భార్యాభర్తలు అన్యోన్యంగా గడపాలనుకున్నా, ప్రేమగా ఉండాలనుకుంటే ఆ సమయాన్ని వారే సృష్టించుకోవాలి. ఆ సమయాన్ని భార్య ఏర్పరచుకోవాలి. ఇద్దరికీ సర్ ప్రైజ్ గిఫ్టులు ఇచ్చుకోవడం అలవాటు చేసుకోవాలి. పిల్లలు పుట్టగానే పూర్తిగా పిల్లలే లోకంగా ఉంటే జీవిత భాగస్వామి బాధపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం తర్వాత కూడా మీ భార్యాభర్తలిద్దరూ ఆనందంగా గడిపేందుకు ప్రయత్నించాలి.
Also Read: పెయిన్ కిల్లర్స్ వాడుతున్నారా ? ఎంత ప్రమాదమో తెలుసుకోండి